Illegal affair: మరిదితో భార్య రొమాన్స్, రెండు రోజుల ముందు భార్య, ఇప్పుడు తమ్ముడు ఫినిష్ !
లక్నో/ ఉత్తరప్రదేశ్: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భర్త తండ్రి, అతని సోదరుడు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. దంపతుల ఇంటికి భర్త తండ్రితో పాటు అతని సోదరుడు వచ్చి వెలుతున్నారు. తన తమ్ముడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అన్నకు అనుమానం మొదలైయ్యింది. ఇదే సమయంలో మహిళ కూడా ఆమె మరిదితో చనువుగా ఉంటోందని తెలిసింది. ఈ విషయంలో భర్త రగిలిపోయాడు. ఇంట్లో భార్యతో ఇదే విషయంలో గొడవపడిన భర్త ఆమెను చంపేసి రెండు రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టేశాడు. ఇంటి మేడ మీదకు వెళ్లిన భర్త రివాల్వర్ తీసుకుని అతని తమ్ముడు, తండ్రిని కాల్చిపారేశాడు. పోలీసులు వచ్చేలోపు అతను కూడా అదే రివాల్వర్ తో కాల్చుకున్నాడు.

భార్యతో సంతోషంగా ఉండేవాడు
బీహార్ లోని బారాబంకి జిల్లాలోని సుబేహా ప్రాంతంలో విజయ్ కుమార్ శుక్లా అలియాస్ విజయ్ శుక్లా (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన అంజలి (30) అనే యువతిని విజయ్ శుక్లా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత విజయ్ శుక్లా, అంజలి దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం మొదలుపెట్టారు.

తండ్రి, తమ్ముడు అదే ప్రాంతంలో నివాసం
విజయ్ శుక్లా తండ్రి రాజ్ నారాయణ్ శుక్లా (65), విజయ్ శుక్లా సోదరుడు అజయ్ శుక్లా (27) అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. విజయ్ శుక్లా, అంజలి దంపతుల ఇంటికి భర్త తండ్రి రాజ్ నారాయణ్ శుక్లాతో పాటు అతని సోదరుడు అజయ్ శుక్లా వచ్చి వెలుతున్నారు. సొంత తమ్ముడు అజయ్ శుక్లా, తండ్రి ఇంటికి వచ్చి వెలుతుంటే కొంతకాలం విజయ్ ఏమీ మాట్లాడలేదు.

తమ్ముడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ?
తన తమ్ముడు అజయ్ శుక్లా తన భార్య అంజలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని విజయ్ శుక్లాకు అనుమానం మొదలైయ్యింది. ఇదే సమయంలో అంజలి కూడా ఆమె మరిది అజయ్ శుక్లాతో చనువుగా ఉంటోందని తెలిసింది. ఈ విషయంలో భార్య అంజలి, తమ్ముడు అజయ్ శుక్లా మీద విజయ్ శుక్లా రగిలిపోయాడు.

భార్య, తమ్ముడిని చంపేశాడు
ఇంట్లో భార్య అంజలితో ఇదే విషయంలో గొడవపడిన విజయ్ శుక్లా సహనం కోల్పోయాడు. భర్త అంజలిని గొంతు నులిమి చంపేసి రెండు రోజులుగా ఆమె శవాన్ని ఇంట్లోనే పెట్టేశాడు. ఇంటి మేడ మీదకు వెళ్లిన విజయ్ శుక్లా కొంతసేపు కేకలు వేశాడు. తరువాత రివాల్వర్ తీసుకుని కింద నిలబడి ఉన్న అతని తమ్ముడు అజయ్ శుక్లాను, అడ్డుపడిన అతని తండ్రి రాజ్ నారాయణ్ శుక్లాను కాల్చిపారేశాడు.

ఐసీయూలో భర్త
పోలీసులు వచ్చేలోపు విజయ్ శుక్లా కూడా అదే రివాల్వర్ తో కాల్చుకున్నాడు. తీవ్రగాయాలైన విజయ్ శుక్లా, అజయ్ శుక్లా, రాజ్ నారాయణ్ శుక్లాను ఆసుత్రికి తరలించారు. అప్పటికే అన్న చేతిలో అజయ్ శుక్లా ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారని బారబంకీ జిల్లా ఎస్పీ అనురాగ్ వాట్స్ మీడియాకు చెప్పారు. భార్య అంజలి, తమ్ముడు అజయ్ శుక్లాను హత్య చేసిన విజయ్ శుక్లా, అతని తండ్రి రాజ్ నారాయణ్ శుక్లా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని బారబంకీ జిల్లా ఎస్పీ అనురాగ్ వాట్స్ అన్నారు. భార్య, తమ్ముడు అక్రమ సంబంధం పెట్టుకున్నారని తెలుసుకుని రిగిలిపోయిన భర్త ఇద్దరికి కంట్రీమేడ్ రివాల్వర్ తో కాల్చి చంపేశాడని బారబంకీ జిల్లా ఎస్పీ అనురాగ్ వాట్స్ అంటున్నారు.












Click it and Unblock the Notifications