టెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలు
ఐఐటీ మద్రాస్ క్యాంపస్ క్యాంపస్‌లో ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో
చెన్నై: ఐఐటీ మద్రాస్ క్యాంపస్ క్యాంపస్‌లో ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ప్రముఖ కంపెనీలు రానున్నాయి.
ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో పెద్ద ఎత్తున కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. గతానికి భిన్నంగా ఈ దఫా ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొననున్నాయి.
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్టయ్యే అభ్యర్థులకు భారీగా వేతనాలు పొందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలు టెక్కీలకు మంచి అవకాశాలను అందించే అవకాశం ఉందంటున్నారు.

ఐఐటి చెన్నైలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
డిసెంబర్ 1నుంచి ప్రారంభమయ్యే ఐఐటీ మద్రాస్ వార్షిక ప్లేస్‌మెంట్స్‌లో తొలిసారిగా యాపిల్, యూఐడీఏఐ వంటి సంస్థలు పాల్గొననున్నాయి.క్యాంపస్ రిక్రూట్‌మెంట్లతో ఉన్నత విద్యా సంస్థలు కళకళలాడనున్నాయి.. ఆర్థిక మందగమనం క్రమంగా తొలగిపోతుండటంతో దిగ్గజ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లతో తాజా నైపుణ్యాలను సమీకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

దిగ్గజ కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలు
చెన్నై ఐఐటి క్యాంపస్‌లో రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న కంపెనీల్లో దాదాపు 15 శాతం సంస్థలు తొలిసారి ఈ ప్రక్రియలో పాల్గొంటున్నాయి.
యూబీఎస్ ఏజీ, నాస్డాక్ స్టాక్ మార్కెట్, అల్వారెజ్,మర్సాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ గార్డెన్,హల్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెకిసూ కెమికల్ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి. మొత్తం 400 జాబ్ ప్రొఫైల్స్‌తో 270 కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేయించుకున్నాయి.

3.గత ఏడాది 250 కంపెనీలు
గత ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో 250 కంపెనీలు ఐఐటీ చెన్నై క్యాంపస్‌లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఇక ఈ ఏడాది పార్టిసిపెంట్స్‌లో 43 శాతం రిక్రూటర్స్ ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డీ నుంచి, 25 శాతం ఫైనాన్స్ రంగం, 32 శాతం కంపెనీలు ఐటీ రంగం నుంచి పాల్గొంటున్నాయి.

ఈ ఏడాది నుండి 50 స్టార్టప్ కంపెనీలు
2017-18 క్యాంపస్ రిక్రూట్‌మెంట్ తొలిదశ డిసెంబర్ 1 నుంచి 10 వరకూ జరుగుతుందని ఐఐటీ మద్రాస్ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ 50 స్టార్టప్‌లకు శ్రీకారం చుట్టనుంది. చెన్నై ఐఐటీ క్యాంపస్‌లో ధిగ్గజ కంపెనీలు రావడంతో విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందంటున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications