బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భార్య దెబ్బతో ఊరు వదిలేశాడు, సిటీలో సైసై, తాళం వేసి అత్త, ఇద్దరూ ఫినిష్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు. భర్త చిన్న వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో ఉంటున్న భార్య అడ్డదారి తొక్కింది. ఉదయం బయటకు వెలుతున్న భర్త రాత్రికే ఇంటికి వెలుతున్నాడు. పగలు అంతా ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్య ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. చాలాకాలం పాటు భార్య అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే భార్య టైమ్ బాగా లేకపోవడంతో ఆమె భర్త అనుకోకుండా మద్యాహ్నం ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ సమయంలో భార్య, ఆమె ప్రియుడు రెడ్ హ్యాండెడ్ గా భర్తకు చిక్కిపోయారు. భార్యను పట్టుకుని బెండ్ తీసిన భర్త ప్రియుడికి వార్నింగ్ ఇచ్చి మరోసారి చూస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయితే భార్య మాత్రం పద్దతి మార్చుకోకుండా ప్రియుడితో ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయి టామ్ టామ్ అయ్యింది.

భార్య తీరుతో విసిగిపోయిన భర్త ఊరు వదిలేసి ఐటీ హబ్ చేరుకున్నాడు. కాలేజ్ లో చదువుతున్న పిల్లలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా భార్య ఐటీ హబ్ లో మరో ప్రియుడిని సెట్ చేసుకుని అక్కడా ఎంజాయ్ చేసింది. భార్య దెబ్బతో హడలిపోయిన భర్త కొబ్బరి బోండాలు కత్తిరించే కొడవలి తీసుకెళ్లి భార్యను దారుణంగా నరికేశారు. భార్యను చంపేస్తున్న సమయంలో అడ్డుపడిన అత్తను కూడా అతను దారణంగా చంపేశాడు. నా భార్య అక్రమ సంబంధానికి మా అత్త కూడా తాళం వేస్తోందని, అందుకే ఇద్దరిని నరికి చంపేశానని భర్త పోలీసులకు చెప్పడం కలకలం రేపింది.

activist: భజరంగ్ దళ్ కార్యకర్త హత్య, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, రూ 10 లక్షలకు డీల్ !activist: భజరంగ్ దళ్ కార్యకర్త హత్య, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, రూ 10 లక్షలకు డీల్ !

 హ్యాపీలైప్

హ్యాపీలైప్

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళికి చెంది రవికుమార్ (47), సావిత్రమ్మ (40) అనే మహిళకు 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం చేసుకున్న రవికుమార్, సావిత్రమ్మ దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు. సావిత్రమ్మ భర్త రవికుమార్ కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు.

 ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ఇంట్లో ఉంటున్న సావిత్రమ్మ అడ్డదారి తొక్కింది. ఉదయం బయటకు వెలుతున్న భర్త రవికుమార్ వ్యాపారం ముగించుకుని రాత్రికే ఇంటికి వెలుతున్నాడు. పగలు అంతా ఇంట్లో ఖాళీగా ఉంటున్న రవికుమార్ భార్య సావిత్రమ్మ ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. చాలాకాలం పాటు రవికుమార్ భార్య సావిత్రమ్మ అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది.

 భార్య టైమ్ బ్యాడ్

భార్య టైమ్ బ్యాడ్

సావిత్రమ్మ టైమ్ బాగా లేకపోవడంతో ఆమె భర్త రవికుమార్ ఓ రోజు అనుకోకుండా మద్యాహ్నం ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ సమయంలో భార్య సావిత్రమ్మ, ఆమె ప్రియుడు రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ కు చిక్కిపోయారు. భార్య సావిత్రమ్మను పట్టుకుని బెండ్ తీసిన ఆమె భర్త రవికుమార్ అతని భార్య ప్రియుడికి వార్నింగ్ ఇచ్చి మరోసారి చూస్తే ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

