Illegal affair: భార్య ఫ్రెండ్ తో భర్త ?, పుట్టింటిలో భార్య, ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని, ఫినిష్ !
చెన్నై/ కోయంబత్తూరు: బీకాం పూర్తి చేసిన యువతి వివాహం చేసుకోవాలని అనుకుంటున్న సమయంలోనే ఆమె తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి నివాసం ఉంటున్న యువతి చిన్న ఉద్యోగం చేస్తున్నది. అదే చోట పని చేస్తున్న మరో మహిళ ఆమెకు పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రతిరోజు కలుసుకుంటూ మంచి స్నేహితులు అయ్యారు. వీరి స్నేహం ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళ్లే వరకు దారితీసింది. ఇదే సమయంలో స్నేహితురాలి భర్తతో ఆ యువతికి చనువు ఏర్పడింది. స్నేహితురాలి భర్త ఆ యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని కొంతకాలంగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన స్నేహితురాలితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య దూరం కావడం, అందమైన పెళ్లి కాని యువతి దగ్గర కావడంతో భర్త ఇంకా హ్యాపీగా ఆమెతో ఎంజాయ్ చేశాడు. రాత్రి ప్రియురాలి ఇంటికి ఆమె ప్రియుడు వెళ్లాడు. ప్రియురాలి ఇంట్లో గొడవ జరిగింది. ప్రియురాలిని నమ్ముకుని భార్యను దూరం చేసుకుంటే ఇప్పుడు ప్రియురాలు కూడా దూరం అవుతోందని అతను రగిలిపోయాడు. అంతే గర్ల్ ఫ్రెండ్ ను చాకచక్యంగా హత్య చేసిన ప్రియుడు తప్పించుకుని పరారైనాడు. స్నేహితురాలి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

చదువు పూర్తి అయిన వెంటనే తండ్రి చనిపోయాడు
తమిళనాడులోని కోంబత్తూరు సిటీలోని సబాపతి రోడ్డులోని సాయిబాబా కాలనీలో అశ్వతి (21) అనే యువతి నివాసం ఉంటున్నది. బీకాం పూర్తి చేసిన అశ్వతి మంచి ఉద్యోగం చేసి తరువాత వివాహం చేసుకోవాలని అనుకుంటున్న సమయంలోనే ఆమె తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి అశ్వతి నివాసం ఉంటున్నది.

ఉద్యోగంలో చేరిన అందమైన యువతి
తల్లితో కలిసి నివాసం ఉంటున్న అశ్వతి కుటుంబ పోషణ కోసం కోయంబత్తూరులోనే చిన్న ఉద్యోగం చేస్తున్నది. అదే చోట పని చేస్తున్న మరో మహిళ రమ్యకు, అశ్వతికి పరిచయం అయ్యింది. రమ్య, అశ్వతి ఇద్దరూ ప్రతిరోజు కలుసుకుంటూ మంచి స్నేహితులు అయ్యారు. రమ్య, అశ్వతిల స్నేహం ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళ్లే వరకు దారితీసింది.

టచ్ లోకి వచ్చిన ఫ్రెండ్ భర్త
రమ్యకు ఇంతకు ముందే జగన్ (29) అనే యువకుడితో వివాహం అయ్యింది. జగన్, రమ్య దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భర్త జగన్ తో కలిసి రమ్య సంతోషంగా కాపురం చేసుకుంటున్నది. రమ్య ఇంటికి వెళ్లి వస్తున్న అశ్వతికి జగన్ పరిచయం అయ్యాడు. కనపడిన ప్రతిసారి జగన్ అతని భార్య ఫ్రెండ్ అశ్వతితో ఎక్కువ పరిచయం పెంచుకున్నాడు.

భార్య ఫ్రెండ్ తో భర్త అక్రమ సంబంధం
అశ్వతిచి చూడటానికి ఎర్రగా, సన్నగా నాజుకుగా ఉండటంతో ఆమె మీద జగన్ కన్నుపడింది. ఇదే సమయంలో స్నేహితురాలు రమ్య భర్త జగన్ తో అశ్వతికి ఎక్కువ చనువు ఏర్పడింది. స్నేహితురాలు రమ్య భర్త జగన్ అశ్వతిని వలలో వేసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని కొంతకాలంగా ఎంజాయ్ చేస్తున్నాడు.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.... ఎగిరి గంతేసిన భర్త
తన స్నేహితురాలు అశ్వతితో తన భర్త జగన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న రమ్య అతనితో గొడవ పెట్టుకునింది. అశ్వతి విషయంలో జగన్, రమ్య దంపతుల మద్య గొడవలు మొదలైనాయి అశ్వతితో రమ్య మాట్లాడటం మానేసింది. ఇదే సమయంలో జగన్ భార్య రమ్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య రమ్య దూరం కావడం, అందమైన పెళ్లి కాని యువతి అశ్వతి దగ్గర కావడంతో జగన్ ఇంకా హ్యాపీగా ఫీలైపోయి ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

ప్రియురాలికి చివాట్లు పెట్టారు
రమ్య పుట్టింటకి వెళ్లిపోవడానికి అశ్వతి కారణం అని ఆమె పని చేస్తున్న చోట అందరికి తెలిసిపోయింది. పని చేస్తున్న చోట అశ్విని అందరూ చివాట్లు పెట్టారు. నీ కారణంగా రమ్య కాపురం కూలిపోయిందని సూటిపోటి మాటలు మాట్లాడారని తెలిసింది. ఇదే విషయంలో అశ్వతి ఆవేదన చెందిందని, తరువాత జగన్ కు దూరం కావాలని అనుకుందని తెలిసిందది.

ఇంటికి రావద్దని చెప్పిన ప్రియురాలు
రాత్రి ప్రియురాలు అశ్వతి ఇంటికి ఆమె ప్రియుడు జగన్ వెళ్లాడు. ప్రియురాలు అశ్వతితో ఆమె ఇంట్లో జగన్ మద్య గొడవ జరిగింది. తరువాత నువ్వు ఇక ముందు మా ఇంటికి రాకూడదని అశ్వతి తేల్చి చెప్పింది. అక్కడ అశ్వతి, జగన్ మద్య మాటామాటా పెరిగిపోయింది. ప్రియురాలు అశ్వతిని నమ్ముకుని భార్య రమ్యను దూరం చేసుకుంటే ఇప్పుడు ప్రియురాలు కూడా దూరం అవుతోందని జగన్ రగిలిపోయాడు.
Recommended Video

ప్రియురాలిని నమ్ముకుంటే భార్య దూరం అయ్యిందని ?
గర్ల్ ఫ్రెండ్ అశ్వతిని చాకచక్యంగా ఆమె గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు జగన్ అక్కడి తప్పించుకుని పరారైనాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు అశ్వతి మొబైల్ నెంబర్ ఆధారంగా ఆమె చివరి సారి జగన్ తో మాట్లాడిందని తెలుసుకున్నారు. జగన్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. చివరికి జగన్ మొబైల్ ఫోన్ ఆన్ చెయ్యడంతో పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. స్నేహితురాలు రమ్య భర్త జగన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి అశ్వతి హత్యకు గురి కావడం కోయంబత్తూరులో కలకలం రేపింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications