Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: లవ్ మ్యారేజ్, అక్రమ సంబంధం, టార్చర్, భార్య ఏం చేసిదంటే ?, ఎస్కేప్ !

బెంగళూరు/మండ్య: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తల్లిదండ్రులను ఎదిరించిన ప్రియురాలు ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అబ్బాయి ఇంటిలోనే కాపురం ఉంటున్నారు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలు దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. పాప పుట్టిన తరువాత భార్యకు ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు సినిమా చూపించడం మొదలుపెట్టారు. ఇదే సందర్బంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్య కుమిలిపోయింది. ప్రియురాలి మోజులో పడిపోయిన భర్త అతని భార్యకు చుక్కలు చూపించాడు. చాలాకాలం ఓపికగా ఉన్న భార్య ఆమె 10 నెలల పాపను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె రాసిన డెత్ నోట్ లో తనను ఎవరెవరు టార్చర్ పెట్టారు, తన భర్త, అతను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ తన జీవితం ఎలా నాశనం చేశారు, లవ్ మ్యారేజ్ చేసుకుని నేను చాలా తప్పు చేశాను అంటూ పిన్ టూ పిన్ రాసిపెట్టడం కలకలం రేపింది.

 లవర్స్

లవర్స్


కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగల తాలుకాలోని కెంచేగౌడకోప్పలు గ్రామంలో బిందు (25) అనే యువతి నివాసం ఉంటున్నది. నాగమంగలలో నవీన్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం నవీన్, బిందుకు పరిచయం అయ్యింది. సంవత్సరం తరువాత నవీన్, బిందు ప్రేమించుకున్నారు.

భర్త ఇంటిలో కాపురం

భర్త ఇంటిలో కాపురం

పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు నవీన్, బిందు డిసైడ్ అయ్యారు. పెళ్లికి బిందు కుటుంబ సభ్యులు అస్సలు అంగీకరించలేదు. నవీన్ తో పెళ్లి చేసుకోవడానికి బిందు తల్లిదండ్రులు వ్యతిరేకించారు. తల్లిదండ్రులను ఎదిరించిన బిందు నాలుగు సంవత్సరాల క్రితం ఆమె ప్రియుడు నవీన్ ను పెళ్లి చేసుకుంది. నాగమంగలలోని నవీన్ ఇంటిలో అతని కుటుంబ సభ్యులతో కలిసి బిందు నివాసం ఉ:టున్నది.

భర్త కుటుంబ సభ్యుల టార్చర్

భర్త కుటుంబ సభ్యుల టార్చర్

వివాహం జరిగిన తరువాత మూడు సంవత్సరాలు నవీన్, బిందు దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. పాప పుట్టిన తరువాత బిందుకు ఆమె భర్త నవీన్ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నవీన్ తల్లితో పాటు అతని అక్కలు ఇద్దరు కలిసి బిందుకు టార్చర్ పెడుతూ సినిమా చూపించడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

భర్తకు అక్రమ సంబంధం

భర్తకు అక్రమ సంబంధం

ఇదే సందర్బంలో బిందును ప్రేమించి పెళ్లి చేసుకున్న నవీన్ నాగమంగలలో ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు. భర్త నవీన్ అక్రమ సంబందం తెలుసుకున్న అతని భార్య బిందు కుమిలిపోయింది. నన్ను పెళ్లి చేసుకుని పాప పుట్టిన తరువాత నువ్వు ఎందుకు వేరే మహిళతో తిరుగుతున్నావని బిందు నిలదీసింది.

బిడ్డను చంపి ఆత్మహత్య

బిడ్డను చంపి ఆత్మహత్య

చాలాకాలం ఓపికగా ఉన్న బిందు సహనం కోల్పోయింది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నవీన్ అతని భార్య బిందుకు ఎదురుతిరిగాడు. భర్త నవీన్ తో గొడవపడటంకంటే చావడం మేలు అనుకున్న బిందు ఆమె 10 నెలల పాపను చంపి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు బిందు డెత్ నోట్ రాసిపెట్టింది.

 డెత్ నోట్ లో పిన్ టూ పిన్ రాసింది

డెత్ నోట్ లో పిన్ టూ పిన్ రాసింది

బిందు తనను ఎవరెవరు టార్చర్ పెట్టారు అని డెత్ నోట్ లో రాసిపెట్టింది. తన భర్త నవీన్ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కలిసి తన జీవితం నాశనం చేశారని, పుట్టింటి వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు నా జీవితం సర్వనాశనం అయ్యిందని బిందు డెత్ నోట్ లో రాసిపెట్టింది.

భర్త ఫ్యామిలీ ఎస్కేప్

భర్త ఫ్యామిలీ ఎస్కేప్


లవ్ మ్యారేజ్ చేసుకుని నేను చాలా తప్పు చేశాను, నాలాగా అమ్మాయిలు ఎవ్వరు వారి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని బిందు అమ్మాయిలకు సూచించింది. తన భర్త నవీన్, మా అత్త, ఇద్దరు ఆడపడుచులు తనను టార్చర్ పెట్టారని బిందు డెత్ నోట్ లో రాసిందని, భర్త ఫ్యామిలీతో పాటు అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ పరారైనారని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+