Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియుడితో ఎస్కేప్, భర్త గుర్తుకు వచ్చి సమ్మర్ హాలీడేస్ కు వెళ్లింది. భర్తను చంపేసి !

లూధియానా/ పంజాబ్/ చెన్నై: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య ఇద్దరు కుమార్తెలకు తల్లి అయ్యింది. మేస్త్రీ పని చేస్తున్న భర్త డబ్బులు సంపాధిస్తూ భార్య, అతని ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్నాడు. భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త పనికి వెళ్లిన తరువాత అతని భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కాపురం చేసుకుంటున్న భార్య రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రియుడితో పారిపోయింది. కొంతకాలం భార్యకు అమె భర్త గుర్తుకు వచ్చాడు. కూతుర్లను పిలిచుకుని మళ్లీ భర్త దగ్గరకు వెళ్లి సమ్మర్ హాలీడేస్ గడిపినట్లు భర్తతో నెల రోజులు గడిపింది. తరువాత ప్రియుడు గుర్తుకు రావడంతో భర్తను వదిలిలేసిన కిలాడీ లేడీ మళ్లీ అతని దగ్గరకు వెళ్లిపోయింది. భార్యను వెతుక్కుంటూ వెళ్లిన భర్త అతని భార్య ప్రియుడు, అతని స్నేహితుల చేతిలో హత్యకు గురైనాడు. ప్రియురాలి భర్తను చంపేసిన ప్రియుడు అతని శవాన్ని కూడా పూడ్చేసి చేతులు దులుపుకోవడం కలకలం రేపింది.

 10 సంవత్సరాల క్రితం !

10 సంవత్సరాల క్రితం !

పంజాబ్ లోని లూధియానా సమీపంలోని మోరిండాలోని మజ్రీ గ్రామంలో రాజు సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం పూజాసింగ్ అనే యువతిని రాజూ సింగ్ వివాహం చేసుకున్నాడు. భర్త రాజుసింగ్ తో సంతోషంగా కాపురం చేసిన అతని భార్య పూజా సింగ్ ఇద్దరు కుమార్తెలకు తల్లి అయ్యింది.

 ఖాళీగా ఎందుకుని ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ఖాళీగా ఎందుకుని ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

మేస్త్రీ పని చేస్తున్న భర్త రాజు సింగ్ డబ్బులు సంపాధిస్తూ అతని భార్య పూజాసింగ్, అతని ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్నాడు. రాజుసింగ్ బయటకు వెళ్లిన సమయంలో ఇంటి దగ్గరే ఉంటున్న పూజాసింగ్ కు తజిందర్ సింగ్ అలియాస్ గోల్డీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు, తజిందర్ సింగ్, పూజాసింగ్ ఫోన్ నెంబర్లు మార్చుకుని ఇద్దరూ నిత్యం టచ్ లో ఉంటూ దగ్గర అయ్యాడు. తరువాత రాజుసింగ్ భార్య పూజాసింగ్ తజిందర్ సింగ్ తో అక్రమ సంబంధం పెట్టుకునింది.

 ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

భర్త రాజుసింగ్ పనికి వెళ్లిన తరువాత అతని భార్య పూజాసింగ్ అక్రమ సంబంధం పెట్టుకున్న తజిందర్ సింగ్ తో మస్త్ మజా చేస్తూ అతనితో ఎంజాయ్ చేసింది. రెండు సంవత్సరాల క్రితం భర్త రాజుసింగ్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య పూజాసింగ్ ఇద్దరు కుమార్తెలను పిలుచుకుని ఆమె ప్రియుడు తజిందర్ సింగ్ తో పారిపోయింది.

 సమ్మర్ హాలీడేస్ కు భర్త దగ్గరకు వెళ్లిన భార్య

సమ్మర్ హాలీడేస్ కు భర్త దగ్గరకు వెళ్లిన భార్య

కొంతకాలం తరువాత పూజాసింగ్ కు అమె భర్త రాజుసింగ్ గుర్తుకు వచ్చాడు. కూతుర్లను పిలిచుకుని మళ్లీ భర్త రాజుసింగ్ దగ్గరకు వెళ్లి సమ్మర్ హాలీడేస్ గడిపినట్లు భర్తతో నెల రోజులు గడిపింది. తరువాత ప్రియుడు తజిందర్ సింగ్ గుర్తుకు రావడంతో పూజాసింగ్ ఆమె భర్తను వదిలిలేసిన కిలాడీ లేడీ మళ్లీ ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది.

 భార్య కోసం వెళ్లి మాయం అయిన భర్త

భార్య కోసం వెళ్లి మాయం అయిన భర్త

భార్య పూజాసింగ్ కనపడటం లేదని రాజుసింగ్ మోరిండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తరువాత తన భార్య పూజాసింగ్ ఆమె ప్రియుడు తజిందర్ సింగ్ తో కలిసి మచివారాలోని ఇందిరాకాలనీలో ఉంటున్నదని రాజుసింగ్ కు తెలిసింది. మే 13వ తేదీన భార్య పూజాసింగ్ ను పిలుచుకుని రావడానికి రాజుసింగ్ అతని బావమరిది సంతోష్ కుమార్ సింగ్ బయటకు వెళ్లారు.

 నాలుగు నెలల నుంచి మాయం

నాలుగు నెలల నుంచి మాయం

తరువాత నువ్వు ఇంటికి వెళ్లు నేను పూజాసింగ్ ను పిలుచుకుని వస్తానని రాజుసింగ్ అతని బావమరిది సంతోష్ కుమార్ సింగ్ కు చెప్పాడు. ఆ రోజు వెళ్లిన రాజుసింగ్ తరువాత కనపడలేదు. తన బావ నాలుగు నెలల నుంచి కనపడటం లేదని సంతోష్ కుమార్ సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

 ప్రియురాలి భర్తను చంపేసిన ప్రియుడు

ప్రియురాలి భర్తను చంపేసిన ప్రియుడు

ఇదే సమయంలో రాజుసింగ్ భార్య పూజాసింగ్ అక్రమ సంబంధం గురించి పోలీసులకు తెలిసింది. పోలీసులు తజిందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నాలుగు నెలల క్రితం భార్య పూజాసింగ్ ను వెతుక్కుంటూ వచ్చిన రాజుసింగ్ ను స్నేహితులతో కలిసి నేనే హత్య చేశానని తజిందర్ సింగ్ ఆంగీకరించాడని పోలీసులు అన్నారు.

 శవం కూడా పూడ్చేసిన ప్రియుడు

శవం కూడా పూడ్చేసిన ప్రియుడు

రాజుసింగ్ ను హత్య చేసిన తరువాత అతని శవాన్ని వేరే ప్రాంతంలో పూడ్చి పెట్టామని తజిందర్ సింగ్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. రాజుసింగ్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టుం కోసం పంపించామని, పూజాసింగ్ ప్రియుడు తజిందర్ సింగ్ ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు రాజుసింగ్ హత్యతో అతని భార్య పూజాసింగ్ కు ఏమైనా సంబంధం ఉందా ? అని విచారణ చేస్తున్నామని, ఆమెను కూడా విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+