#ICUDiary: మృతుల కుటుంబాలకు సారీ చెప్పేటప్పుడు వైద్యులు ఏం ఆలోచిస్తారు

మీరు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూశారా? డిగ్రీతో సంబంధం లేకుండా, భావోద్వేగాలతో నిండిన గుండెతో చిరంజీవి ఆసుపత్రిలోకి అడుగుపెడతారు. అక్కడ కోమాలో ఉన్న ఓ పిల్లాన్ని ''రోగి’’ అని వైద్యులు సంబోధించడాన్ని ఆయన తట్టుకోలేకపోతారు. ఆ పిల్లాడికి ఎవరు ఎలా పిలుస్తున్నారో తెలియనప్పటికీ ఆయన్ను ఓ రోగిలా మాత్రం చూడకూడదని చిరంజీవి అంటారు.
ఇప్పుడు రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌కు వద్దాం. ఏడాదికిపైగా కరోనావైరస్‌తో వైద్యులు పోరాడుతున్నారు. తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి కళ్లముందే ఎందరో రోగులు మరణిస్తున్నారు. ఆ మృతుల ఫోటోలు, వీడియోలను ఒకసారి చూసి మనం స్క్రోల్ చేసేస్తున్నాం. మరి వైద్యుల పరిస్థితి ఏమిటి?
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు.. మరణాలను చూస్తున్న, మరణం అంచులవరకు వెళ్లినవారికి సేవలందిస్తున్న వైద్యుల్ని కేవలం ''వారియర్లు’’ అంటే సరిపోతుందా?
ఐసీయూ వార్డుల్లో ప్రాణాలతో పోరాడుతున్న కోవిడ్ బాధితులకు నిత్యం చికిత్స అందించడం ఎంత కష్టం. దీన్ని అందరికీ తెలియజేసేలా చేసేందుకు ఐసీయూ డైరీ పేరుతో ఓ సిరీస్‌ను బీబీసీ తెలుగు మీకు అందిస్తోంది.
ఇలా ఐసీయూల్లో సేవలందిస్తున్న వారిలో ఒకరైన డాక్టర్ దీప్‌శిఖా ఘోష్ అనుభవాలతో ఈ సిరీస్ మొదలవుతోంది. కోవిడ్ బాధితుల్ని వైద్యులు కేవలం రోగులుగా మాత్రమే చూడటం లేదని వీటి ద్వారా మనకు అర్థమవుతుంది.
మరణించిన కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యులకు ''సారీ’’అని చెప్పాల్సి వచ్చినప్పుడు.. వైద్యులు తమ మనసుకు కూడా సారీ చెప్పుకొంటారు. ఎందుకంటే వారి మనసును పశ్చాత్తాపం వెంటాడుతుంది.
కొంచెం బాధ.. కొంచెం ఆనందం.. కొన్ని మధురానుభూతులు... ఇలాంటి అనుభవాలతో నిండినదే #ICUDiary.
రేపటివరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం నాలుగు గంటలకు బీబీసీ తెలుగు ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్ పేజీలను చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications