ఉరేసుకుని ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థి ఆత్మహత్య

శనివారం రాత్రి పొద్దు పోయే వరకు మిత్రులతో చాట్ చేస్తూ కనిపించాడని, ఆదివారంనాడు గది నుంచి బయటకు రాలేదని, తలుపులు మూసి ఉండడంతో విషయాన్ని తోటి విద్యార్థులు హాస్టల్ ఇంచార్జీకి తెలియజేశారు. వెంటనే పోలీసులను పిలిచారు.
గది తలుపులను పగులగొట్టి పోలీసులు గదిలోకి ప్రవేశించారు. గోయల్ ఉరేసుకుని కపించాడు. అతన్ని వెంటనే క్యాంపస్‌లో ని బి రాయ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు
పోలీసులకు సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. రాజస్థాన్‌లోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గోయల్ ఆత్మహత్య చేసుకున్నాడని, అయితే కారణం ఏమిటనేది తెలియదని ఐఐటి ఖరగ్‌పూర్ రిజిస్ట్రార్ తపన్ గోషాల్ చెప్పారు. పక్షంలో రోజులు ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఇది రెండవ సంఘటన.












Click it and Unblock the Notifications