భారత్‌లోని ఈ రెండు గ్రామాల్లో నాన్‌వెజ్ తింటే కఠిన శిక్షలు తప్పవు..
దేశంలో నాన్ వెజ్ తినని వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ, ఓ ఊరిలోని గ్రామస్థులంతా నాన్‌వెజ్ తినకుండా ఉంటారంటే..? ఎవరైనా నమ్ముతారా.? ఇది నిజమేనండి. భారత్‌లోని ఓ రెండు గ్రామాల్లోని ప్రజలు నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. వారంతా శాకాహారులే. పొరపాటున నాన్‌వెజ్ తిన్నారా..? వారి పని ఇక అంతే..శాకాహారులకు అడ్డగా మారిన ఆ గ్రామాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం పదండి..
మన దేశంలో ఏ ఊర్లో అయినా శాఖాహారం, మాంసాహారం తినేవారుంటారు. ఎక్కువ శాతం నాన్‌వెజ్ తినే వారుంటారు. అయితే, ఇండియాలోని ఓ రెండు గ్రామాల్లోని ప్రజలు మాత్రం ఎన్నే ఏళ్లుగా నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. ఆ ఊర్లోని వారంతా మాంసాన్ని వారి దరి దాపుల్లోకి కూడా రానివ్వరట. ఊళ్ళో ఎవరైనా నాన్ వెజ్ తింటే ఇక అంతే, వారికి కఠిన శిక్షలు అమలు అవుతాయట. భారత్‌లోని ఆ రెండు శాఖాహార గ్రామాల్లో ఒకటి బిహార్ లో ఉంటే, మరొటి మహారాష్ట్రాలో ఉంది.

శాకహారులుగా మారాల్సిందే...
బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో బిహియా అనే గ్రామం ఉంది. ఆ ఊర్లోని ప్రజలు దాదాపు మూడు శతాబ్దాలుగా ఎంతో నియమ నిష్ఠలతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో మొత్తం 400 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ 300 ఏళ్ల నుంచి శాకహారమే తింటున్నారు. ఈ గ్రామస్థులు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే కేవలం శాకాహారమే తినాలి వీరి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడి వారు ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని ఈ తరం వారు కూడా పాటించడం విశేషం. అంతేకాదండోయ్.. ఈ గ్రామంలోని వారిని పెళ్లిచేసుకోవాలంటే వారు కూడా శాకహారులుగా మారాల్సిందే. ఈ గ్రామంలోని వారు మద్యపానానికి కూడా దూరంగా ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటివి కూడా తినరట.
రేనవి గ్రామం...
మరో శాకహారి గ్రామం మహారాష్ట్రలో సాంగ్లీ జిల్లాలో ఉంది. ఇదే ఖానాపూర్ తాలూకాలో రేనవి అనే గ్రామం. ఇక్కడివారు కొన్ని వందల సంవత్సరాలుగా శాఖాహారులుగా జీవిస్తున్నారు. వీరంతా అస్సలు మాంసాన్ని ముట్టుకోరు. ఈ గ్రామంలో ప్రసిద్దిచెందిన పవిత్రమైన రేవణసిద్ధ దేవాలయం ఉంది. ఈ ఆలయం కారణంగానే వీరింతా నాన్ వెజ్ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇక్కడివారిని పెళ్లాడలాన్న వారి నియమాలను పాటించాల్సిందే. శ్రీ రేవణసిద్ధ నాథుని పవిత్ర స్థలాన్ని సందర్శించేందుకు ఎక్కడి నుండో భక్తులు తరలి వస్తుంటారు. మహాశివరాత్రి నుంచి రెనవిలో రేవణసిద్ధ ప్రయాణం మొదలవుతుంది. ఇది దక్షిణ మహారాష్ట్రలో అతిపెద్ద యాత్రగా చెప్పుకుంటారు. రావణుడి మహిమ వల్లే ఈ గ్రామం పూర్తిగా శాఖాహారంగా మారిందని ఇక్కడివారు చెబుతుంటారు












Click it and Unblock the Notifications