అలర్ట్.. ఓటర్ ఐడీ తప్పులు సరిచేసేందుకు ఈసీ చాన్స్.. ఎలాగంటే
న్యూఢిల్లీ : మీ ఓటరు గుర్తింపు కార్డులో పేరు, ఇతర అంశాలు తప్పుగా ఉన్నాయా ? అవి మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లాగిన్ అయి ... మార్పు, చేర్పులు చేసుకొండి. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆఫ్ లైన్‌కు సంబంధించి ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తామని సమాచారం ఇచ్చింది.
ఓటరు గుర్తింపు కార్డులో తప్పులు సవరించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కార్డులో పేరు, తండ్రిపేరు, వయస్సు, పుట్టిన తేదీ, అడ్రస్ తప్పులను సవరించుకోవాలని సూచించింది. సెప్టెంబర్‌లో www.nvsp.in వెబ్ సైట్‌లో లాగిన్ అయి .. మార్పులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే మార్పు చేసే సంబంధిత అంశానికి సంబంధిత ఆధారాలను సమర్పించాలని మెలిక పెట్టింది.

ఆయా వయోజనుల ప్రతిపాదనలకు సంబంధించి అక్టోబర్ 15న ముసాయిదా విడుదల చేస్తామని ప్రకటించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే నవంబర్ 30 వరకు అబ్జెక్షన్స్ స్వీకరిస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించి మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం నవంబర్ 2,3,9,11 తేదీల్లో ప్రత్యేకంగా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications