Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్తకు విడాకులు, ప్రియుడితో రొమాన్స్, పీస్ పీస్ చేసి పూడ్చేసిన సల్మాన్ ఖాన్, క్లైమాక్స్ !

లక్నో/కాన్పూర్: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. చూడటానికి దంపతులు చూడముచ్చటగా ఉన్నారని బంధువులు అనుకున్నారు. కొన్ని సంవత్సరాలకే దంపతుల మద్య తేడాలు వచ్చాయి. ఇదే టైమ్ లో భార్య ఓ ప్రియుడిని సెట్ చేసుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడి మోజులో పడిన భార్య ఆమె భర్తకు సినిమా చూపించింది. ప్రియుడితో జీవితాంతం జీవించాలని డిసైడ్ అయిన భార్య ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. భర్తకు విడాకులు ఇచ్చిన ప్రియురాలిని ఆమె ప్రియుడు పెళ్లి చేసుకోకుండా టైమ్ పాస్ చేశాడు. కొంతకాలం తరువాత సినిమా స్టైల్లో ఇద్దరికి సీక్రేట్ గా పెళ్లి జరిగింది. రెండో మొగుడితో విహారయాత్రకు వెళ్లిన మహిళ మాయం అయిపోయింది. మహిళ తల్లి కేసు పెట్టడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మాయం అయిన మహిళ కాళ్లు ఒక చోట, చేతులు ఒక చోట, తల ఒక చోట ఇలా ఆమె శరీరంలోని భాగాలు అక్కడక్కడా చిక్కడం కలకలం రేపింది.

 26 ఏళ్లకే భర్తతో తేడాలు

26 ఏళ్లకే భర్తతో తేడాలు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో రబియా (26) అనే మహిళ నివాసం ఉంటున్నది. నాలుగు సంవత్సరాల క్రితం రబియాకు ఓ వ్యక్తి తో వివాహం జరిగింది. రబియాను వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. చూడటానికి రబియా దంపతులు చూడముచ్చటగా ఉన్నారని బంధువులు అనుకున్నారు. కొన్ని సంవత్సరాలకే రబియా దంపతుల మద్య తేడాలు వచ్చాయి.

 ప్రియుడికి స్వర్గం.... భర్తకు నరకం చూపించింది

ప్రియుడికి స్వర్గం.... భర్తకు నరకం చూపించింది

భర్తతో గొడవ పడుతున్న రబియా ఆమె నివాసం ఉంటున్న ఏరియాలోనే ఉంటున్న సల్మాన్ ఖాన్ అలియాస్ సల్మాన్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. రానురాను సల్మాన్ కు దగ్గర అయ్యిన రబియా అతని తో అక్రమ సంబందం పెట్టుకుంది. రబియా ఆమె ప్రియుడు సల్మాన్ ను సెట్ చేసుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడు సల్మాన్ మోజులో పడిన రబియా ఆమె భర్తకు రానురాను నరకం చూపించింది.

 భర్తకు విడాకులు..... ప్రియుడు మాత్రం టైమ్ పాస్

భర్తకు విడాకులు..... ప్రియుడు మాత్రం టైమ్ పాస్

ప్రియుడు సల్మాన్ మోజులో పడిపోయిన రబియా జీవితాంతం అతనితోనే జీవించాలని డిసైడ్ అయ్యింది. ఇదే సందర్బంలో రబియా ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత రబియా ఆమె తల్లి షహనాజ్ ఇంటిలో కాలం గడిపింది. భర్తకు విడాకులు ఇచ్చిన రబియాను పెళ్లి చేసుకుంటానని అంతకాలం నమ్మించిన సల్మాన్ కొంతకాలం ఆమెను పెళ్లి చేసుకోకుండా టైమ్ పాస్ చేశాడు.

 పెళ్లి చేసుకుని చంపేయాలని స్కెచ్

పెళ్లి చేసుకుని చంపేయాలని స్కెచ్

తనను పెళ్లి చేసుకోవాలని రబియా ఆమె ప్రియుడు సల్మాన్ మీద ఒత్తిడి చేసింది. ఈరోజు రేపు అంటూ సల్మాన్ ఖాన్ టైమ్ పాస్ చేశాడు. సల్మాన్ ను పెళ్లి చేసుకోవడానికి వీలులేదని రబియా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కొంతకాలం తరువాత సినిమా స్టైల్లో రబియా, సల్మాన్ ల పెళ్లి సీక్రేట్ గా పెళ్లి జరిగింది. రబియాను రెండో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

 భార్యతో కలిసి ఎంజాయ్ చేశాడు

భార్యతో కలిసి ఎంజాయ్ చేశాడు

జులై 13వ తేదీన రబియాను ఆమె రెండో మొగుడు సల్మాన్ నమ్మించి బయటకు పిలుచుకుని వెళ్లాడు. తరువాత కాన్పూర్ ోని ఝూల్వా ప్రాంతంలో చాలాసేపు సంచరించారు. రెస్టారెంట్ లో భోజనం చేసిన తరువాత రబియా, సల్మాన్ షాపింగ్ చేశారు. రాత్రి 9 గంటల సమయంలో సల్మాన్ అతని భార్య రబియాు బమ్రౌలీలోని అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.

 రబియాను పీస్ పీస్ చేసి చంపేసిన సల్మాన్

రబియాను పీస్ పీస్ చేసి చంపేసిన సల్మాన్

రాత్రి మద్యం సేవించిన సల్మాన్ అతని భార్య రబియాను ఆమె పంజాబీ డ్రెస్ వేల్ తోనే గొంతు బిగించి చంపేశాడు. ముందుగా వెంట తీసుకెళ్లిన పదునైన కత్తి బయటకు తీశాడు. తరువాత రబియా కాళ్లు, చేతులు, తల, శరీరం ఇలా శరీరం మొత్తం ముక్కలు ముక్కలు చేసి బమ్రౌలీ అటవి ప్రాంతంలో పూడ్చి పెట్టి పరారైనాడు.

 కిలాడీ సల్మాన్ ఖాన్ ఏం చేశాడంటే ?

కిలాడీ సల్మాన్ ఖాన్ ఏం చేశాడంటే ?

రబియాను దారుణంగా హత్య చేసిన సల్మాన్ ఆమె వేసుకున్న దుస్తులు మొత్తం అక్కడే కాల్చి బూడిద చేసి ఎలాంటి సాక్షాలు చిక్కకుండా చేశాడు. మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని కాన్పూర్ తో పాటు అనేక ప్రాంతాల్లో తిరిగాడు. చివరికి మళ్లీ కాన్పూర్ చేరుకున్న సల్మాన్ అతని భార్య రబియా మొబైల్ ఫోన్ రైలులో వదిలేసి వెళ్లిపోయాడు.

 43 రోజులకు చిక్కిపోయిన శాడిస్టు సల్మాన్

43 రోజులకు చిక్కిపోయిన శాడిస్టు సల్మాన్

తన కూతురు రబియా కనపడటం లేదని ఆమె తల్లి షహనాజ్ కేసు పెట్టింది. రబియాను హత్య చేసిన 43 రోజుల తరువాత సల్మాన్ పోలీసులకు చిక్కిపోయాడు. అటవి ప్రాంతంలో గాలిస్తే రబియా అస్తిపంజరాలు మాత్రం చిక్కాయని, కేసు విచారణలో ఉందని బమ్రౌలీ పోలీసులు తెలిపారు. మొత్తం మీద భర్తను వదిలేసి సల్మాన్ ను రెండో పెళ్లి చేసుకున్న రబియా దారుణ హత్యకు గురి కావడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+