Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక రాష్ట్రంలో 33 మంది డీసీఎంలు, చరిత్ర మీరే తిరగరాయండి బ్రదర్, లక్కీచాన్స్ !

బెంగళూరు: ఢిల్లీలో బీజేపీతో (bjp) జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ (congress) నేతల విమర్శలకు ఇరు పార్టీల నేతలు దీటుగా బదులిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (congress) ప్రభుత్వంలో రచ్చరచ్చ అయిన డీసీఎం పదవుల వ్యవహారంతో కమలనాథులు కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ సంచలనం సృష్టించిన డీసీఎం పోరుపై కర్ణాటక బీజేపీ (bjp)సరైన రీతిలో విమర్శలు చేస్తోంది.

కాంగ్రెస్ (congress) ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటినా ఇప్పటికే ఆ పార్టీలో డీసీఎం పదువుల ఎంపికపై చిచ్చు మొదలైంది. ఓ వైపు డీసీఎం డీకే శివకుమార్ వర్గం, మరోవైపు సీఎం సిద్ధరామయ్య వర్గం ఉందని బీజేపీ (bjp)నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అదే సమయంలో డీసీఎం పదువుల కూడా పెంచాలని కాంగ్రెస్ (congress) నేతలు చెబుతున్నారు. ఇప్పుడు అదే అస్త్రంగా చేసుకున్న బీజేపీ.. కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

If you give 33 Deputy Chief Minister positions to one state, you will go down in history, BJP has countered Congress.

దీనిపై ట్విట్ చేసిన కర్ణాటక బీజేపీ (bjp)రాష్ట్ర శాఖ కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడి చేసింది. ప్రభుత్వంలో ఏ పనీ జరగడం లేదని లేఖ రాసి సిద్ధరామయ్యపై యుద్ధం ప్రకటించిన రాయరెడ్డి ఇప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. 6 మందికి డీసీఎం పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ (congress) పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని, తమకు ఒక సీటు జోడించి మ్మల్ని డీసీఎం ( DCM) చేయాలని ఒత్తిడి చేస్తున్నారని బీజేపీ (bjp)ఆరోపించింది.

కర్ణాటకలోని (congress) కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అధికార లాబీలో మునిగితేలుతోందని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. అలాగే డీసీఎం వ్యవహారంపై వివాదాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకున్న బీజేపీ 33 మందిని డీసీఎంలుగా చేసి తిరుగులేని చరిత్ర సృష్టించాలని కాంగ్రెస్ (congress) పార్టీకి సూచించింది. మీరు ఒకరు ఇద్దరికి డీసీఎం పదవులు ఇచ్చినా అసమ్మతి ఎక్కువగా ఉంటుందని, మొత్తం 33 మందిని డీసీఎంలు చేస్తే ఓ పని అయిపోతుందని బీజేపీ (bjp)వ్యంగంగా ట్వీట్ చేసింది.

If you give 33 Deputy Chief Minister positions to one state, you will go down in history, BJP has countered Congress.

బీజేపీ, జేడీఎస్‌ పొత్తు నేపథ్యంలో బీజేపీ (bjp)నాయకుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు కాంగ్రెస్‌లోని (congress) అసంతృప్తికి అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇదే చాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ (bjp), జేడీఎస్‌ నాయకులు అనుకుంటున్నారు. అయితే వీటన్నింటిని కర్ణాటక కాంగ్రెస్ (congress) నేతలు, ఢిల్లీ హైకమాండ్ ఎలా ఎదుర్కొంటుంది అని వేచి చూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+