IND Vs PAK: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‍తో బిత్తరపోయిన ఇఫ్తికర్ అహ్మద్..
అహ్మదాబాద్ లో పాకిస్థాన్ తో జగుతోన్న మ్యాచ్ లో ఇండియా పట్టు బిగించింది. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్ లో రెండో బంతిని సౌద్ షకీల్ కు వేశాడు. షకీల్ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి ప్యాడ్స్ ను తాకింది. వెంటనే కుల్దీప్, వికెట్ కీపర్ రాహుల్, మిగతా భారత ఆటగాళ్లు అప్పిల్ చేశారు. అయినా కూడా ఎంపైర్ ఔట్ ఇవ్వలేదు.
దీంతో రోహిత్ శర్మ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బంతి ప్యాడ్స్ కు తాకింది. బంతి లైన్ లో ఉండి వికెట్లకు తాకినట్లు బాల్ ట్రాకర్ లో కనిపించింది. దీంతో సౌద్ షకీల్ ఔట్ గా ఎంపిర్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇఫ్తికర్ అహ్మద్ వచ్చాడు. మూడో బంతిని ఇఫ్తికర్ అహ్మద్ డిఫెన్స్ ఆడాడు. నాలుగో బంతిని బౌండరీ తరలించాడు. ఐదో బంతిని డిఫెన్స్ ఆడాడు. ఆ బంతికి మాత్రం ఇఫ్తికర్ అహ్మద్ కు దిమ్మ దిరిగిపోయింది.

కుల్దీప్ యాదవ్ లెగ్ లో వేసిన బంతి స్పిన్ అవుతూ వికెట్లను తాకింది. దీంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలాగా.. ఇఫ్తికర్ అహ్మద్ మాత్రం బిత్తరపోయి చూస్తున్నాడు. కాసేపటి వరకు అక్కడ ఏం జరిగిందో కూడా అతనికి తెలియలేదు. చివరికి బౌల్డ్ అయినట్లు అర్థం చేసుకుని పెవిలియన్ వైపు వెళ్లాడు. కానీ ఇఫ్తికర్ అహ్మద్ షాకైన తీరు అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత ఓవర్ లో బౌలింగ్ వచ్చిన జస్ప్రీత్ బుమ్రా నిలకడగా ఆడతున్న మహ్మద్ రిజ్వాన్ బోల్తా కొట్టించాడు. రిజ్వాన్ బౌల్డ్ చేశాడు. 36వ ఓవర్ లో బుమ్రా షదాబ్ ను కూడా ఔట్ చేశాడు.
దీంత పాకిస్థాన్ 171 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 300 పరుగలు చేస్తుందని అందురు భావించారు. కానీ సిరాజ్ బాబర్ ఔట్ చేయడం.. ఆ తర్వాత కుల్దీప యాదవ్ మ్యాజిక్ చేయడం.. బుమ్రా బుం బం బౌలింగ్ వేయడంతో పాకిస్థాన్ ఆత్మరక్షణలో పడింది. ఈ మ్యాచ్ లో అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. ఇమామ్ హుల్ హక్ 38 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేయగా.. బాబర్ అజాం 58 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ 69 బంతుల్లో 7 ఫోర్లతో 49 రన్స్ చేశాడు. ఇఫ్తికర్ అహ్మద్ 4 పరుగులు చేయగా.. షదాబ్ ఖాన్ 2 పరుగులు చేశాడు.












Click it and Unblock the Notifications