Illegal affair: ప్రియురాలి ఇంట్లో భర్తకు చిక్కిన ప్రియుడు, చంపేసి బూడిద, కాలి చెప్పుతో సీక్రేట్ !

పూణే/ముంబాయి: వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమెతో చాలా కాలంగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడలేదు అనే సామెతలాగే ఆ యువకుడు కూడా తన అక్రమ సంబంధం గురించి ఎవ్వరికీ తెలీదని అనుకున్నాడు. ఇంతకాలం ప్రియురాలితో అతను పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. విషయం తెలుసుకున్న మహిళ భర్త ప్రియుడికి, అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. భర్త హెచ్చరించినా అతని భార్య కాని, ఆమె ప్రియుడు కాని పద్దతి మార్చుకోలేదు. తన భర్త ఊరికి వెళ్లాడని ప్రియురాలు ఫోన్ చేసి ప్రియుడికి చెప్పింది. ప్రియురాలి ఇంటి దగ్గరకు ప్రియుడు వెళ్లాడు. తరువాత ఆ యువకుడు కనపడలేదు. తన కొడుకు కనపడటం లేదని ఆ యువకుడి తల్లి పోలీసు కేసు పెట్టింది. యువకుడి ఆచూకి కాని, అతని శవం కాని పోలీసులకు చిక్కలేదు. యువకుడి ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. వివాహిత మహిళ ఇంటి సమీపంలో యువడి కాలి చెప్పు ఒకటి చిక్కడంతో కథ మలుపు తిరిగింది. యువకుడిని హత్య చేసిన నిందితులు అతని శవాన్ని కాల్చి బూడిద చేసి కాలిపోయిన ఎముకలు వంద కిలోమీటర్ల పరిదిలో అక్కడక్కడా వదిలేశారని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. యువకుడిని హత్య చేసి ఎంతో చాకచక్యంగా అతని శవం ఆచూకికూడా లేకుండా చేసిన హంతకులను ఇప్పుడు ఒక చెప్పు పట్టించింది.

వివాహిత మహిళతో అక్రమ సంబంధం

వివాహిత మహిళతో అక్రమ సంబంధం


మహారాష్ట్రలోని పూణేలో 27 సంవత్సరాల వయసు ఉన్న రంజిత్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రంజిత్ ది భూటాన్. పూణేలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ ఊర్మిళ (పేరు మార్చడం జరిగింది) రంజిత్ కు పరిచయం అయ్యింది. తరువాత వివాహిత మహిళ ఊర్మిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న రంజిత్ ఆమెతో చాలా కాలంగా ఎంజాయ్ చేస్తున్నాడు.

సీక్రేట్ గా ఎంజాయ్ చేస్తున్నారు

సీక్రేట్ గా ఎంజాయ్ చేస్తున్నారు

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడలేదు అనే సామెతలాగే రంజిత్ కూడా ఊర్మిళతో తన అక్రమ సంబంధం గురించి ఎవ్వరికీ తెలీదని, ఆమె భర్త రాకేష్ (పేరు మార్చడం జరిగింది) కూడా గుర్తించలేకపోయాడని గుడ్డిగా అనుకున్నాడు. ఇంతకాలం ప్రియురాలు ఊర్మిళతో రంజిత్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన భర్త

ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన భర్త

ఇటీవల రంజిత్, ఊర్మిళ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రాకేష్ తెలిసిపోయింది. భార్య ఊర్మిళ తీరుతో రాకేష్ రగిలిపోయాడు. గత నెల ఊర్మిళ భర్త రాకేష్ అతని భార్య ప్రియుడు రంజిత్ కు, అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. భర్త రాకేష్ హెచ్చరించినా అతని భార్య ఊర్మిళ కాని, ఆమె ప్రియుడు రంజిత్ కాని ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా ఇద్దరూ వారి పద్దతి మార్చుకోలేదు.

నా మొగుడు ఊరికి వెళ్లాడు వచ్చేయ్

నా మొగుడు ఊరికి వెళ్లాడు వచ్చేయ్

అక్టోబర్ 22వ తేదీన తన భర్త రాకేష్ ఊరికి వెళ్లాడని, నువ్వు వెంటనే వచ్చేయాలని ఊర్మిళ ఆమె ప్రియుడు రంజిత్ కు ఫోన్ చేసి చెప్పింది. ప్రియురాలు ఊర్మిళ పిలిచిందని ఆమె ఇంటికి ప్రియుడు రంజిత్ వెళ్లాడు. ఇంట్లో ప్రియురాలు ఊర్మిళతో రంజిత్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో టైమ్ కోసం వేచి చూస్తున్న ఆమె భర్త రాకేష్ అతని స్నేహితులు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

 ఎముకలు కూడా చిక్కకుండా చేశారు

ఎముకలు కూడా చిక్కకుండా చేశారు


రంజిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాకేష్, అతని ఇద్దరు స్నేహితులు అతన్ని ఇంటి నుంచి నిర్జనప్రదేశంలోకి లాక్కెళ్లి అక్కడే చంపేశారు. రంజిత్ శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి కూల్చి బూడిద చేసేశారు. చాకచక్యంగా రంజిత్ ను హత్య చేశామని అనుకున్న నిందితులు అతని శవాన్ని కాల్చి బూడిద చేసి కాలిపోయిన ఎముకలు వంద కిలోమీటర్ల పరిదిలో అక్కడక్కడా వదిలేసి చేతులు దులుపుకున్నారు.

హంతకులను పట్టించిన కాలి చెప్పు

హంతకులను పట్టించిన కాలి చెప్పు


తన కొడుకు కనపడటం లేదని రంజిత్ తల్లి అక్టోబర్ 27వ తేదీన పోలీసు కేసు పెట్టింది. రంజిత్ ఆచూకి కాని, అతని శవం కాని పోలీసులకు చిక్కలేదు. రంజిత్ మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. అక్టోబర్ 21వ తేదీన వివాహిత మహిళ ఊర్మిళకు రంజిత్ ఎక్కువసార్లు ఫోన్ చేసి మాట్లాడాడని పోలీసులు గుర్తించారు. ఊర్మిళ ఇంటి సమీపంలోనే రంజిత్ కాలి చెప్పు ఒకటి పోలీసులకు చిక్కడంతో కథ మలుపు తిరిగింది.

 క్రిమినల్ మైండ్..... అయితే ?

క్రిమినల్ మైండ్..... అయితే ?

అక్టోబర్ 22వ తేదీ రంజిత్ ను కిడ్నాప్ చేసే సమయంలో అతని చెప్పు ఒకటి ఊర్మిళ ఇంటి దగ్గరే పడిపోయిందని, ఆ విషయం నిందితులు గుర్తించలేకపోయారని, అతన్ని హత్య చేసి శవం కూడా కాల్చి బూడిద చేసి తప్పించుకోవాలని అనుకున్నారని పోలీసులు అన్నారు. ఇంత క్రిమినల్ మైండ్ ఉన్న నిందితులు రంజిత్ కాళ్లకు రెండు చెప్పులు ఉన్నాయా ? లేదా ? అనే విషయం గుర్తించలేక ఇప్పుడు చిక్కిపోయారని పోలీసు అధికారులు అంటున్నారు. రంజిత్ ను మేమే హత్య చేశామని అంగీకరించిన నిందితులు అతని శవం బూడిద మాత్రం మిగిల్చారని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+