ఇక పురుషులకూ పితృత్వ సెలవులు: ఐకియా, ‘తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే’

ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడమే చూశాం. కానీ, ఇప్పుడు పురుషులకు కూడా అలాంటి సెలవులు ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. ఆ కంపెనీయే ప్రముఖ ఫర్నీచర్ దిగ్గం ఐకియా ఇండియా.

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడమే చూశాం. కానీ, ఇప్పుడు పురుషులకు కూడా అలాంటి సెలవులు ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. ఆ కంపెనీయే ప్రముఖ ఫర్నీచర్ దిగ్గం ఐకియా ఇండియా. మహిళలతో సమానంగా పురుషులకూ 26వారాల పాటు పితృత్వ సెలవులను అందించనున్నట్లు స్పష్టం చేసింది ఈ స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్‌ తయారీ సంస్థ.

ఈ మేరకు భారత్‌లోని తమ సంస్థ ఉద్యోగులకు 26 వారాల పేరెంటల్‌ లీవ్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అన్నా కేరిన్‌ మాన్సన్‌ తెలిపారు.

IKEA to offer daddies 6-month parental leave, too

సరోగసీ, దత్తత మార్గాన్ని అనుసరించిన వారికి కూడా ఈ పాలసీ వర్తిస్తుందని కంపెనీ చెప్పడం గమనార్హం. మహిళలకు మాతృత్వ సెలవులతో పాటు అదనపు సౌకర్యాలను కూడా కల్పించనున్నట్లు ఆ ప్రకటనలో ఐకియా ఇండియా పేర్కొంది.

అంతేగాక, మాతృత్వ సెలవుల అనంతరం మరో 16 వారాల పాటు మహిళలు తమ పనిగంటలను సగానికి తగ్గించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగుల పిల్లల కోసం ప్రతీ స్టోర్‌లో డేకేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది హైదరాబాద్‌లోనే తమ సంస్థ తొలి స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+