Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: నువ్వే చైనా ఫోన్ లా ఉంటే నీకు స్మార్ట్ ఫోన్ కావాలా, కళ్లు మూసుకుని కాపురం చేస్తే !

చెన్నై/ తిరుచ్చి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో భర్త సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టడంతో పెద్దలకు దూరంగా అద్దె ఇల్లు తీసుకుని పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భార్య పరాయి వ్యక్తులతో పిచ్చపాటిగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో కాలం గడిపింది. భార్య ఎవరితోనో అక్రమ సంబంధం సాగిస్తోందని భర్తకు తెలిసింది. నీ పద్దతి మార్చుకోవాలని భర్త చాలాసార్లు భార్యను హెచ్చరించాడు. అయితే అంతా నాఇష్టం అంటూ భార్య రెచ్చిపోయింది. చూడటానికి నువ్వే చైనా ఫోన్ లాగా ఉంటావు, నేనే నీతో కళ్లు మూసుకుని కాపురం చేస్తున్నాను, నీకు ఇప్పుడు ఇంకో స్మార్ట్ ఫోన్ కావలసి వచ్చిందా అంటూ సహనం కోల్పోయిన భర్త అతి కిరాతకంగా భార్యను హత్య చేశాడు.

 ప్రేమ గుడ్డిది అంటే ఇదే

ప్రేమ గుడ్డిది అంటే ఇదే

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన తవిసీలన్ (27), రాజేశ్వరి (24) కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. రాజేశ్వరి అందంగా లేకపోయినా తవిపీలన్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తవిసీలన్, రాజేశ్వరి దంపతులకు సాయిప్రసాద్ (5) అనే కుమారుడు, కవిని (2) అనే కుమార్తె ఉన్నారు.

 భార్య రూటే సపరేటు

భార్య రూటే సపరేటు

తిరుచ్చిలోని తిలైనగర్ లో తవిసీలన్, రాజేశ్వరి దంపతులు పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తిరుచ్చిలోని ప్రముఖ హోటల్ లో తవిసీలన్ వంట మాస్టర్ గా పని చేస్తున్నారు. ఉన్నకాటికి తవిసీలన్ భార్య, పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నాడు. తనకు స్మార్ట్ ఫోన్ కావాలని భార్య రాజేశ్వరి అడగడంతో భర్త తవిసీలన్ తీసిచ్చాడు.

 ఉదయం నుంచి రాత్రి వరకు అదేపని

ఉదయం నుంచి రాత్రి వరకు అదేపని

ప్రతిరోజూ ఉదయం 11 గంటల సమయంలో తవిసీలన్ హోటల్ లో వంట చెయ్యడానికి వెళ్లిపోయి రాత్రి పొద్దుపోయిన తరువాత ఇంటికి వెలుతున్నాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుంటున్న రాజేశ్వరి నిత్యం ఎవరితోనే మాట్లాడుతూ ఉండేది. అంతే కాకుండా పగలు, అర్దరాత్రి అని తేడా లేకుండా చాలా మందితో రాజేశ్వరి సోషల్ మీడియాలో చాటింగ్ చెయ్యడం మొదలు పెట్టింది.

 నువ్వే చైనా ఫోన్.... నీకు మళ్లీ స్మార్ట్ ఫోనా ?

నువ్వే చైనా ఫోన్.... నీకు మళ్లీ స్మార్ట్ ఫోనా ?

భార్య రాజేశ్వరి తీరుపై భర్త తవిసీలన్ కు అనుమానం వచ్చింది. ఎవ్వరితో నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు అని భార్య రాజేశ్వరిని ప్రశ్నించాడు. నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు అంటూ భార్య రాజేశ్వరి తిక్కతిక్క సమాధానాలు చెప్పడం మొదలు పెట్టింది. చూడటానికి నువ్వే చైనా ఫోన్ లాగా ఉన్నావు, నీకు నేను కాకుండా ఇంకో స్మార్ట్ ఫోన్ (ప్రియుడు) అవసరమా అంటూ భర్త తవిసీలన్ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు.

 కాళ్లు మూసుకుని కాపురం చేస్తున్నా

కాళ్లు మూసుకుని కాపురం చేస్తున్నా

నేనే నీతో కళ్లు మూసుకుని కాపురం చేస్తున్నాను, నీకు రంకు మొగుడు అవసరమా అంటూ భర్త రాజేశ్వరికి వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల సంక్రాంతి పండుగకు మా తల్లిదండ్రుల ఇంటికి వెలుదామని తవిసీలన్ భార్య రాజేశ్వరికి చెప్పాడు. నేనురాను, పిల్లలను తీసుకుని నువ్వే వెళ్లు అని చెప్పిన రాజేశ్వరి ఇంటిలోనే ఉండిపోయింది, పిల్లలతో కలిసి రెండు రోజుల పాటు ఊరికి వెళ్లి వచ్చిన తవిసీలన్ భార్య రాజేశ్వరి తీరుపై మరింత అసహనం పెంచుకున్నాడు.

 రాత్రిపూట సినిమా చూపించాడు

రాత్రిపూట సినిమా చూపించాడు

భార్య చెప్పిన మాట వినడం లేదని రాత్రిపూట మద్యం సేవించి ఇంటికి వెలుతున్న తవిసీలన్ భార్య రాజేశ్వరిని పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారం రోజుల నుంచి పంచాయితీలు చేస్తూ దంపతులకు సర్ది చెబుతున్నారు. అయినా రాజేశ్వరి మాత్రం ఆమె తీరు మార్చుకోలేదు.

Recommended Video

    DGCA ఉత్తర్వులు.. అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బ్యాన్ ! || Oneindia Telugu
     పిల్లల ముందే భార్యను చంపేసి చెక్కేశాడు

    పిల్లల ముందే భార్యను చంపేసి చెక్కేశాడు

    రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన తవిసీలన్ భార్యతో మరోసారి గొడవ పెట్టుకున్నాడు. తరువాత ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి పెద్ద కర్ర తీసుకుని భార్య రాజేశ్వరి తలపై చితకబాదేశాడు. కిందపడిన రాజేశ్వరి గొంతును కత్తితో కోసి అక్కడి నుంచి పరారైనాడు. వేకువ జామున పక్కింటిలో నివాసం ఉంటున్న శకుంతల అనే మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చింది. టీవీ సౌండ్ ఇంత ఎందుకు పెట్టారు అని చూడగా రాజేశ్వరి రక్తపు మడుగులో పడి ఉండటం, పక్కన ఆమె ఇద్దరు పిల్లలు ఏడుస్తుండటం గమనించి గట్టిగా కేకలు వేసింది. తిరుచ్చి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మా నాన్న తవిసీలన్ కత్తితో మా అమ్మ రాజేశ్వరి గొంతు కోసి చంపేశాడని కొడుకు సాయిప్రసాద్ పోలీసులకు చెప్పాడు. భార్యను హత్య చేసి పరారైన తవిసీలన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+