Illegal affair: భర్తను వదిలేసి తమ్ముడి ఫ్రెండ్ తో ?, అక్క దెబ్బకు సొంత తమ్ముడు ?, క్లైమాక్స్ !

బెంగళూరు/ కలబురిగి: వివాహం చేసుకున్న మహిళ కొంతకాలం ఆమె భర్తతో కాపురం చేసింది. పుట్టింటికి వెళ్లిన మహిళ అక్కడే నివాసం ఉంటున్నది. మహిళకు ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఓ తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు అక్కచెల్లెళ్లకు పెళ్లి అయ్యింది. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు. రోజు ఉదయం నుంచి రాత్రి బయట ఉంటున్న తమ్ముడు రాత్రిపొద్దుపోయిన తరువాత ఇంటికి వెలుతున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ్ముడు రెండు జిల్లాల సరిహద్దులో దారుణ హత్యకు గురైనాడు. రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. మొబైల్ ఫోన్ నెబర్ల లోకేషన్లు, స్పాట్ లో చిక్కినసాక్షాలతో విచారణ చేశారు. తమ్ముడిని కిరాయి ఇచ్చి హత్య చెయ్యాలని సొంత అక్క స్కెచ్ వేసి డబ్బులు ఇచ్చిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

Illegal affair: భార్య లేడీ టీచర్, ప్రియురాలు కాలేజ్ స్టూడెంట్, క్లైమాక్స్ లో భర్త పరిస్థితి ?, రివర్స్ !

పెళ్లి చేసుకుని పుట్టింటిలో ఉంటోంది

పెళ్లి చేసుకుని పుట్టింటిలో ఉంటోంది

కర్ణాటకలోని కలబురిగి నగరంలోని గాజీపుర ప్రాంతంలో నాగరాజు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నాగరాజుకు ముగ్గురు అక్కలు, ఓ చెల్లెలు ఉన్నారు. నాగరాజు అక్క సునితా, అనితాకు వివాహం అయ్యింది. కొంతకాలం భర్తలతో కాపురం చేసిన సునితా, అనితాలు ప్రస్తుతం కలబురిగిలోని పుట్టింటిలోనే కాలం గడుపుతున్నారు.

గాలికి తిరుగుతున్న నాగరాజు

గాలికి తిరుగుతున్న నాగరాజు

సునితా సోదరుడు నాగరాజ్ పెయింట్ పని చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఉంటున్న నాగరాజ్ భోజనం మొత్తం బయట చేస్తూ రాత్రి మాత్రం ఇంటికి వెళ్లి నిద్రపోయి మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్లిపోతున్నాడు. ఇంట్లో భోజనం చెయ్యకుండా బయట కాలం గడుపుతున్న నాగరాజు ఇంటి ఖర్చులకు మాత్రం అతని తల్లి దగ్గరకు కొంత డబ్బులు ఇస్తున్నాడు.

 యువకుడి దారుణ హత్య

యువకుడి దారుణ హత్య

నాగరాజు తండ్రి కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు. తండ్రి లేకపోవడంతో తల్లి దగ్గర ఆమె నలుగురు కూతుర్లు ఉంటున్నారు. గత నెల 28వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన నాగరాజు కలబురిగి- అళంద మార్గం మద్యలోని భోసర్గ గ్రామం సమీపంలో దారుణ హత్యకు గురైనాడు. మరుసటి రోజు ఉదయం నాగరాజు హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

కిరాయి ఇచ్చి హత్య చేయించిన అక్క

కిరాయి ఇచ్చి హత్య చేయించిన అక్క

రంగంలోకి దిగిన పోలీసులు నాగరాజు హత్య కేసును పలు కోణాల్లో విచారణ చేశారు. మొబైల్ ఫోన్ నెబర్ల లోకేషన్లు, స్పాట్ లో చిక్కిన మద్యం సీసాలు, బిరియానీ ప్యాకెట్ల ఖాళీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్ లతో పాటు అనేక సాక్షాలతో విచారణ చేశారు. తమ్ముడు నాగరాజు హత్యకు అతని అక్క సునితా కిరాయి ఇచ్చి హత్య చెయ్యాలని చెప్పిందని, ఆమె డబ్బులు కూడా ఇచ్చిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

రౌడీషీటర్ తో అక్క అక్రమ సంబంధం

రౌడీషీటర్ తో అక్క అక్రమ సంబంధం


నాగరాజు నివాసం ఉంటున్న పక్క ఏరియాలో అవినాష్ అనే రౌడీషీటర్ నివాసం ఉంటున్నాడు. అవినాష్, నాగరాజు స్నేహితులు. భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్న సునితా తమ్ముడు నాగరాజ్ స్నేహితుడు అవినాష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. నాగరాజ్ మద్యంకు బానిస అయ్యి పెయింట్ పని చేస్తూ బయట తిరుగుతుంటే ప్రియుడు అవినాష్ ను ఇంటికి పిలిపించుకుంటున్న సునితా అతని తో ఎంజాయ్ చేసింది.

అడ్డుపడుతున్నాడని హత్య

అడ్డుపడుతున్నాడని హత్య

అవినాష్ ఎక్కువగా ఇంటికి వచ్చి వెలుతున్నాడని తెలుసుకున్న నాగరాజ్ అతని అక్కలతో పాటు తల్లిని మందలించాడు. అవినాష్ ను ఇంటికి రాకుండా చూడాలని హెచ్చరించాడుద. తమ్ముడి కారణంగా ప్రియుడు అవినాష్ దూరం అవుతున్నాడని రగిలిపోయిన సునితా ప్రియుడికి కిరాయి ఇచ్చి తమ్ముడు నాగరాజ్ ను హత్య చెయ్యాలని చెప్పింది.

ప్రియుడి మోజులో పడి ?

ప్రియుడి మోజులో పడి ?

రౌడీషీటర్ నాగరాజ్ తో పాటు అతని స్నేహితులు గత నెల 28వ తేదీ నాగరాజకు లిక్కర్ పార్టీ ఇచ్చి హత్య తరువాత పక్కాప్లాన్ తో హత్య చేశారని పోలీసులు అన్నారు. నాగరాజ్ హత్య కేసులో అతని అక్క సునితా, ఆమె ప్రియుడు అవినాష్, అతని స్నేహితులను అరెస్టు చేశామని కలబురిగి పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగా తమ్ముడిని హత్య చేయించి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న సునితా ఇప్పుడు జైలుపాలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+