నిన్న ఛత్తీస్‌ఘడ్, నేడు మహారాష్ట్ర : ఐఈడీ బాంబుతో తెగబడ్డ మావోయిస్టులు
ముంబై : సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టులు పెట్రేగిపోతున్నారు. నిన్న ఛత్తీస్‌ఘడ్ దంతేవాడలో బీజేపీ కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డ మావోలు .. ఇవాళ మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించారు. మరికొన్ని గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా .. మందుపాతర పేల్చి అలజడి సృష్టించారు మావోయిస్టులు.
గడ్చిరోలిలో పేలుడు
మహారాష్ట్రలోని గడ్చిరోలి వద్ద మావోయిస్టులు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేల్చారు. ఈ పేలుడుతో సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

నిన్న ఛత్తీస్‌ఘడ్‌లో ..
ఎన్నికల ప్రచారం ముగించి ఇతర నేతలతో కలిసి దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి తిరిగి వస్తున్నారు. క్వాకొండా పోలిస్ స్టేషన్ పరిధిలోని శ్యాంగిరి వద్ద మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చారు. పేలుడుధాటికి వాహనం తునతునాకలైంది. ఎమ్మెల్యే సహా ఐదుగురు పోలీసులు చనిపోయారు.












Click it and Unblock the Notifications