బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: యువతి, యువకుడు ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దంతులకు ఓ కుమార్తె ఉంది. భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. అక్క ఇంటికి వెళ్లి వస్తున్న భార్యకు అక్కడే ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మహిళ, యువకుడికి 10 ఏళ్ల తేడా ఉంది. కొన్ని నెలల క్రితం ఇంట్లో నిద్రపోతున్న తన భర్త గుండెపోటుతో చనిపోయాడని భార్య అందరిని నమ్మించింది. మద్యంకు బానిస అయిన భర్త గుండెపోటుతో చనియి ఉంటాడని అనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు భర్త అంత్యక్రియులు పూర్తి చేశారు. కూతురిని భర్త కుటుంబ సభ్యులకు అప్పగించిన భార్య ఓ యువకుడితో కలిసి వెళ్లిపోయింది. ఆరు నెలల తరువాత అసలు మ్యాటర్ బయటకు రావడంతో అందరూ హడలిపోయారు.

Reddy: గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చిన హ్యాకర్లు, అకౌంట్స్ హ్యాక్, నూరు జన్మలెత్తినా ఏం చెయ్యలేరు. గాలి!Reddy: గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చిన హ్యాకర్లు, అకౌంట్స్ హ్యాక్, నూరు జన్మలెత్తినా ఏం చెయ్యలేరు. గాలి!

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

బెంగళూరు నగరంలోని నందిని లేఔట్ లో నివాసం ఉంటున్న అంజనేయ (38) అనే వ్యక్తి పెయింటింగ్ పని, టైల్స్ పని చేస్తున్నాడు. 18 ఏళ్ల క్రితం అంజనేయకు అనిత (36) అనే యువతి పరిచయం అయ్యింది. కొంతకాలం ప్రేమించుకున్న అంజనేయ, అనిత తరువాత పెళ్లి చేసుకున్నారు. అంజనేయ, అనిత దంపతులకు 14 ఏళ్ల కుమార్తె ఉంది.

అక్క ఇంటి పక్కన కుర్రాడు

అక్క ఇంటి పక్కన కుర్రాడు

అనిత అక్క బెంగళూరులోని ఉత్తరహళ్లిలో నివాసం ఉంటున్నది. అనిత ఆమె అక్క ఇంటికి ఎక్కువగా వెళ్లేది. తన అక్క ఇంటి పక్కనే నివాసం ఉంటున్న రాకేష్ (26) అనే యువకుడు మూడు సంవత్సరాల క్రితం అనితకకు పరిచయం అయ్యాడు. అనితను చూడగానే ఆమె అందానికి ఫిదా అయిపోయిన రాకేష్ ఆమెతో చనువు పెంచుకున్నాడు. రానురాను వారి పరిచయం కస్తా ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకునే వరకు వెళ్లింది.

కుర్రడాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అని భార్య పాటు

కుర్రడాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అని భార్య పాటు

మూడేళ్లుగా అనిత, రాకేష్ అక్రమ సంబంధం కొనసాగుతోంది. అక్క ఇంటికి వెలుతున్నానని భర్త అంజనేయకు చెప్పి ఇంటి నుంచి వెలుతున్న అనిత ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇంతకాలం అనిత, రాకేష్ ల అక్రమ సంబందం ఎలాంటి గొడవలు లేకుండా యథేచ్ఛగా కొనసాగుతోంది. భార్య అనిత అక్రమ సంబంధం విషయం ఆమె భర్త అంజనేయకు తెలీదు. కనీసం భార్య అనిత మీద అంజనేయకు డౌట్ కూడా రాలేదు.

