డీకే అరెస్టుతో నాకేం లాభం, విడుదలైతే హ్యాపి, బీజేపీకి లింక్ లేదు, సీఎం యడియూరప్ప !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి అరెస్టుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప స్పందించారు. డీకే. శివకుమార్ అరెస్టు పట్ల తాను చింతిస్తున్నానని, ఆయన విడుదలైతే మొదట సంతోషించేది తానే అని సీఎం యడియూరప్ప అన్నారు. డీకే శివకుమార్ అరెస్టుకు బీజేపీకి లింక్ లేదని, ఆయన అరెస్టు అయితే తనకు ఏం లాభం అని సీఎం యడియూరప్ప ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.
డీకే. శివకుమార్ అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపణలను సీఎం యడియూరప్ప ఖండించారు. డీకే. శివకుమార్ అరెస్టు తనకు ఎలాంటి సంతోషాన్ని తెచ్చిపెట్టలేదని సీఎం యడియూరప్ప అన్నారు. డీకే. శివకుమార్ త్వరగా విడుదల కావాలని ఆదేవుడిని వేడుకుంటున్నానని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పారు.

తన జీవితంలో ఎవర్నీ శత్రువులుగా చూడలేదని, తన వలన ఎవ్వరికీ హాని జరగలేదని ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. చట్టం తనపని తాను చేసుకుని వెలుతుందని, డీకే. శివకుమార్ విషయంలో అదే జరిగిందని, ఇందులో బీజేపీ ప్రమేయం ఏమాత్రం లేదని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు.
మరోవైపు తన అరెస్టుతో బీజేపీ నాయకులు చాల సంతోషంగా ఉన్నారని డీకే. శివకుమార్ ఆరోపించారు. తన మీద పెట్టిన ఐటీ, ఈడీ కేసులు పూర్తిగా రాజకీయంగా జరిగినవే అని డీకే. శివకుమార్ ఆరోపించారు. తన అరెస్టుతో బీజేపీ అనుకున్నది సాదించిందని, వారి కల ఈ రోజుటికి ఫలించిందని, తాను బీజేపీ భాదితుడని మాజీ మంత్రి, డీకే. శివకుమార్ ఆరోపించారు.
-
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
విజయ్ చుట్టూ వల- నయానో, భయానో -
రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!! -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!? -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్!












Click it and Unblock the Notifications