Wife: విడాకులు, అక్రమ సంబంధం, యముండా, నువ్వు దొంగముండ, మాజీ భార్యను స్పాట్ లో చంపేసిన భర్త !

భార్య, కుమార్తెను వదిలేసిన భర్త ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ భూమి మీద ఇదే నా చివరికి రోజు అని భార్య ఊహించలేకపోయింది. యముండా నువ్వు పెద్ద దొంగముండ అని రెచ్చిపోయిన భర్త ఆమెను చంపేసి సైలెంట్ గా ఎస్కేప్ అయ్యాడు.

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. కుమార్తె పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. చాలా సంవత్సరాల నుంచి దంపతుల పోట్లాడుకుంటున్నారు. అందంగా ఉన్న భార్య మీద ఆమె భర్తకు అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విషయంలో గొడవపడిన దంపతులు విడిపోయారు. కూతురితో కలిసి తల్లి వేరుగా ఉంటున్నది. భార్య, కుమార్తెను వదిలేసిన భర్త ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఉదయం నిద్రలేచిన భార్య ఈ భూమి మీద ఇదే నా చివరికి రోజు అని ఊహించలేకపోయింది. యముండా నువ్వు పెద్ద దొంగముండ అని రెచ్చిపోయిన భర్త ఆమెను చంపేసి సైలెంట్ గా ఎస్కేప్ అయ్యాడు.

బెంగళూరులో ఫ్యామిలీ

బెంగళూరులో ఫ్యామిలీ

బెంగళూరుకు చెందిన కౌసర్ ముబీన్ (35) అనే మహిళ కొన్నాళ్ల క్రితం నదీమ్‌ అనే యువకుడిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత నదీమ్, కౌసర్ ముబీన్ చాలా సంతోషంగా కాపురం చేశారు. కౌసర్, నదీమ్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. వ్యాపారం చేస్తున్న నదీమ్ అతని భార్య కౌసర్, కూతురిని బాగానే చూసుకునేవాడు. కూతురు పుట్టిన కొన్ని సంవత్సరాల తరువాత అసలు కథ మొదలైయ్యింది.

భార్య మీద డౌట్ తో వదిలేశాడు

భార్య మీద డౌట్ తో వదిలేశాడు

కుమార్తె పుట్టిన తరువాత నదీమ్, కౌసర్ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. చాలా సంవత్సరాల నుంచి నదీమ్, కౌసర్ దంపతులు పోట్లాడుకుంటున్నారు. అందంగా ఉన్న భార్య కౌసర్ మీద ఆమె భర్త నదీమ్ కు అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విషయంలో గొడవపడిన నదీమ్, కౌసర్ దంపతులు విడిపోయారు. బెంగళూరులోని శాంతినగర్ సమీపంలోని నంజప్ప సర్కిల్ సమీపంలోని ఓ ఇంట్లో కౌసర్ ముబీనా ఆమె కుమార్తెతో కలిసి నివసిస్తోంది.

విడాకులు ఇచ్చిన భార్యను వదల్లేదు

విడాకులు ఇచ్చిన భార్యను వదల్లేదు

నదీమ్, కౌసర్ మధ్య పొంతన లేకపోవడంతో ఇద్దరూ విడివిడిగా చాలాకాలం నుంచి జీవిస్తున్నారు. అయినా కూడా నదీమ్ అతని మాజీ భార్య కౌసర్ ఇంటి దగ్గరికి వెళ్లి నువ్వు ఎవరితో తిరుగుతున్నావు ?, నీ ఇంటికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు అంటూ గొడవ పడేవాడు. విడాకులు ఇచ్చిన మాజీ భార్య కౌసర్ ను మాత్రం నదీమ్ వదల్లేదు. సోమవారం కూతురు ఇంట్లో లేదని, మాజీ భార్య కౌసర్ మాత్రమే ఉందని నదీమ్ కు తెలిసింది.

గుమ్మం మీద గొడవ

గుమ్మం మీద గొడవ

సోమవారం కౌసర్ ఒంటరిగా ఉందని తెలిసి అక్కడికి వెళ్లిన నదీమ్ అతని మాజీ భార్యతో గొడవ పడ్డాడు. నదీమ్, కౌసర్ ఇంటి గుమ్మం వద్ద గొడవ పడ్డారు. ఇద్దరి గొడవ ఇరుగుపొరుగు వారికి కూడా వినిపించింది, కొందరు చూసిచూడన్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాజీ భార్య కౌసర్ ను అంతం చెయ్యాలని ముందుకుగానే ప్లాన్ వేసుకున్న నదీమ్ ఇక దీన్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు.

భార్య గొంతు కోసి చంపేసిన భర్త

భార్య గొంతు కోసి చంపేసిన భర్త

ఆ సమయంలో కౌసర్ తో గొడవపడుతున్న నదీమ్ ఒక్కసారిగా వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని అతని మాజీ భార్య కౌసర్ గొంతు కోసేయడంతో కేకలు వేసిన కౌసక ఆమె ఇంటి తలుపు గుమ్మంలో కుప్పకూలిపోయింది. నువ్వు దొంగ ముండ ఇక్కడే చావు అంటూ నదీమ్ కేకలు వేశాడని స్థానికులు అంటున్నారు. గొంతు పూర్తిగా తెగిపోవడంతో కౌసర్ ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. జనం గుమిగూడడంతో స్టైల్ గా ఫోన్ లో మాట్లాడుకుంటూ నదీమ్ అక్కడి నుంచి పరారైనాడు..

మొగుడే యముడు

మొగుడే యముడు

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి అప్పటికే కౌసర్ మృతి చెందింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ టీమ్‌, డాగ్‌ టీమ్‌ ఘటనాస్థలంలో పరిశీలించి ఆధారాలు సేకరించారు. కౌసర్ కూతురు ఇప్పుడు తల్లిని కోల్పోయి అనాథ అయ్యింది. తనను వదిలేసిన తన మాజీ భార్య కౌసర్ చెడు తిరుగుళ్లు తిరుగుతోందని, దానిని వదిలిపెట్టకూడదని నదీమ్ అతని స్నేహితులతో చాలాసార్లు చెప్పాడని, చివరికి అన్నంతపని చేశాడని పోలీసులు అంటున్నారు. బెంగళూరులోని అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి కౌసర్ ను దారుణంగా హత్య చేసిన నిందితుడు నదీమ్ కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+