సినిమాలో ఐటం సాంగ్: అసభ్యకర డ్యాన్స్ చేశాడని ఐఏఎస్ బదలీ
రాంచీ: స్థానిక చిత్రం 'చిల్కారి ఏక్ దర్ద్'లో ఐటం సాంగ్ అసభ్యంగా చేసినందుకు గాను ఓ ఐఏఎస్ అధికారిని జార్ఖండ్ ప్రభుత్వం బదలీ చేసింది. సదరు అధికారి పేరు దినేష్ ప్రసాద్. ఈ విషయాన్ని కొంతమంది వెలుగులోకి తేవడంతో రగడ ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం అతనిని బదలీ చేసింది.
2011వ సంవత్సరంలో ఒకే గ్రామానికి చెందిన 21 మంది ఊచకోత ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఘటనలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు కూడా వధించబడ్డాడు. దీని ఆధారంగా సినిమాను తీస్తున్నారు.

ఆ ఘటన ఆధారంగా తీస్తున్న చిల్కారీ ఏక్ దర్ద్ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో గిరిధ్ జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్ డ్యాన్స్ చేశాడు. ఇది ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. దీనిపై విమర్శలు వచ్చాయి. సదరు అధికారి డ్యాన్స్ చేస్తున్న ఫోటోను స్థానిక పత్రికలు కొన్ని ప్రచురించాయి. దీంతో అతనిని ప్రభుత్వం బదలీ చేసింది.
దీనిపై సదరు అధికారి మాట్లాడుతూ.. తాను ఆ సినిమాలో నటిస్తున్నానని, తన ఉద్యోగం సమయం అయిపోయాక అక్కడకు వెళ్లానని చెప్పారు. ఇది తప్పేం కాదన్నారు. ప్రత్యేక గీతంలో నర్తించడం తప్పంటే ఎలా అన్నారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా, ఈ సినిమాను నిలుపుదల చేయాలని నాడు ప్రమాదం నుండి తప్పించుకున్న మాజీ సీఎం బాబూలాల్ మరాండి సోదరుడు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications