మీ అల్లాకు ఏమైనా చెవుడా- బీజేపీ ఎమ్మెల్యే కాంట్రవర్సీ

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. అల్లా, అజాన్ పై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ- ప్రచార వేడి పతాక స్థాయికి చేరకుంటోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందిక్కడ. మే 12వ తేదీన పోలింగ్ జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ రాజీవ్ కుమార్ కూడా కర్ణాటకలో పర్యటించారు. ఈ క్రమంలో- ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలకు పదును పెడుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. ప్రచారాన్ని ఉధృతం చేశాయి.

 మోదీ సుడిగాలి పర్యటన..

మోదీ సుడిగాలి పర్యటన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే కర్ణాటకకు వచ్చిన విషయం తెలిసిందే. శివమొగ్గలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఆదివారం మళ్లీ కర్ణాటకలో పర్యటించారు. మండ్య, హుబ్లీ-ధార్వాడ్ లో సుడిగాలి పర్యటనలను చేపట్టారు. బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని ప్రారంభించారు. హుబ్లీ-ధార్వాడ్‌ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
బెంగ‌ళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌‌వేను ప్రధాని జాతికి అంకితం చేశారు. సుమారు 17,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు అవి.

 జిల్లా పర్యటనల్లో..

జిల్లా పర్యటనల్లో..

అటు కాంగ్రెస్ పార్టీ కూడా విస్తృతంగా జిల్లా పర్యటనలను చేపట్టింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య బస్సు యాత్రలను నిర్వహిస్తోన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ తొలి విడత ప్రచార కార్యక్రమాలను ముగించుకున్నారు. మలిదశకు సిద్ధపడుతున్నారు. జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పంచరత్నాలు పేరుతో ప్రచారాన్ని చేపట్టారు.

మాటల తూటాలు..

మాటల తూటాలు..

ఈ క్రమంలో మాటల తూటాలు ఆయా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ విమర్శలు శృతి మించుతున్నాయి కూడా. బీజేపీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఏకంగా అల్లాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో వినిపించే అజాన్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. దీనిపై విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. ముస్లిం నాయకులు ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నారు.

అజాన్ తో తలనొప్పి..

అజాన్ తో తలనొప్పి..

మంగళూరులో నిర్వహించిన ప్రచార సభలో ఈశ్వరప్ప మాట్లాడే సమయంలో సమీపంలో ఉన్న మసీదు నుంచి అజాన్ వినిపించింది. దీనితో ఆయన ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈ అజాన్.. పెద్ద తలనొప్పిగా మారిందని అన్నారు. తాను ఎక్కడికి వెళ్తే.. అక్కడ అజాన్ వినిపిస్తోందంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. అజాన్ నియంత్రణపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటీషన్లు విచారణ దశలో ఉన్నాయని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ- త్వరలోనే దీనికి బ్రేక్ పడుతుందని అన్నారు.

 అల్లా.. చెవిటివాడా..

అల్లా.. చెవిటివాడా..

మైక్రో ఫోన్లు, లౌడ్ స్పీకర్లను ఉపయోగించి ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఏముందని ఈశ్వరప్ప ప్రశ్నించారు. ముస్లింల కంటే భక్తిశ్రద్ధలతో హిందువులు కూడా ఆలయాల్లో పూజలు, భజనలు చేస్తుంటారని, ఇలా లౌడ్ స్పీకర్లను ఉపయోగించి పెద్ద పెద్ద శబ్దాలు చేయరని అన్నారు. ఇలా పెద్ద పెద్ద శబ్దాలతో ప్రార్థనలు చేయడానికి అల్లాకు ఏమైనా చెవుడా? అని ఈశ్వరప్ప ప్రశ్నించారు. అల్లా చెవిటివాడైతేనే ఇలా లౌడ్ స్పీకర్లతో ప్రార్థనలు చేస్తారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+