Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఫ్రీగా చిక్కిందని వడ్డీ వ్యాపారి రోజూ ఫుల్ మీల్స్, చక్రవడ్డీ లెక్కేసిన ప్రియురాలు !

చెన్నై/మదురై: వడ్డి వ్యాపారం చేస్తున్న వ్యక్తి అతని దగ్గర రుణం తీసుకున్న కొందరు మహిళల మీద కన్ను వేశాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఇల్లు కట్టుకోవడానికి ఆ వడ్డి వ్యాపారి దగ్గర అప్పు చేసింది. ఆ మహిళకు డబ్బులు ఇచ్చిన వ్యక్తి వడ్డీకి బదులు ఆమె దగ్గర అన్నీ తీసుకున్నారు. వారంలో రెండు రోజులు ఆమెతో ఎంజాయ్ చేస్తూ వడ్డి డబ్బులుకు బదులుగా ఆమె దగ్గర A to Z వసూలు చేసుకుని ఎంజాయ్ చేశాడు. అయితే అక్కడే ఇద్దరి మద్య తేడాలు వచ్చాయి. నేను నీకు ఇంతకాలం స్వర్గం చూపించానని, అసలు, వడ్డి, చక్ర వడ్డీతో పాటు నీకు ఎంతో ఇచ్చేశానని, ఇప్పుడు అసలు ఇవ్వాలని ఎలా అడుగుతావు అంటూ ప్రియుడిని ఆమహిళ ప్రశ్నించింది. ఓసేయ్ నీ యంకమ్మా, ఇంతకాలం ఫ్రీగా వచ్చిందని ఎంజాయ్ చేస్తే నువ్వు ఇలా రివర్స్ అవుతావా అంటూ వడ్డి వ్యాపారి షాక్ తిన్నాడు. కథ అక్కడి నుంచి అనేక మలుపులు తిరగడం, ఆ మహిళ హత్యకు గురై అటవి ప్రాంతంలో ఓ సంచిలో కుళ్లిపోయిన శవమై కనిపించడం కలకలం రేపింది.

 భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

తమిళనాడులోని మదురైలో తమిళ సెల్వి (31), రాజన్ దంపతులు నివాసం ఉండేవాళ్లు. అనారోగ్యంతో రాజన్ రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త రాజన్ చనిపోవడంతో అప్పటి నుంచి తమిళ సెల్వి ఒంటరిగా నివాసం ఉంటున్నది. ఇదే సమయంలో సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్న తమిళ సెల్వికి కొంచెం డబ్బులు అవసరం అయ్యింది.

 ఓయ్..... లక్ష్మణన్

ఓయ్..... లక్ష్మణన్

మదురై సమీపంలోని వడిపట్టి ప్రాంతంలో ఆపరేటర్ గా పని చేస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్న లక్ష్మణన్ తమిళ సెల్వికి పరిచయం అయ్యాడు. తాను ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చెయ్యాలని, నెలనెల వడ్డీ చెల్లిస్తానని తమిళ సెల్వి వడ్డీ వ్యాపారి లక్ష్మణన్ కు చెప్పింది. తమిళ సెల్వికి అతను రూ. 80 వేలు అప్పుగా ఇచ్చాడు.

 వడ్డీ ఎందుకు..... ఫుల్ మిల్స్ ఇస్తారా డార్లింగ్

వడ్డీ ఎందుకు..... ఫుల్ మిల్స్ ఇస్తారా డార్లింగ్

తమిళ సెల్వి, లక్ష్మణన్ పరిచయం చనువుగా మారింది. నీకు వడ్డీ ఎందుకు, నీకు కావాలసినప్పుడు ఫుల్ మిల్స్ ఇస్తాను వచ్చేయ్ అంటూ తమిళ సెల్వి వడ్డివ్యాపారి లక్ష్మణన్ ను ముగ్గులోకి దింపింది. తరువాత భరత్ లేని తమిళ సెల్వితో లక్ష్మణన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని నెలలకు వడ్డీ డబ్బులు తీసుకోవడం మానేసిన లక్ష్మణన్ ఆమెతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

 అడవిలో లిక్కర్ పార్టీ...... మస్త్ మజా

అడవిలో లిక్కర్ పార్టీ...... మస్త్ మజా

ముందుగానే ఇంట్లో చికెన్, మటన్, కావలసి వంటలు చేసుకుని వడిపట్టి ప్రాంతంలోని అటవి ప్రాంతానికి వెలుతున్న లక్ష్మణన్, అతని ప్రియురాలు తమిళ సెల్వి మద్యం సేవించి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వెలుతున్నారు. చాలా కాలంగా వీళ్లు అటవి ప్రాంతంలోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు.

