ప్రియాంక వస్తే బీజేపీకి చిక్కులే: రాందేవ్ బాబా వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగిస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల పలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురవుతోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను రాహుల్ గాంధీకి కాకుండా ప్రియాంక గాంధీకి ఇవ్వాలనే వాదనలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి వాదనలు చాలా రోజులుగా ఉన్నాయి. అయితే, రాందేవ్.. ప్రియాంకకు బాధ్యతలు అప్పగిస్తే బీజేపీకి చిక్కులేనని చెప్పడం గమనార్హం.

ఆయన నవభారత్ టైమ్స్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించారు. రాందేవ్ బాబా మాట్లాడుతూ.. సోనియా కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా పేరును ప్రస్తావించారు. కాంగ్రెస్ బాధ్యతలు ఆమె చేపడితే... బీజేపీ మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications