కాన్పూర్ ఐఐటీలో దళిత విద్యార్ధి భీమ్‌సింగ్ సూసైడ్, సూసైడ్ నోట్ ఎలా చిరిగింది?
లక్నో:ఐఐటీ కాన్పూర్‌లో దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఐఐటీ మూడో సంవత్సరం చదువుతున్న పీహెచ్‌డీ విద్యార్ధి భీమ్‌సింగ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు భీమ్‌సింగ్ సూసైడ్ నోట్ రాశాడు. అయితే ఈ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
హస్టల్ రూమ్‌లోనే భీమ్‌సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు సూసైడ్ నోట్ ముక్కలు ముక్కలుగా చింపేసి ఉందన్నారు.దీనిపై పలు అనుమానాలున్నాయని ఆయన చెప్పారు.ఈ సూసైడ్ నోట్ భీమ్‌సింగ్ రాశాడా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నోట్‌ను పంపుతున్నట్టు చెప్పారు.

ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌కు చెందిన సింగ్ తల్లిదండ్రులకు భీమ్‌సింగ్ మరణించిన విషయాన్ని సమాచారం ఇచ్చినట్టు ఎస్పీ అఖిలేష్ కుమార్ చెప్పారు. భీమ్‌సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు.
అయితే సూసైడ్ నోట్ ముక్కలు ముక్కలుగా చిరిగి పోయి ఉండడాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే భీమ్‌సింగ్ నోట్ రాసి చింపేశాడా, లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
భీమ్‌సింగ్ మృతదేహన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. గురువారం నాడు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోని నిట్‌లో భీమ్‌సింగ్ బీటెక్ పూర్తి చేశారు. 2015లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీలో జాయిన్ అయ్యారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications