వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సిజన్ సిలిండర్ కావాలా.. అయితే నా గదికి రా... ఓ మూర్ఖుడి వేధింపులు

|
Google Oneindia TeluguNews

కరోనా విజృంభిస్తోన్న వేళ ఆక్సిజన్‌ సిలిండర్‌, అంబులెన్స్‌, మందులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. దాంతో కొందరు వ్యక్తులు ఏమాత్రం జాలి, దయ లేకుండా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ.. జలగల్లా జనాల రక్తాన్ని పీలుస్తున్నారు. మరి కొందరు నీచులు అంతటితో ఆగక మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అపత్కాలంలో ఆడవారు సాయం కోరితే దాన్ని అదునుగా తీసుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

ట్విట్టర్‌ యూజర్‌ ఇలాంటి సంఘటన గురించి ట్వీట్‌ చేయగా ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. తన స్నేహితుడి సోదరి తండ్రి కోవిడ్‌ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని ట్వీట్ చేశారు. అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాల్సి వచ్చింది. చిన్నతనం నుంచి తనను సోదరిగా భావించిన పొరుగింటి వ్యక్తికి తన పరిస్థితిని వివరించి.. సాయం చేయాల్సిందిగా కోరారు. తప్పకుండా హెల్స్‌ చేస్తాను. అందుకు బదులుగా నువ్వు నాతో శృంగారానికి ఒప్పుకోవాలి. నా గదికి వచ్చి గడిపితే.. వెంటనే ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేస్తాను అని చెప్పాడట.

if you want oxygen cylinder come to room

అతని మాటలు విని బాధితురాలు షాక్‌ అయ్యింది. చిన్నతనం నుంచి తనను చెల్లి అని పిలిచిన వ్యక్తి ఇంత నీచుడా అనుకుని ఎంతో ఆవేదన చెందింది. ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పండి అని నెటిజనులను కోరాడు సదరు ట్విట్టర్‌ యూజర్‌. వెంటనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి'' అని కొందరు సూచించగా.. మరి కొందరు ''సదరు అపార్ట్‌మెంట్‌ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లండి'' అనగా.. మరి కొందరు ''అతడి పేరు, ఫోటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని సూచించారు.

పబ్లిక్‌గా పరువు తీస్తే తప్ప ఇలాంటి వారికి బుద్ధి రాదు'' అని కామెంట్‌ చేస్తున్నారు. ఇక గతంలో ముంబైకి చెందిన ఓ మహిళ ప్లాస్మా కావాలి.. దాతలు సంప్రదించాల్సిందిగా కోరుతూ.. తన పర్సనల్‌ నంబర్‌ ఇవ్వడంతో ఎంత టార్చర్‌ అనుభవించిందో ట్విట్టర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

English summary
twitter user recounts intimacy oxygenffer received friend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X