ఆర్జీకార్, లా స్టూడెంట్, ఇప్పుడు ఐఐఎం.. "అత్యాచారాలకు కేరాఫ్" కోల్‌కతా విద్యాలయాలు?
Kolkata: కోల్‌కతాలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలోని విద్యాలయాలు అత్యాచారాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో మెడికో హత్యాచారం, కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థిపై సామూహిక అత్యాచారం ఘటనలు మరువక ముందే.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM)-కలకత్తాలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఐఎంలో చదువుతున్న విద్యార్థినిపై క్యాంపస్ హాస్టల్‌లో మరో విద్యార్థి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఐఐఎం-కలకత్తా బాలుర హాస్టల్‌లో శుక్రవారం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం.. కౌన్సెలింగ్ సెషన్ పేరుతో ఆమెను హాస్టల్‌కు పిలిపించినట్లు తెలిసింది. నిందితుడు ఇచ్చిన మత్తుమందు కలిపిన పానీయం సేవించిన తర్వాత తాను స్పృహ కోల్పోయినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించానని ఆ యువతి వెల్లడించింది. దీని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బెదిరించినట్లు ఆమె పోలీసులకు తెలియజేసింది. ఈ కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామని.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశంలోని ప్రజలను కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన అనంతరం దక్షిణ కోల్‌కతాలోని కస్బాలోని ఒక లా కళాశాలలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థినిపై కళాశాల ప్రాంగణంలోనే నిందితులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న ఆర్జీకార్ మెడికో..నిన్న లా స్టూడెంట్..నేడు ఐఐఎం విద్యార్థిని.. ఇలా కోల్‌కతా విద్యాలయాలు అత్యాచారాలకు కేరాఫ్‌గా మారుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రత మీద రచ్చ రాజుకుంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications