వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Illegal affair: భర్త తండ్రి, పొలిటికల్ లీడర్ హత్యకు కిలాడీ కోడలు ప్రియుడు ఎంట్రీ, ఆస్తి, ప్రతీకారం, క్లైమాక్స్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జాతీయ పార్టీలో చురుకైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు, పిల్లలు వివాహాలు చేసుకుని ఎవరిపాటికి వాళ్లు ఉంటున్నారు. రాజకీయ నాయకుడికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తరువాత ఆ లీడర్ సమీపంలోని ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లి నిద్రపోవడం అలవాటు, ఫామ్ హౌస్ లోనే సర్వీసింగ్ స్టేషన్ కూడా ఉంది. ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిన పొలిటికల్ లీడర్ ఫామ్ హౌస్ లో నిద్రపోయారు. అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, డ్రాగెన్స్ తీసుకుని రాజకీయ నాయకుడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. మరుసటి రోజు ఉదయం రాజకీయ నాయకుడు హత్యకు గురి కావడంతో అందరూ హడలిపోయారు. రాజకీయ నాయకుడి హత్య కేసులో కింగ్ పిన్ ఆయన కోడలు అని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు. రాజకీయ నాయకుడి హత్య కేసులో ఆయన కోడలు, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Commission: మఠాలు, గుడికి నిధులు విడుదల చెయ్యడానికి కమీషన్, బాంబు పేల్చిన స్వామీజీ, డిస్కౌంట్ !Commission: మఠాలు, గుడికి నిధులు విడుదల చెయ్యడానికి కమీషన్, బాంబు పేల్చిన స్వామీజీ, డిస్కౌంట్ !

పొలిటికల్ లీడర్

పొలిటికల్ లీడర్


కర్ణాటకలోని రామనగర జిల్లాలోని బిడిది తాలుకాలోని బానందూరు గ్రామంలో గంటప్ప (60) అనే ఆయన నివాసం ఉంటున్నారు. గంటప్ప పిల్లలు వివాహాలు చేసుకుని ఎవరిపాటికి వాళ్లు ఉంటున్నారు. గంటప్ప అతని భార్య ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంటప్పకు బెంగళూరు నగర శివార్లలోని బిడిది పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. గంటప్ప ఆస్తులు బెంగళూరుకు శివార్లలోనే ఉండటంతో ఆస్తుల విలువ ఎక్కువగానే ఉంది.

సొంత ఫామ్ హౌస్ లో పోలిటికల్ లీడర్

సొంత ఫామ్ హౌస్ లో పోలిటికల్ లీడర్

ప్రతిరోజు రాత్రి ఇంటో భోజనం చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ లీడర్ గంటప్ప ఇంటి సమీపంలోని ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లి నిద్రపోవడం అలవాటు, ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి భోజనం చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ లీడర్ గంటప్ప ఆయన రూమ్ లో నిద్రపోయారు. మామూలుగానే ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్లి నిద్రపోయిన గంటప్ప ఆ రోజు తన ప్రాణం పోతుందని ఊహించలేకపోయాడు.

లీడర్ ను చంపేసి ఎస్కేప్

లీడర్ ను చంపేసి ఎస్కేప్

అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, డ్రాగెన్స్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంటప్పను దారుణంగా చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంటప్ప హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఆస్తి వివాదంలో గంటప్పను హత్య చేశారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో అప్పటి నుంచి పోలీసు అధికారులు విచారణ చేశారు.

 కొడుకు లవ్ మ్యారేజ్

కొడుకు లవ్ మ్యారేజ్


గంటప్ప కుమారుడు నందీష్ కొన్ని సంవత్సరాల క్రితం చైత్రా అనే యువతిని ప్రేమించాడు. తండ్రి గంటప్పను ఎదిరించిన నందీష్ చైత్రాను వివాహం చేసుకున్నాడు. కొడుకు నందీష్ చైత్రాను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వెళ్లడంతో గంటప్ప ఇద్దరిని మెడపట్టి బయటకు గెంటేశాడు. చైత్రాను అందరి ముందు అవమానించి నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా ఇంట్లో అడుగు పెట్టలేవని అప్పట్లోనే తేల్చి చెప్పాడు.

మామ మీద పగ పెంచుకున్న చైత్రా

మామ మీద పగ పెంచుకున్న చైత్రా

ఆస్తిలో భాగం ఇవ్వనని, కనీసం ఆర్థిక సహాయం చెయ్యనని గంటప్ప తేల్చి చెప్పాడు. అప్పటి నుంచి గంటప్ప కొడుకు నందీష్ అతని భార్య చైత్రాతో కలిసి వేరుగా జీవిస్తున్నారు. తనను అందరి ముందు అవమానించిన మామ గంటప్పను చంపేయాలని చైత్రా పగతో రగిలిపోయింది. నందీష్ ను పెళ్లి చేసుకోకముందే చైత్రాకు నవీన్ అనే యువకుడితో చనువు ఉంది.

మామ హత్యకు ప్రియుడికి కిరాయి ఇచ్చిన కోడలు

మామ హత్యకు ప్రియుడికి కిరాయి ఇచ్చిన కోడలు

నందీష్ వివాహం జరిగిపోయిన తరువాత కూడా చైత్రా ఆమె ప్రియుడు నవీన్ తో అక్రమ సంబంధం పెట్టుకునింది. మా మామ గంటప్పను చంపేస్తే నీకు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన చైత్రా ముందుగా రూ. 1 లక్ష విలువైన బంగారు గొలుసు ప్రియుడికి ఇచ్చింది. ప్రియురాలు చైత్రా కోరిక తీర్చాలని ఆమె ప్రియుడు నవీన్ డిసైడ్ అయ్యాడు

కోడలు, ప్రియుడు అరెస్టు

కోడలు, ప్రియుడు అరెస్టు

ఫిబ్రవరి 25వ తేదీ అర్దరాత్రి ఫామ్ హౌస్ కు వెళ్లిన నవీన్ అతని ప్రియురాలు చైత్రా ఆమె మామ గంటప్పను చంపేసి వెళ్లిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంటప్ప హత్య కేసులో కింగ్ పిన్ ఆయన కోడలు చైత్రా అని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు. రాజకీయ నాయకుడు గంటప్ప హత్య కేసులో ఆయన కోడలు చైత్రా, ఆమె ప్రియుడు నవీన్ ను రామనగర జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Illegal affair: Bidadi police arrested Chitra for allegedly hiring a supari killer to murder her father in law. Congress leader Gantappa found murdered on February 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X