 బెంగళూరుకు జంప్

బెంగళూరుకు జంప్

అప్పటి నుంచి రవికుమార్, సావిత్రమ్మ దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని గొడలు జరిగినా రవికుమార్ భార్య సావిత్రమ్మ మాత్రం ఆమె పద్దతి ఏమాత్రం మార్చుకోకుండా ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసింది. రవికుమార్ భార్య పావిత్రమ్మ అక్రమ సంబంధం విషయం తీర్థహళ్ళి ఊరు మొత్తం తెలిసిపోయి టామ్ టామ్ అయ్యింది. భార్య సావిత్రమ్మ తీరుతో విసిగిపోయిన రవికుమార్ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తీర్థహళ్లి ఊరు వదిలేసి ఐటీ హబ్ చేరుకున్నారు.

 బెంగళూరులో భార్యకు మరో ప్రియుడు

బెంగళూరులో భార్యకు మరో ప్రియుడు

బెంగళూరులోని గోవిందరాజనగర్ లో అద్దె ఇళ్లు తీసుకుని రవికుమార్, సావిత్రమ్మ దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. గోవిందరాజనగర్ లోనే రవికుమార్ బేకరి పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. కాలేజ్ లో చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా సావిత్రమ్మ ఐటీ హబ్ బెంగళూరులో మరో ప్రియుడిని సెట్ చేసుకుని అక్కడా ఎంజాయ్ చేసింది.

 భార్యలో మార్పురాదని డిసైడ్ అయిన భర్త

భార్యలో మార్పురాదని డిసైడ్ అయిన భర్త

భార్య సావిత్రమ్మ ఇక ఆమె జన్మలో మారదని, ఆమెను చంపేయాలని రవికుమార్ డిసైడ్ అయ్యాడు. సోమవారం రాత్రి రవికుమార్, సావిత్రమ్మ దంపతుల మద్య గొడవ జరిగింది. మంగళవారం కూడా ఇదే విషయంలో సావిత్రమ్మ, రవికుమార్ మద్య గొడవ జరిగింది. మంగళవారం రవికుమార్ ఇద్దరి పిల్లలు కాలేజ్ కు వెళ్లారు.

 భార్యతో పాటు అత్తను కూడా నరికి చంపేశాడు

భార్యతో పాటు అత్తను కూడా నరికి చంపేశాడు

భార్య సావిత్రమ్మ దెబ్బతో రగిలిపోయిన భర్త కొబ్బరి బోండాలు కత్తిరించే కొడవలి తీసుకుని ఇంటికివెళ్లి అతని భార్య సావిత్రమ్మతో గోడవపడి ఆమె మీద కొబ్బరి బొండాలు కత్తిరించే కొడవలితో దాడి చేశాడు. భార్య సావిత్రమ్మను చంపేస్తున్న సమయంలో అడ్డుపడిన అత్త సరోజమ్మ (60)ను కూడా రవికుమార్ దారణంగా చంపేసి అక్కడి నుంచి పరారైనాడు.

 అత్తా, భార్యను లేపేసి ఎస్కేప్

అత్తా, భార్యను లేపేసి ఎస్కేప్

బెంగళూరులో జంట హత్యలు చేసి తప్పించుకుని పారిపోయిన రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. నా భార్య సావిత్రమ్మ అక్రమ సంబంధానికి మా అత్త సరోజమ్మ కూడా తాళం వేస్తోందని, అందుకే ఇద్దరిని నరికి చంపేశానని రవికుమార్ గోవిందరాజనగర పోలీసులకు చెప్పడం కలకలం రేపింది. నా భార్య సావిత్రమ్మ అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేసి మా పరువు తీస్తోందని, కూతురు అడ్డదారి తొక్కుతోందని తెలిసినా మా అత్త సరోజమ్మ ఏమాత్రం పట్టించుకోకుండా కూతురు పడుపనులు సినిమా చూస్తున్నట్లు చూస్తోందని రవికుమార్ పోలీసులకు చెప్పాడు,

English summary
Illegal affair: Double murder near Govindaraj Nagar in Bengaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X