Illegal affair: దుబాయ్ రిటన్, వీవీలో ల్యాబ్ టెక్నీషియన్, అర్దరాత్రి ఊరి బయట నగ్నంగా, క్లోజ్ !

బెంగళూరు/ కలబురిగి: విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత యువకుడు ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగంలో చేరాడు. ఇదే సమయంలో దుబాయ్ లో మంచి జీతం ఇచ్చే ఉద్యోగం రావడం. చక్కటి అవకాశం రావడంతో ఆ యువకుడు దుబాయ్ వెళ్లిపోయాడు. దుబాయ్ లో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆ యువకుడు కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో సొంత ఊరికి వచ్చేశాడు. తరువాత పుట్టపర్తి సత్యసాయి యూనివర్శిటీలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం రావడంతో అక్కడ ఉద్యోగంలో చేరాడు. ప్రతిరోజూ సొంత ఊరు నుంచి పుట్టపర్తి సత్యసాయి యూనివర్శిటీలో ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. ఎప్పటిలాగే సాయంత్రం ల్యాబ్ లో పని ముగించుకున్న యువకుడు బైక్ లో ఇంటికి బయలుదేరాడు. రాత్రి అయినా ఆ యువకుడు ఇంటికి చేరుకోలేదు. యువకుడి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ గాలించారు. ఊరి సమీపంలోని నిర్జనప్రదేశంలో ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఆ యువకుడు నగ్నంగా శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

 ల్యాబ్ టెక్నీషియన్

ల్యాబ్ టెక్నీషియన్

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని కమలాపుర తాలుకాలోని నావదగి గ్రామంలో సిద్దప్ప అలియాస్ సిద్దప్ప సంగి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత సిద్దప్ప కలబురిగిలోని ఓ ల్యాబ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం కలబురిగిలోనే సిద్దప్ప ఉద్యోగం చేస్తూ కాలం గడిపేశాడు.

 దుబాయ్ లో మంచి ఉద్యోగం వచ్చిందని ఆనందం

దుబాయ్ లో మంచి ఉద్యోగం వచ్చిందని ఆనందం

కలబురిగిలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే సిద్దప్పకు దుబాయ్ లో మంచి జీతం ఇచ్చే ఉద్యోగం రావడం. చక్కటి అవకాశం రావడంతో అతను దుబాయ్ వెళ్లిపోయాడు. దుబాయ్ లో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన సిద్దప్ప డబ్బులు సంపాధించి కొంచెం అతని ఇంటికి పంపించి కొంచెం అతను దాచిపెట్టుకున్నాడని తెలిసింది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో సంవత్సరం క్రితం సిద్దప్ప కలబురిగి జిల్లాలోని సొంత ఊరికి వచ్చేశాడు.

 పుట్టపర్తి సాయిబాబా వీవీలో ఉద్యోగం

పుట్టపర్తి సాయిబాబా వీవీలో ఉద్యోగం

దుబాయ్ నుంచి వచ్చేసిన తరువాత కొంతకాలం సిద్దప్ప అతని ఊరిలోనే ఖాళీగా ఉన్నాడు. తరువాత నవనిహాళ్ సమీపంలో ఉన్న పుట్టపర్తి సత్యసాయి యూనివర్శిటీలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం రావడంతో సిద్దప్ప అక్కడే ఉద్యోగంలో చేరాడు. సిద్దప్ప ప్రతిరోజూ సొంత ఊరు నుంచి పుట్టపర్తి సత్యసాయి యూనివర్శిటీలో ఉద్యోగానికి బైక్ లో వెళ్లి వస్తున్నాడు.

 పని ఉందని ఫోన్ చేసి చెప్పాడు

పని ఉందని ఫోన్ చేసి చెప్పాడు

ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం ల్యాబ్ లో పని ముగించుకున్న సిద్దప్ప బైక్ లో ఇంటికి బయలుదేరాడు. తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన సిద్దప్ప తాను కమలాపురంలో ఉన్నానని, ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని చెప్పాడు. రాత్రి అయినా సిద్దప్ప ఇంటికి చేరుకోలేదు. సిద్దప్పకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తరువాత సిద్దప్ప కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ గాలించారు.

 నగ్నంగా శవమైన సిద్దప్ప

నగ్నంగా శవమైన సిద్దప్ప

గురువారం ఉదయం నావదగి గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలో ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా సిద్దప్ప నగ్నంగా శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సిద్దప్ప శవమై కనిపించిన ప్రాంతం సమీపంలో అతని బైక్ పార్క్ చేసి ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. సిద్దప్పకు ఇంకా వివాహం కాలేదని, అతను ఓ వివాహిత మహిళతో చాలా చనువుగా ఉంటున్నాడని, అక్రమ సంబందం కారణంగానే హత్య జరిగి ఉంటుందని, అందుకే సిద్దప్ప నగ్నంగా పడి ఉన్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. సిద్దప్ప మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నామని కలబురిగి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+