Illegal affair: పక్కింటోడితో క్యాబ్ డ్రైవర్ భార్య రొమాన్స్, మంచిరోజు చూసి ఎస్కేప్, భర్త ఏం చేశాడంటే ? !

గురుగ్రామ్/ లక్నో: ఐటీ హబ్ సమీపంలో ఓ యువకుడు అతని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో కొంతకాలం పని చేసిన యువకుడు తరువాత ఓలా క్యాబ్ నడుపుతున్నాడు. వివాహం చేసుకున్న క్యాబ్ డ్రైవర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ తమ్ముడు కూడా అతని భార్యతో కలిసి అదే ప్రాంతంలో వేరే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడని అతని తమ్ముడికి సమాచారం అందింది. వెంటనే తమ్ముడు, అతని స్నేహితులు కలిసి క్యాబ్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే క్యాబ్ డ్రైవర్ చనిపోయాడు. క్యాబ్ డ్రైవర్ భార్య పక్కింటోడితో లేచిపోయిందని, భార్య లేచిపోయిందనే అవమానంతో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాడు

ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాడు


ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ నగర్ జిల్లాకు చెందిన కవీందర్ అనే యువకుడు అతని భార్య రీనాతో కలిసి ఐటీ హబ్ గురుగ్రామ్ సమీపంలోని కసన్ గ్రామం చేరుకుని నివాసం ఉంటున్నాడు. కవిందర్ తో పాటు అతని భార్య, అతని కుటుంబ సభ్యులు ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో కొంతకాలం పని చేసిన కవీందర్ తరువాత ఓలా క్యాబ్ నడుపుతున్నాడు.

క్యాబ్ డ్రైవర్ హ్యాపీలైఫ్

క్యాబ్ డ్రైవర్ హ్యాపీలైఫ్

రీనాను వివాహం చేసుకున్న క్యాబ్ డ్రైవర్ కవీందర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటూ సంతోషంగా జీవించేవాడు. క్యాబ్ డ్రైవర్ కవీందర్ తమ్ముడు సంతోష్ కుమార్ కూడా అతని భార్యతో కలిసి కసన్ గ్రామంలోనే వేరే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ప్రతినిత్యం కవీందర్, అతని సోదడు సంతోష్ కుమార్ టచ్ లో ఉంటున్నారు.

పక్కింటోడితో క్యాబ్ డ్రైవర్ భార్య రొమాన్స్

పక్కింటోడితో క్యాబ్ డ్రైవర్ భార్య రొమాన్స్

ఓలా క్యాబ్ డ్రైవర్ కవీందర్, రీనా దంపతులు నివాసం ఉంటున్న వీదిలోనే రామ్ వీర్ అలియాస్ రామ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొంతకాలం క్రితం రామ్ వీర్, కవీందర్ స్నేహితులు అయ్యారు. కవీందర్ ఇంటికి వెళ్లి వస్తున్న రామ్ వీర్ అతని భార్య రీనాను వలలో వేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ అయిన కవీందర్ ఎక్కువగా బయట తిరుగుతుంటే అతని భార్య రీనా రామ్ వీర్ ను సెట్ చేసుకుని అతనితో రోమాన్స్ చెయ్యడం మొదలు పెట్టింది.

భర్తకు భార్య మ్యాటర్ తెలిసిపోయింది

భర్తకు భార్య మ్యాటర్ తెలిసిపోయింది

రీనా, రామ్ వీర్ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త కవీందర్ కు తెలిసిపోయింది. భార్య రీనా అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న కవీందర్ రగిలిపోయి అతని భార్య రీనాను పట్టుకుని చితకబాదేశాడు. ఇదే విషయంలో నెల రోజుల నుంచి కవీందర్, రీనా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.

ప్రియుడితో క్యాబ్ డ్రైవర్ భార్య జంప్

ప్రియుడితో క్యాబ్ డ్రైవర్ భార్య జంప్

రీనా ఆమె ప్రియుడు రామ్ వీర్ తో కలిసి మూడు రోజులు క్రితం జెండా ఎత్తేసింది. భార్య రీనా ఆమె ప్రియుడు రామ్ వీర్ తో లేచిపోయిందని తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ కవీందర్ అవమానంతో కుంగిపోయాడు. మూడు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా, ఎవ్వరితో ఫోన్ లో కూడా మాట్లాడకుండా కవీందర్ కుమిలిపోయాడు.

అవమానంతో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

అవమానంతో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

తరువాత ఇంట్లో కవీందర్ విషయం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని అతని తమ్ముడు సంతోష్ కుమార్ కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే తమ్ముడు సంతోష్ కుమార్, అతని స్నేహితులు కలిసి క్యాబ్ డ్రైవర్ కవీందర్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే క్యాబ్ డ్రైవర్ కవీందర్ చనిపోయాడని వైద్యులు చెప్పారు.

ప్రియుడితో లేచిపోయిన భార్య మీద కేసు

ప్రియుడితో లేచిపోయిన భార్య మీద కేసు

క్యాబ్ డ్రైవర్ కవీందర్ భార్య రీనా పక్కింటోడు రామ్ వీర్ తో లేచిపోయిందని, భార్య లేచిపోయిందనే అవమానంతో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తమ్ముడు సంతోష్ కుమార్ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. కవీందర్ ఆత్మహత్యకు అతని భార్య రీనా, ఆమె ప్రియుడు రామ్ వీర్ కారణం అని కేసు నమోదు చేసిన గురుగ్రామ్ పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+