 అసలు, వడ్డీ ఇవ్వాలా ?, నాతో ఎన్నిసార్లు ఎంజాయ్ చేశావు

అసలు, వడ్డీ ఇవ్వాలా ?, నాతో ఎన్నిసార్లు ఎంజాయ్ చేశావు

ఇటీవల వడ్డీ వ్యాపారి లక్ష్మణన్ కు తమిళ సెల్వి అంటే మోజు తీరిపోయిందో ? ఏమో ? తెలీదు కాని తన దగ్గర తీసుకున్న అసలు రూ. 80 వేలు తిరిగి ఇవ్వాలని ప్రియురాలు తమిళ సెల్వికి చెప్పాడు. నీకు ఇన్ని నెలల నుంచి ఎప్పుడు పడితే అప్పుడు నీ పక్కలో పడుకుని నువ్వు కోరుకున్నట్లు పడక సుఖం అందిస్తున్నానని, ఆ లెక్కన ఎత్తుకుంటే నీకు వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించానని, నువ్వు వేసినట్లు నేను లెక్కలు వేస్తే నువ్వే నాకు బాకీ ఉన్నావని తమిళ సెల్వి ఎదురుతిరిగింది.

 ఫ్రీ అనుకుని ఎంజాయ్ చేస్తే ?

ఫ్రీ అనుకుని ఎంజాయ్ చేస్తే ?

ఇంతకాలం తనకు ఫ్రీగా చిక్కిందని తమిళ సెల్వితో ఎంజాయ్ చేస్తే ఇప్పుడు నా అసలు రూ. 80 వేలకు ఊనం వచ్చిందని, ఎలాగైనా ఆ డబ్బులు వసూలు చేసుకోవాలని లక్ష్మణన్ ప్లాన్ వేశాడు. అయితే తాను డబ్బులు ఇవ్వనని, తన దగ్గర డబ్బు లేదని తమిళ సెల్వి ఆమె ప్రియుడు లక్ష్మణన్ కు తేల్చి చెప్పింది. ప్రియురాలు తమిళ సెల్వి దెబ్బతో ఇంతకాలం ఫ్రీగా ఎంజాయ్ చేసిన లక్ష్మణన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది.

 లిక్కర్ పార్టీ+ ఎంజాయ్ స్కెచ్

లిక్కర్ పార్టీ+ ఎంజాయ్ స్కెచ్

వారం రోజుల క్రితం ప్రియురాలు తమిళ సెల్విని నమ్మించి ఆమెను పిలుచుకుని ఎప్పుడూ వెళ్లే అటవి ప్రాంతంలోకి వెళ్లాడు. తరువాత లక్ష్మణన్, తమిళ సెల్వి పీకలదాక మద్యం సేవించి రెండు గంటలపాటు ఏకాంతంగా ఎంజాయ్ చేశారు. తరువాత తన డబ్బులు ఎప్పుడు ఇస్తావని లక్ష్మణన్ ప్రియురాలితో గొడవపెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో లక్ష్మణన్ వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని ప్రియురాలు తమిళ సెల్వి గొంతు కోసి చంపేశాడు.

 సంచిలో శవం కట్టేసి పరార్

సంచిలో శవం కట్టేసి పరార్

తమిళ సెల్వి శవాన్ని సంచిలో కట్టేసిన ఆమె ప్రియడు మూటను అటవి ప్రాంతంలోని ఓ గుంతలో విసిరేసి పరారైనాడు. వారం రోజుల తరువాత శవం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో హత్యకు గురైన మహిళ వివరాలు పోలీసులకు చిక్కలేదు. శవం మీద ఉన్న మచ్చలు, కొన్ని ఆధారాల ద్వారా హత్యకు గురైయ్యింది తమిళ సెల్వి అని వెలుగు చూసింది. పోలీసులు తమిళ సెల్వి మొబైల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తే వడ్డి వ్యాపారి లక్ష్మణన్ అసలు బండారం బయటపడింది. ప్రియురాలిని హత్య చేసిన వడ్డీ వ్యాపారి లక్ష్మణన్ ఇప్పుడు జైలుపాలైనాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+