చౌకీదార్ నిజాయితీ ఉంటే అప్పీల్ చేయు : సంజౌతా ఎక్స్ ప్రెస్ తీర్పుపై ఓవైసీ
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం పీక్ స్టేజీకి చేరింది. 'మై బీ చౌకీదార్' నినాదాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటుండగా ... విపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో దేశం నమ్మకమైన ప్రధానమంత్రిని కోరుకుంటుందని ఎంఐఎం పేర్కొంది. చౌకీదార్‌ను కాదని మోదీని ఉద్దేశించి విమర్శించింది.

నిజాయితీ ఉంటే అప్పీల్ చేయండి
చౌకీదార్, మోదీకి నీతి, నిజాయితీ ఉంటే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ తీర్పును అప్పీల్ చేయాలని కోరారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైనా అసీమానంద సహా మిగిలినవారు నిర్దోషులని పంచకుల కోర్టు తీర్పునుచ్చింది. నిజంగా మీరు దేశానికి చౌకీదార్ అయితే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబ్ బ్లాస్ట్‌లో నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో అప్పీల్ చేయాలని కోరారు. అసీమానంద్‌ను చూసి మోదీ భయపడుతున్నారని మండిపడ్డారు.

మోదీ హయాంలో దాడులు ?
దేశంలో నరేంద్రమోదీ హయాంలోనే ఉగ్రదాడులు పెరిగాయన్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్. మోదీ నేతృత్వంలోని కేంద్రం అధికారంలో ఉండగా పఠాన్‌కోట్, యూరి, పుల్వామా దాడులు జరిగాయని గుర్తుచేశారు. మరి మీరేం చేస్తున్నారు, మీరు ఏ రకమైన కాపాలాదారుడు అని ప్రశ్నించారు. దేశం నమ్మకమైన ప్రధానమంత్రిని కోరుకుంటోంది. కానీ మీ లాంది చౌకీదార్‌ను కాదని విమర్శించారు.

ఇదీ నేపథ్యం
ఫిబ్రవరి 18, 2007లో హర్యానాలోని పానిపట్‌కు సమీపంలో ఉన్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 68 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో అధికంగా పాకిస్తాన్ జాతీయులు ఉండగా భారత రైల్వే అధికారులు నలుగురు మృతి చెందారు. ఓ బోగీలో బాంబు పేలడంతో ఈ ఘటన జరిగింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ అమృత్‌సర్‌లోని అటారీకి వెళుతున్న సమయంలో పేలుడు సంభవించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications