ఐఐటి విద్యార్థి దుర్బుద్ధి: నెట్‌లో టీచర్ నగ్నచిత్రాలు

IIT students posts nude phots of teacher
ఖరగ్‌పూర్: పశ్చిమ బెంగాల్‌లోని బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన ఐఐటి విద్యార్థి తన దుర్బుద్ధిని బయటపెట్టుకున్నాడు. సుర్జీత్ కుమార్ జైన్ (18) అనే ఐఐటి విద్యార్థి టీచర్ నగ్న చిత్రాలను నెట్‌లో పోస్టు చేశాడు. అతను ఇటీవలే ఐఐటి సీటు సంపాదించాడు.

బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళా టీచర్ నగ్న చిత్రాలను అతను ఇంటర్నెట్‌లో పెట్టి వికృతానందం పొందాడు. ఆ విషయం తెలిసిన ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా ఆ ఫోటోలను ఖరగ్‌పూర్ ఐఐటి ప్రాంగణంలో సుర్జీత్ కుమార్ జైన్ అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ఖరగ్‌పూర్ ఐఐటికి చేరుకున్నారు.

సుర్జీత్ కుమార్ జైన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని, గత రెండు నెలలుగా అతను క్లాసులకు హాజరు కావడం లేదని ఐఐటి ఖరగ్‌పూర్ డైరెక్టర్ తపన్ గోషాల్ చెప్పారు. దాంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+