లేదంటే రాహుల్ గాంధీకి భార్య రావాలి: సాద్వి ప్రాచి, ముస్లీం అమ్మాయిలకు సూచన

న్యుఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాద్వి ప్రాచి చురకలు అంటించారు. ఆయనకు పెళ్లి కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఆమె యూపీలోని బాబా గోరక్‌నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడారు.

నేను ఈ ఆలయానికి తరచూ వస్తుంటానని, ఈ సారి మాత్రం ప్రత్యేక కోరిక కోరాలని వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ సాధించకుంటే రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలని కోరుకున్నానని చెప్పారు.

 If Congress Doesnt Win, I Pray Rahul Gandhi Gets A Wife: Sadhvi Prachi

రాహుల్ గాంధీ పెళ్లిపై చేసిన వ్యాఖ్యల మీద యూపీకాంగ్రెస్‌ నేత అశోక్‌ సింగ్‌ స్పందించారు. రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనేతలను హేళన చేస్తూ మాట్లాడడం వారికి ఓ ట్రెండ్‌లా మారిందని, ఇలాంటి వ్యాఖ్యలపై ఆధారపడే తమ ఉనికిని నిలబెట్టుకోవాలనుకుంటున్నారని, సాధ్వి ఇలా మాట్లాడడం సరికాదన్నారు.

ముస్లీం యువతులకు సూచన

ఇస్లాం మతం ప్రమాదకర మతం కాబట్టి ముస్లీం యువతులు హిందుత్వంలోకి మారి హిందూ యువకులను పెళ్లాడాలని సాద్వి ప్రాచి అన్నారు. ట్రిపుల్ తలాక్, హలాలా వంటి వాటి నుంచి ముస్లీం యువతులు తమను తాము రక్షించుకోవాలన్నారు. వారు హిందుత్వంలోకి మారితే జీవితాంతం హిందూమతం వారిని కాపాడుతుందన్నారు. శతాబ్దాలుగా ముస్లీం మతంలో వారు ఎదుర్కొంటున్న వాటి నుంచి బయటపడతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+