విశ్వ సుందరి: అబ్బా... నువ్వేకావాలి, ఓరీ మూర్ఖుడా.... పిల్లల తల్లి వద్దురా, జైల్లో చెక్క భజన!
చెన్నై/ విల్లుపురం: కట్టుకున్న భర్తతో భార్య కొన్ని సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇదే సమయంలో పరాయి మగాడితో రుచి మరిగిన భార్యకు భర్త చేదు అయ్యాడు. పండగ రోజు కూడా పాత మొగుడేనా ? అనే సామెత లాగా తాను రెండో పెళ్లి చేసుకోవాలని భార్య నిర్ణయించింది. నువ్వు విశ్వ సుందరి, నువ్వేకావాలి అంటూ ప్రియుడు వెంటపడ్డాడు.
ఓరీ మూర్ఖుడా, ఆమె పిల్లల తల్లిరా, వద్దురా అంటూ ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు. నా భర్తను చంపేస్తే నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని, ఎక్కడికైనా దూరంగా వెళ్లి కాపురం చేసుకుందామని భార్య ప్రియుడికి చెప్పింది. తాను విశ్వ సుందరి అని అనునకుందో ఏమో పాపం ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. అయితే చేసిన పాపం ఊరికేపోదు అంటారు పెద్దలు, భర్తను హత్య చేయించిన భార్య, ఆమె ప్రియుడు, స్నేహితుడు ఇప్పుడు శ్రీకృష్ణుడి జన్మస్థానంలో చెక్క భజన చేస్తున్నారు.

ప్రాణం కంటే ఎక్కువగా!
తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజీ అవాలూరు పేట సమీపంలోని మేల్ వయలామూర్ లో కార్తికేయన్ (32), శాంతి (28) దంపతులు నివాసం ఉంటున్నారు. ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న కార్తికేయన్, శాంతి దంపతులకు కుమార్తె (4), కుమారుడు (3) ఉన్నారు. భార్య శాంతి, ఇద్దరు పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న కార్తికేయన్ వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాడు.

చెరువు గట్టు చెట్టుకు శవం
ఈనెల 17వ తేదీ రాత్రి కార్తికేయన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు అయినా కార్తికేయన్ ఇంటికి రాకపోవడంతో అతని బంధువులకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు కార్తికేయన్ కోసం అతని బంధువులు వెతికారు. ఆ సమయంలో ఊరికి సమీపంలోని చెరువు గట్టు మీద ఉన్న చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో కార్తికేయన్ శవమై కనిపించాడు. కార్తికేయన్ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

శాంతి కాదు.... అశాంతి..... మహానటి
కార్తికేయన్ భార్య శాంతిపై తమకు అనుమానం ఉందని, ఆమె భర్తను చంపించి ఉంటుందని కార్తికేయన్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే శాంతి ఏమీ తెలియని అమాయకురాలిగా మహానటి సావిత్రి టైపులో నటించింది. పోలీసులు భార్య శాంతి మొబైల్ డేటాను పరిశీలించారు. భార్య శాంతి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తంగమణి (30) అనే యువకుడితో ఈనెల 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎక్కువ సార్లు ఫోన్ లో మాట్లాడిందని, గత ఐదు నెలల నుంచి వీరిద్దరి మధ్య ఎక్కువగా ఫోన్ సంభాషణలు జరిగాయని పోలీసులు గుర్తించారు.

ప్రియుడు పోటుగాడు
కార్తికేయన్ భార్య శాంతి, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తంగమణి చాలా కాలంగా అక్రమ సంబంధం సాగిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న కార్తికేయన్ ఓ సారి భార్య శాంతిని, తంగమణిని పట్టుకుని చితకబాదేశాడు. ఈ విషయంపై ఊరిలో పంచాయితీ జరిగింది. శాంతి, ఆమె ప్రియుడు తంగమణిని ఇక మీద బుధ్దిగా ఉండాలని ఊరి పెద్దలు వార్నింగ్ ఇచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

నువ్వు విశ్వ సుందరి, ఎవరైనా ఓకే అంటారు
నువ్వు చాలా అందంగా ఉంటావని, అసలు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఎవ్వరూ నమ్మరని ప్రియుడు తంగమణి ప్రియురాలు శాంతిని ఆకాశానికి ఎత్తేశాడు. అయితే నా భర్తను కార్తికేయన్ ను చంపేయాలని, తరువాత పిల్లలను వదిలేసి మనం దూరంగా వెళ్లి రెండో పెళ్లి చేసుకుందామని శాంతి ఆమె ప్రియుడు తంగమణికి చెప్పింది.

ఓరీ మూర్ఖుడా..... ఏం పోయేకాలం రా!
తాను శాంతి భర్త కార్తికేయన్ ను చంపేస్తే ఆమెను రెండో పెళ్లి చేసుకుంటానని కొన్ని రోజుల క్రితం ప్రియుడు తంగమణి అతని స్నేహితులకు చెప్పాడు. ఓరీ మూర్ఖుడా, నీకేం పోయేకాలం వచ్చిందిరా, పిల్లల తల్లిని పెళ్లి చేసుకుంటావా, శాంతి ఏం ప్రపంచ సుందరి అనుకుంటున్నావా? అంటూ స్నేహితులు తంగమణిని మందలించారు.
Recommended Video

ప్రేమ గుడ్డిది.... కామం చెడ్డది
స్నేహితులు చెప్పినా తంగమణి మాత్రం శాంతిని పెళ్లి చేసుకుంటానని, కార్తికేయన్ ను చంపేస్తానని భీష్మించుకున్నాడు. ఈ విషయంలో తాము సహాయం చెయ్యలేమని తంగమణికి అతని స్నేహితులు తేల్చి చెప్పారు. అయితే తాగుబోతు స్నేహితుడు రామచంద్రన్ మాత్రం తంగమణికి సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చాడు. ప్లాన్ ప్రకారం ఈనెల 17వ తేదీన రాత్రి మద్యం సేవించడానికి రావాలని కార్తికేయన్ కు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు రప్పించి ఉరి వేసి చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించామని భార్య శాంతి, ప్రియుడు తంగమణి, అతని స్నేహితుడు రామచంద్రన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. రెండో పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడిన శాంతి, ఆమె ప్రియుడు తంగమణి, వారి స్నేహితుడు రామచంద్రన్ ప్రస్తుతం శ్రీకృష్ణుడి జన్మస్థానం (జైలు)లో చెక్క భజన చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications