Illegal affair: కొత్తగా పెళ్లి, బావతో గంటలు గంటలు ?, భర్తకు కాలిపోయి లేపేశాడు, క్లైమాక్స్ !
చెన్నై/టీనగర్: ఇంట్లో చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న యువతి సంతోషంగా భర్తతో కాపురం చేస్తోంది. వివాహం చేసుకుని భర్త ఇంటిలో కాపురం చేస్తున్న భార్య ప్రతిరోజూ ఆమె బావతో ఫోన్ లో మాట్లాడుతోంది. కొన్నిసార్లు ఎవరితో నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావ్ ? అని భర్త ప్రశ్నించాడు. మా బావతో ఫోన్ లో మాట్లాడుతున్నానని భార్య చెప్పింది.
గంటలు గంటలు మీ బావతో ఎందుకు ఫోన్ లో మాట్లాడుతున్నావు అని భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు. పదేపదే పుట్టింటికి వెళ్లాలని భార్య పట్టుబట్టింది. భార్య, ఆమె బావ ఫోన్ పంచాయితి తారాస్థాయికి చేరింది. భార్య ఆమె బావతో అక్రమ సంబంధం సాగిస్తోందని, ఎంత చెప్పినా మాట వినడం లేదని సహనం కోల్పోయిన భర్త పెళ్లైన ఏడు నెలలకే ఆమెను దారుణంగా హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం కలకలం రేపింది.

ఏడు నెలల ముందు హ్యాపీగా పెళ్లి
చెన్నైలోని గిండి కాలనీలోని లయన్స్ స్కూల్ రోడ్డులో నిత్యానంద (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇంట్లో చూసిన భువనేశ్వరి (24) అనే యువతితో ఏడు నెలల క్రితం నిత్యానంద వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తరువాత నిత్యానంద, భువనేశ్వరి దంపతులు మూడు నెలలు సంతోషంగా కాపురం చేశారు.

హలో..... బావగారు బాగున్నారా !
భువనేశ్వరికి సెల్వా అనే బావ ఉన్నాడు. వివాహం చేసుకున్న తరువాత భువనేశ్వరి ఆమె బావ సెల్వాతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేది. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు అని నిత్యానంద భార్య భువనేశ్వరిని ప్రశ్నించాడు. మా బావతో మాట్లాడుతున్నానని భువనేశ్వరి చెప్పడంతో నిత్యానంద సరే అని కామ్ గా ఉండిపోయేవాడు.

ఒక్కసారి ఫోన్ చేస్తే గంటలు.... గంటలు !
రానురాను భువనేశ్వరి ఆమె బావతో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడటం మొదలు పెట్టింది. డ్రైవర్ గా పని చేస్తున్న నిత్యానంద బయటకు వెళ్లి ఏదైనా అవసరం ఉండి భార్య భువనేశ్వరికి ఫోన్ చేస్తూ ఫుల్ ఎంగేజ్ వచ్చేది. ఎవరు ఫోన్ లో అని ప్రశ్నిస్తే భార్య చెప్పే సమాధానం ఒక్కటే. మా బావతో మాట్లాడుతున్నానని భువనేశ్వరి పదేపదే చెప్పడంతో ఆమె భర్త నిత్యానందకు ఎక్కడో కాలిపోయేది.

నరికేస్తా..... జాగ్రత్త..... సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన భర్త
ప్రతిరోజూ మీ బావతో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడటానికి ఏమి మాటలు ఉంటాయి. మొగుడైన నాతోనే రెండు మూడు నిమిషాలకంటే ఎక్కువగా ఫోన్ లో మాట్లాడవు, నీకు మీ బావకు అన్ని మాటలు ఏమి ఉంటాయి అని నిత్యానంద అతని భార్య భువనేశ్వరిని నిలదీశాడు. ఇదే విషయంలో నిత్యానంద, భువనేశ్వరి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

అక్రమ సంబంధం !
ఎంత చెప్పినా భార్య భువనేశ్వరి తీరు మార్చుకోలేదని నిత్యానంద రగిలిపోయాడు. తన భార్య భువనేశ్వరికి, ఆమె బావకు అక్రమ సంబంధం ఉందని నిత్యానందకు తెలిసింది. కరోనా వైరస్ టైమ్ లో, లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో కూడా పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తానని భువనేశ్వరి చెప్పడంతో నిత్యానందకు మరింత అనుమానం పెరిగిపోయింది.

అడగడానికి నువ్వు ఎవడు ?
మీ బావతో ఇక ముందు ఫోన్ లో మాట్లాడకూడదు అని నిత్యానంద భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నేను ఎవరితోనైనా మాట్లాడుతా ? నువ్వు ఎవరు అడగడానికి అంటూ భార్య భువనేశ్వరి ఎదురుతిరిగింది. పదేపదే భార్య భువనేశ్వరి ఎదురు తిరగడంతో భర్త నిద్యానంద రగిలిపోయాడు నా భార్యను ఇలాగే వదిలేస్తే ఎప్పుడో ఒకసారి కచ్చితంగా నా కొంప ముంచుతుందని నిద్యానందకు డౌట్ వచ్చేసింది.
Recommended Video

భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త
రానురాను భార్య భువనేశ్వరి ఎదురు తిరగడంతో సహనం కోల్పోయిన నిత్యానంద పదునైన కత్తి తీసుకుని ఆమెను దారుణంగా పొడిచి చంపేశాడు. భార్య భువనేశ్వరిని దారుణంగా చంపేసిన నిత్యానంద ఆమె సోదరుడికి ఫోన్ చేశాడు. మీ అక్కను చంపేశాను. వచ్చి శవాన్ని తీసుకెళ్లండి అని చెప్పిన నిత్యానంద నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి పోలీసులకు స్టోరీ మొత్తం చెప్పాడు. పెళ్లైన ఏడు నెలలకే భర్త చేతిలో భువనేశ్వరి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications