Illegal affair: మేనకోడలితో అక్రమ సంబంధం, భర్తకు తెలిసి వార్నింగ్, ఏం చెయ్యలేడని అనుకుంటే !
చెన్నై/ రామనాథపురం: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తూ పిల్లలకు తండ్రి అయ్యాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అనేక మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. బందువుల ఇంటికి వెళ్లిన అతను అక్కడ వారితో సరదాగా ముచ్చట్లు చెప్పి కొంత మందిని ఇప్పటికే వకలలో వేసుకున్నాడు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చిన వరుసకు మేనకోడలు అయ్యే మహిళతో చనువు పెంచుకున్నాడు. అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెలుతున్న అతను ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వరుసకు మేనకోడలు అయ్యే మహిళ కూడా వరుసకు మేనమామ అయ్యే యువకుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయం ఆమె భర్తతో పాటు బంధువులకు తెలిసిపోయింది. ఇక ముందు ఇలాంటి తప్పు చెయ్యనని అతను ఆమె భర్త కాళ్లు పట్టుకుని చెప్పాడు. అయితే రహస్యంగా మహిళను కలుస్తున్న అతను ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న మహిళ భర్త, అతని బంధువు కలిసి కామాంధుడిని అతి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

వివాహం అయ్యి పిల్లలు
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమకుడి సమీపంలోని కలియనూరులో తిరునావుక్కరసు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇప్పటికే వివాహం చేసుకున్న తిరునావుక్కరసు అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తూ పిల్లలకు తండ్రి అయ్యాడు. తమిళనాడు వాటర్ సప్లే బోర్డు కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న తిరునావుక్కరసు భార్య, పిల్లలను పోషిస్తున్నాడు.

భార్య కాకుండా ఐదు మందితో అక్రమ సంబంధం
తిరునావుక్కరసు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. బందువుల ఇళ్లకు వెళ్లిన తిరునావుక్కరసు అక్కడ వారితో సరదాగా ముచ్చట్లు చెప్పి కొంత మందిని ఇప్పటికే వకలలో వేసుకున్నాడు. తిరునావుక్కరసుకు ఇప్పటికే ఐదు మంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూసింది.

వరుసకు మేనకోడలు
కియ్యూరులో తిరునావుక్కరసు బంధువు ముత్తుపాండి ఉన్నాడు. ముత్తుపాండి భార్య విదేశాల్లో ఉద్యోగం చేసి కొంతకాలం క్రితం సొంత ఊరుకికి వచ్చింది. ముత్తుపాండి ఇంటికి వెళ్లి వస్తున్న తిరునావుక్కరసు వరుసకు మేనకోడలు అయ్యే మహిళను లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.

పిచ్చపాటిగా ఎంజాయ్ చేసి చిక్కిపోయారు
అదే సమయంలో విదేశాల నుంచి వచ్చిన వరుసకు మేనకోడలు అయ్యే మహిళతో తిరునావుక్కరసు ఇంకా ఎక్కువ చనువు పెంచుకున్నాడు. అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెలుతున్న తిరునావుక్కరసు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వరుసకు మేనకోడలు అయ్యే మహిళ కూడా వరసుకు మేనమామ అయ్యే తిరునావుక్కరసుతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు.

పక్కాప్లాన్ తో చంపేశారు
భార్య, తిరునావుక్కరసు అక్రమ సంబంధం విషయం ఆమె భర్త ముత్తుపాండికి తెలిసిపోయింది. ఈ విషయం ఆమె భర్త ముత్తుపాండితో పాటు ఆమె బంధువులకు తెలిసిపోయింది. ఇక ముందు ఇలాంటి తప్పు చెయ్యనని తిరునావుక్కరసు ఆమె భర్త ముత్తుపాండి కాళ్లు పట్టుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే రహస్యంగా మహిళను కలుస్తున్న తిరునావుక్కరసు ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న మహిళ భర్త ముత్తుపాండి, అతని బంధువు జీవానందం కలిసి కామాంధుడిని అతి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications