Illegal affair: ఆంటీతో ఎంజాయ్, పోలీస్ స్టేషన్ లో గొంతు కోసుకున్న భర్త, గయ్యాలి భార్యతో నేను !
లక్నో/ఘాజియాబాద్: వివాహం చేసుకున్న యువకుడు అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉండేవాడు. రోజూ పనికి వెలుతున్న యువకుడు ఓ ఆంటీని తగులుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. చాలా కాలం ఆంటీతో అతను రొమాన్స్ చేస్తున్న విషయం అతని భార్యకు తెలీలేదు. ఆంటీ మోజులో పడిపోయిన భర్త అతని భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. తరువాత తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అందుకే పని ఉందనే నెపంతో ఇంటికి రావడం లేదని భార్యకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య రచ్చరచ్చ జరిగింది. విసిగిపోయిన భార్య ఆమె భర్త మీద పోలీసు కేసు పెట్టింది. పోలీసులు ఫోన్ చేసి మర్యాదగా పోలీస్ స్టేషన్ కు రావాలని భర్తకు వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త పోలీసుల ముందే చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు, పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ లోనే గొంతు కోసుకున్న భర్త నా గయ్యాలి బార్యతో నేను జీవించలేను అంటూ కేకలు వేసి కుప్పకూలిపోయాడు.

హ్యాపీలైఫ్ లో ఇద్దరు పిల్లలు
ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో ఓం ప్రకాష్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం రూపా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను ఓం ప్రకాష్ వివాహం చేసుకున్నాడు. ఘాజియాబాద్ లోని నంద్ గ్రామ్ ఏరియాలో ఓం ప్రకాష్, రూపా దంపతులు నివాసం ఉంటున్నారు, ఓం ప్రకాష్, రూపా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆంటీని తగులుకున్న భర్త
ఓం ప్రకాష్ మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ పనికి వెలుతన్న ఓం ప్రకాష్ రాత్రి ఇంటికి చేరుకునేవాడు. అయితే సంవత్సరం క్రితం ఓం ప్రకాష్ ఘాజియాబాద్ లోనే ఓ ఆంటీని తగులుకున్నాడు. రోజూ పనికి వెలుతున్న ఓం ప్రకాష్ ఆంటీని తగులుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. చాలా కాలంగా ఓం ప్రకాష్ చాలా సీక్రేట్ గా ఆ ఆంటీతో రొమాన్స్ చేస్తున్నాడు.

భార్యకు మ్యాటర్ తెలిసిపోయింది
ఆంటీతో ఓం ప్రకాష్ రొమాన్స్ చేస్తున్న విషయం అతని భార్యకు చాలా కాలం వరకు తెలీలేదు. ఆంటీ మోజులో పడిపోయిన ఓం ప్రకాష్ అతని భార్య రూపా, ఇద్దరు పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. తరువాత తన భర్త ఓం ప్రకాష్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అందుకే పని ఉందనే నెపంతో ఇంటికి రావడం లేదని అతని భార్య రూపాకు తెలిసిపోయింది.

ఇంట్లో రచ్చరచ్చ
ఓం పక్రాష్, ఆంటీ అక్రమ సంబంధం విషయంలో దంపతుల మద్య రచ్చరచ్చ జరిగింది. పెద్లు నచ్చచెప్పినా ఓం ప్రకాష్ ఎవ్వరి మాట వినలేదు. రానురాను ఓం ప్రకాష్ అతని ఇంటికి వెళ్లడం మానేశాడు. ఆంటీ మోజులో పడి తనకు, తన పిల్లలకు తన భర్త ఓం ప్రకాష్ మోసం చేస్తున్నాడని రూపా విసిగిపోయింది. చివరికి రూపా ఆమె భర్త మీద ఘాజియాబాద్ లో పోలీసు కేసు పెట్టింది

పోలీస్ స్టేషన్ లో గొంతు కోసుకున్న భర్త
పోలీసులు ఓం ప్రకాష్ కు ఫోన్ చేసి మర్యాదగా పోలీస్ స్టేషన్ కు రావాలని వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓం ప్రకాష్ చేతిలో బ్లేడ్ పట్టుకుని పోలీసుల ముందే చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు, పోలీసులు చాకచక్యంగా ఓం ప్రకాష్ చెయ్యి పట్టుకుని అడ్డుకున్నారు. అయితే మరో చేతిలోకి బ్లేడ్ తీసుకున్న ఓం ప్రకాష్ పోలీస్ స్టేషన్ లోనే అతని గొంతు కోసుకున్నాడు.

నా భార్య గయ్యాలి.... నేను కాపురం చెయ్యలేను
నాగయ్యాలి భార్యతో నేనే జీవించలేనని, ఆమె నాకు నరకం చూపిస్తోందని ఆరోపిస్తూ కుప్పకూలిపోయాడు. ఓం ప్రకాష్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని, అతను కోలుకుంటున్నాడని స్థానిక మీడియా తెలిపింది. మొత్తం మీద ఆంటీ మోజులో పడిన ఓం ప్రకాష్ అతని భార్య దెబ్బతో ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఘాజియా బాద్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications