ఏన్ 32 బ్లాక్ బాక్స్ లభ్యం... ప్రమాద వివరాలు తెలుస్తాయా...?
అరుణచల్ ప్రదేశ్‌లో కూలిపోయిన ఏన్ 32 ట్రాన్స్‌పోర్ట్ విమానం యొక్క బ్లాక్ బాక్స్‌ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాధినం చేసుకున్నారు. జూన్ 3న మిస్సైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమాన శకలాలతోపాటు అది కూలిపోయిన ప్రాంతాన్ని రెండు రోజుల క్రితం గుర్తించిన విషయం తెలిసిందే...
ప్రమాదం జరిగిన ఎనమిది రోజుల తర్వాత విమాన ప్రమాద స్థలానికి చేరుకున్న ఐఏఎఫ్ బృందం ఎయిర్ క్రాఫ్ట్‌లోని బ్లాక్ బాక్స్ స్వాధినం చేసుకున్నారు. కాగా బ్లాక్‌ను పరిశోధించడం ద్వార ప్రమాదానికి గల కారణలు వెల్లడికానున్నాయి. ప్రమాదానికి ముందు కాక్‌పీట్‌లో పైలట్ల మధ్య సంభాషణ బ్లాక్ బాక్స్‌లో నిక్షిప్తమై ఉంటుంది. మరోవైపు అందులో 30 పారా మీటర్ల వరకు జరిగిన సంఘటనలు నిక్షిప్తమై ఉంటాయి. విమానానికి సంబంధించిన స్పిడ్, మరియు ఇంజిన్‌లో తలెత్తిన సమస్యలతో పలు అంశాలు రికార్డ్ అవుతాయి. వీటీ విశ్లేషన ద్వార విమానం ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు వెల్లడించనున్నారు అధికారులు.

జూన్ 3న ఆస్సాంలో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమానం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిస్ అయింది.. మధ్యహ్నాం ఒంటిగంట నుండి విమానానికి సంబంధించిన సమాచారం తెలియలేదు. కాగా అస్సాం ఎయిర్ బేస్ నుండి నుండి 12.25 నిమిషాలకు విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన ముప్పై నిమిషాల తర్వాత దానికి సంబంధించిన రాడార్ సమాచారం తెగిపోయింది. విమానంలో 8మంది విమాన సిబ్బంది కాగా మరో 5గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.ఇక ఆ ఎయిర్ క్రాప్ట్‌లో ప్రయాణిస్థున్న 13 మందిలో ఎవ్వరు ప్రాణాలతో మిగిలి లేరని ఐఏఎఫ్ ప్రకటించింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications