IFS Officer: ఫేస్ బుక్ ఫ్రెండ్, అటవి శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని, క్వాటర్స్ లో ఏం చేశాడంటే, క్లోజ్!
బెంగళూరు/ధారవాడ: ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఇదే సమయంలో ఓ యువతి ఫేస్ బుక్ లో ఆ ఆఫీసర్ కు పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ దగ్గర అయ్యారు. అటవి శాఖలో నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ అధికారి ఆమెకు మాయమాటలు చెప్పాడని తెలిసింది. తరువాత ఇద్దరూ నేరుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. తరువాత ఫారెస్టు క్వాటర్స్ కు పిలిపించుకున్న అధికారి ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని, కేసు పెట్టకూడదని ఇంతకాలం ఆమెకు మాయమాటలు చెబుతూ కాలం గడిపేశాడని తెలిసింది. ఇటీవల ఆ అధికారి ఎదురు తిరగడంతో ఆ యువతి ఆ అధికారి మీద పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు పెట్టింది. అత్యాచారం జరిగిన సంవత్సరం తరువాత యువతి రేప్ కేసు పెట్టడం, ఐఎఫ్ఎస్ అధికారి మీద కేసు నమోదు కావడంతో అటవి శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.

ఐఎఫ్ఎస్ అధికారి
కర్ణాటకలోని ధారవాడలో అటవి శాఖ అధికారి (ఐఎఫ్ఎస్)గా రవిశంకర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న రవిశంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. రవిశంకర్ కు చాలా మంది సోషల్ మీడియా ఫ్రెడ్స్ ఉన్నారని వెలుగు చూసింది. రవిశంకర్ ప్రతిరోజూ ఎక్కువగా సోషల్ మీడియాలో కాలం గడుపుతుంటారని సాటి ఉద్యోగులు అంటున్నారు.

ఫేస్ బుక్ లో టచ్ లోకి వచ్చిన యువతి
ఇదే సమయంలో అటవి శాఖ అధికారి రవిశంకర్ కు ఓ యువతి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. తాను అటవి శాఖ లో ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నానని రవిశంకర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తరువాత రవిశంకర్, ఆ యువతి ఇద్దరూ సోషల్ మీడియాలోనే దగ్గర అయ్యారని వెలుగు చూసింది.

ఉద్యోగం ఇప్పిస్తానని గాలం ?
అటవి శాఖలో నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, తరువాత మనం కలిసి ఒకే చోట ఉద్యోగం చెయ్యడానికి అవకాశం ఉంటుందని ఊఎఫ్ఎస్ అధికారి రవిశంకర్ ఫేస్ బుక్ ఫ్రెండ్ కు మాయమాటలు చెప్పాడని తెలిసింది. తరువాత రవిశంకర్, ఆ యువతి చాలాసార్లు నేరుగా కలుసుకోవడం మొదలుపె

అటవి శాఖ క్వాటర్స్ లో అత్యాచారం ?
ఉద్యోగం ఇప్పించే ముసుగులో సంవత్సరం క్రితం ఆ యువతిని ధారవాడలోని అటవి శాఖ కార్యాలయానికి రావాలని రవిశంకర్ ఆమెకు చెప్పాడని తెలిసింది. ఫారెస్టు క్వాటర్స్ కు పిలిపించుకున్న అటవి శాఖ అధికారి రవిశంకర్ ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని, ఇక ముందు మనం భార్య భర్తలు అని కొంతకాలం రవిశంకర్ చెప్పాడు, నువ్వు మాత్రం తన మీద కేసు పెట్టకూడదని ఇంతకాలం రవిశంకర్ ఆమెకు మాయమాటలు చెబుతూ కాలం గడిపేశాడని తెలిసింది.

ఎదురు తిరిగాడని రేప్ కేసు పెట్టింది
ఇటీవల అటవి శాఖ అధికారి రవిశంకర్ పెళ్లి చేసుకోనని ఎదురు తిరగడంతో ఆ యువతి ఆ అధికారి మీద పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు పెట్టింది. అత్యాచారం జరిగిన సంవత్సరం తరువాత యువతి రేప్ కేసు పెట్టడం, ఐఎఫ్ఎస్ అధికారి రవిశంకర్ మీద కేసు నమోదు కావడంతో అటవి శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. రవిశంకర్ మీద అత్యాచారం కేసు నమోదు అయ్యిందని, ఇప్పటికే అటవి శాఖ క్వారట్స్ దగ్గర విచారణ చేసి వివరాలు సేకరించామని, చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకుంటామని ధారవాడ పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications