Illegal affair: నేను లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు ?, భార్యను షూ లేస్ తో చంపేసిన సులేమాన్ !
చెన్నై/రాణిపేట్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో భర్త వైపు బంధువులు, భార్య వైపు బంధువులు దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. దంపతుల ఇంటికి ఓ బందువు అయిన ఓ యువకుడు వచ్చి వెలుతున్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలోనే అతను ఎక్కువగా వాళ్ల ఇంటికి వెళ్లి వస్తున్నాడని తెలిసింది. ఇదే సమయంలో భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య ఆ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసి తనకు మోసం చేస్తోందని భర్తకు విపరీతమైన డౌట్ వచ్చింది. చాలాకాలంగా దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సహనం కోల్పోయిన భర్త షూలేస్ తీసుకుని భార్య గొంతు బిగించి హత్య చెయ్యడంతో బంధువులు హడలిపోయారు.

17 ఏళ్ల క్రితం పెళ్లి
తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని నవాల్ పూర్ లోని త్యాగిమాణిక్యం వీధిలో సులేమాన్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 17 ఏళ్ల క్రితం సులేమాన్ ముంతాజ్ (36) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సులేమాన్, ముంతాజ్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

భర్త ఫుల్ బిజీగా ఉంటున్నాడు
ముంతాజ్, సులేమాన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో సులేమాన్ వైపు బంధువులు, ముంతాజ్ వైపు బంధువులు దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న సులేమాన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

భార్యతో క్లోజ్ గా ఉంటున్న యువకుడు
ముంతాజ్, సులేమాన్ దంపతుల ఇంటికి ఓ బందువు అయిన ఓ యువకుడు వచ్చి వెలుతున్నాడు. సులేమాన్ ఇంట్లో లేని సమయంలోనే ఆ యువకుడు ఎక్కువగా వాళ్ల ఇంటికి వెళ్లి ముంతాజ్ తో క్లోజ్ గా ఉంటున్నాడని తెలిసింది. గత ఏడాది సులేమాన్ కు తన బందువు ఒక్కడు ఇంటికి వచ్చి వెలుతున్నాడని తెలిసిపోయింది.

భర్తకు డౌట్ మొదలైయ్యింది
నేను ఇంట్లో లేని సమయంలోనే ఆ యువకుడు ఎక్కువగా ఎందుకు ఇంటికి వెళ్లి వస్తున్నాడని సులేమాన్ ఆలోచించాడు. ఇదే సమయంలో భార్య ముంతాజ్ మీద ఆమె భర్త సులేమాన్ కు అనుమానం మొదలైయ్యింది. నా భార్య ముంతాజ్ ఇంటికి వచ్చి వెలుతున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసి తనకు మోసం చేస్తోందని సులేమాన్ కు విపరీతమైన డౌట్ వచ్చింది.

షూ లేస్ తో భార్యను చంపేసిన సులేమాన్
చాలాకాలంగా సులేమాన్, ముంతాజ్ దంపతుల మద్య ఆ యువకుడి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంట్లో సులేమాన్ ఇదే విషయంలో ముంతాజ్ తో గొడవ పెట్టుకున్నాడు. సహనం కోల్పోయిన సులేమాన్ అతను వేసుకునే షూకు ఉన్న లేస్ తీసుకుని అతని భార్య ముంతాజ్ గొంతు బిగించి స్పాట్ లో చంపేశాడు.

పోలీసులకు ఏం చెప్పాడంటే ?
ముంతాజ్ ను హత్య చేసి తప్పించుకుని పారిపోతున్న సులేమాన్ ను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నా భార్య ముంతాజ్ అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేస్తోందని, అందుకే చంపేశానని సులేమాన్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. ముంతాజ్ ను షూ లేస్ తో ఆమె భర్త సులేమాన్ హత్య చెయ్యడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications