37 ఏళ్ల కెరీర్.. 57 సార్లు బదిలీ.. నేడు రిటైర్మెంట్.. ఎవరా ఐఏఎస్

హర్యానా కేడర్‌కు చెందిన ప్రముఖ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిజాయతీకి మారుపేరుగా ప్రస్తావించబడే ఆయన.. తన కెరీర్‌లో 57 సార్లు బదిలీ అయ్యారు. దాదాపు 34 ఏళ్ల కెరీర్ కి నేటితో ముగింపు పలికారు ఈ ఐఏఎస్. దీంతో మరోసారి అశోక్ ఖేమ్కా గురించి చర్చ జరుగుతోంది.

బాల్యం, విద్యాభ్యాసం..

1965లో కోల్‌కతాలో జన్మించారు అశోక్ ఖేమ్కా. 1988లో IIT ఖరగ్‌పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్.. ఆ తర్వాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో PhD పొందారు. అలానే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో MBA పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి LLB పట్టా సైతం పొందారు.

ias-ashok-khemka-got-57-transfers-in-37-years-of-career

రాబర్ట్ వాద్రా భూ ఒప్పందంపై చర్యతో జాతీయ గుర్తింపు..

2012లో ఖేమ్కా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అప్పట్లో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించి ఉన్న గురుగ్రామ్ భూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఆయన వార్తల్లోకి వచ్చారు. భూమి యాజమాన్య హక్కుల బదిలీ (మ్యుటేషన్) ప్రక్రియలో అతని చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటన అనంతరం ఖేమ్కా తరచూ తక్కువ ప్రాధాన్యత గల శాఖలకు బదిలీ అయ్యారు.

తరచూ బదిలీలు..

ఖేమ్కా కెరీర్‌లో సగటున ప్రతి ఆరు నెలలకు ఒకసారి బదిలీ అయ్యారు. ఇది భారత పరిపాలనా వ్యవస్థలోనే అరుదైన విషయం. 2014లో బీజేపీ ప్రభుత్వ ప్రారంభ టర్మ్‌లో రవాణా శాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు. కేవలం నాలుగు నెలల్లోనే బదిలీ అయ్యి.. పది సంవత్సరాల తర్వాత మళ్లీ అదే రవాణా శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా తిరిగి బదిలీ కావడం గమనార్హం.

అవినీతిపై పోరాడతా..

2024లో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసిన ఖేమ్కా.. తనను విజిలెన్స్ విభాగాధిపతిగా నియమించాలంటూ విజ్ఞప్తి చేశారు. అలానే అవినీతిని అంతం చేయాలనే ఉత్సాహంతో తన సర్వీస్ కెరీర్‌ను త్యాగం చేశానని చెప్పుకొచ్చారు. తనకు అవకాశం ఇస్తే నిజమైన యుద్ధం చేస్తనని ఎంతటి వారినైనా వదిలిపెట్టనని ట్వీట్ చేశారు. ఖేమ్కా తన పురావస్తు శాఖ పోస్టింగ్ సమయంలో అధికారుల పని భారం అసమానంగా ఉందని.. తాను పనిచేస్తున్న శాఖలో తగినంత పని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసమానత ప్రజా ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడ్డారు.

అంతే కాకుండా రెండేళ్ల క్రితం తన 1991 బ్యాచ్ మేట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులుగా పదోన్నతి పొందిన సందర్భంలో ఖేమ్కా ట్విట్టర్‌లో స్పందించారు. తన బ్యాచ్‌మేట్స్‌కి అభినందనలు అంటూ.. ఇది సంతోషకరమైన సందర్భమే అయినా.. నేను వెనుకబడిపోయాననే నిరాశ కలుగుతోందన్నారు. నిటారుగా ఉండే చెట్లను మొదట నరికేస్తారు.. అయినా, చింత లేదు నా పట్టుదలను కొనసాగిస్తాను అని పోస్ట్ చేశారు. ఇక గత పన్నెండేళ్లుగా అశోక్ ఖేమ్కా ఎక్కువగా పురావస్తు, ఆర్కైవ్స్ వంటి ప్రాధాన్యత లేని శాఖల్లోనే పనిచేశారు. ఇక నేటితో ఆయన కెరీర్ ముగుస్తుండడం పట్ల ఓ వైపు రాజీ లేని పోరాటం చేశారంటూ ప్రశంసలు వస్తూనే.. మరోవైపు నిజాయతీగా ఉన్నందుకు.. ఇటువంటి బదిలీలు అవుతాయంటూ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+