భర్తకు తెలీకముందే చంపేయాలని భార్య స్కెచ్

భర్తకు తెలీకముందే చంపేయాలని భార్య స్కెచ్

తన అక్రమ సంబంధం విషయం భర్త ఆంజనేయకు తెలిస్తే తనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేస్తాడని అనిత భయపడింది. భర్త ఆంజనేయను హత్య చేయాలని అనిత, ఆమె ప్రియుడు రాకేష్ ప్లాన్ చేసుకున్నారు. భర్త ఆంజనేయను అంతమొందిస్తే తమ అక్రమ సంబంధం గురించి అడిగేవారే ఉండరని అనిత భావించింది. జూన్ 18న రాత్రి ఆంజనేయ పీకలదాక మద్యం సేవించి ఇంటికివెళ్లి నిద్రపోయాడు.

తండ్రి హత్యను కళ్లారా చూసిన కూతురు

తండ్రి హత్యను కళ్లారా చూసిన కూతురు

తరువాత అనిత ఆమె ప్రియుడు రాకేష్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆంజనేయ ముఖం మీద తల దిండు పెట్టి ఊపిరాడకుండా చేసిన అనిత, రాకేష్ పక్కాప్లాన్ ప్రకారం హత్య చేశారు. తండ్రి ఆంజేనయను తల్లి అనిత, ఆమె ప్రియుడు రాకేష్ హత్య చేస్తున్న విషయం 14 ఏళ్ల కూతురు కళ్లారా చూసింది. ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను కూడా చంపేస్తామని అనిత ఆమె కూతురిని బెదిరించింది.

సైలెంట్ గా పని పూర్తి చేసిన భార్య

సైలెంట్ గా పని పూర్తి చేసిన భార్య

తన భర్త ఆంజనేయకు నిద్రలో గుండెపోటు రావడంతో చనిపోయాడని మరుసటి రోజు ఉదయం అనిత అందరికి ఫోన్లు చేసి చెప్పింది. ఆంజనేయ గుండెపోటుతో చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించి బంధువులందరికీ ఫోన్ చేసింది. మద్యానికి బానిసైన ఆంజనేయను అదే మద్యంను అడ్డం పెట్టుకున్న అనిత ఇకనాకు, నాకూతురికి దిక్కు ఎవరని ఆ రోజు నానా హంగామా చేసింది. అనిత డ్రామాను అందరూ నమ్మేసి అదే రోజు బెంగళూరులోని గురగుంటపాళ్యలోని స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రియుడితో జంప్

ప్రియుడితో జంప్

తండ్రి ఆజంనేయన హత్య చేస్తున్న కూతురు భయంతో ఆ విషయం ఇంత వరకు ఎవరికీ చెప్పలేదు. అక్రమ సంబందానికి ఎవరూ అడ్డు లేకపోవడంతో అనిత బరితెగించింది. కూతురిని భర్త కుటుంబ సభ్యుల దగ్గర వదిలేసిన అనిత గత నాలుగు నెలలుగా ప్రియుడు రాకేష్‌తో కలిసి పారిపో వేరే ప్రాంతంలో కాపురం పెట్టింది. ఆంజనేయ మృతిపై అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. తన తండ్రి ఆంజనేయను తన తల్లి అనిత హత్య చేసిందని అనిత కూతురు ఆంజనేయ తల్లికి చెప్పింది. కూతురితో పాటుఆంజినేయ కుటుంబ సభ్యులు నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో అనిత మీద ఫిర్యాదు చేశారు.

ప్రియుడిని తమ్ముడు అని పోలీసులకు చెప్పింది

ప్రియుడిని తమ్ముడు అని పోలీసులకు చెప్పింది

అనిత, రాకేష్ గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులు అనిత, రాకేష్‌లను విచారించారు. రాకేష్ తన తమ్ముడు అని అనిత పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు వారిద్దరినీ విడివిడిగా పోలీసు స్టైల్‌లో విచారించగా ఆంజనేయను హత్య చేసినట్లు ఇద్దరూ అంగీకరించారు. ప్రియుడు

రాకేష్ మోజులో పడి అమాయకుడైన భర్త ఆంజనేయను హత్య చేసిన అనిత ప్రియుడితో కలిసి జైలుకు వెళ్లింది.

English summary
Illegal affair: Love marriage, wife romance with 10 years younger boy, what happened to sleeping husband in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X