Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో కాపురం, బ్యాంకులో భార్యను పొడిచిపారేశాడు, బంగారు నగలు !
చెన్నై/ తేని: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో పెద్దలు రాజీ చేసి వాళ్లను చాలాకాలం పాటు ఒక్కటి చేస్తూ వచ్చారు. అయితే దంపతులు మాత్రం ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయారు. చివరికి దంపతులు విడిపోయి ఎవరిపాటికి వాళ్లు జీవిస్తున్నారు. భార్య పేరుతో ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. భర్తతో విడిపోయిన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని వేరే సిటీలో నివాసం ఉంటున్నది. భార్య ఆమె పేరుతో భర్త ఊర్లో కొంతకాలం క్రితం నగలు కుదువ పెట్టింది. నగల విషయంలో తన మాజీ భార్య బ్యాంకుకు వచ్చిందని భర్తకు తెలిసింది. పట్టపగలు ఫ్రెండ్ ను వెంట పెట్టుకుని వెళ్లిన భర్త అతని మాజీ భార్యను బ్యాంకులోనే ఆమెను దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది. పట్టపగలు నిత్యం రద్దీగా ఉండే బ్యాంకులో ఈ సంఘటన జరగడంతో స్థానికులు హడలిపోయారు. తీవ్రగాయాలైన భార్య ఐసీయూలో చికిత్స పొందుతోంది.

పెద్దలు చేసిన పెళ్లి
తమిళనాడులోని తేనీ జిల్లాలోని తేవారంలోని మొట్టుపట్టి ప్రాంతంలో వేలైస్వామి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలతా అనే యువతితో వేలైస్వామి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న వేలైస్వామి, ప్రేమలతా దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు.

విడిపోయిన దంపతులు
రానురాను వేలైస్వామి, ప్రేమలతా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. వేలైస్వామి, ప్రేమలతా దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో పెద్దలు రాజీ చేసి వాళ్లను చాలాకాలం పాటు ఒక్కటి చేస్తూ వచ్చారు. అయితే వేలైస్వామి, ప్రేమలతా దంపతులు మాత్రం ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయారు. చివరికి వేలైస్వామి, ప్రేమలతా దంపతులు గత ఏడాదిలో విడిపోయి ఎవరిపాటికి వాళ్లు జీవిస్తున్నారు.

ప్రియుడితో కలిసి ఉంటున్న భార్య
వేలైస్వామి తిరుచ్చిలో నివాసం ఉంటున్నాడు. ప్రేమలతా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త వేలైస్వామికి దూరంగా మదురై నగరంలో నివాసం ఉంటున్నది. ప్రియుడి వ్యామోహంలో పడిన తన భార్య ప్రేమలతా తనకు దూరం అయ్యిందని, ఆమె అంతు చూడాలని వేలైస్వామి సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాడు.

భార్య పేరుతో ఆస్తులు
వేలైస్వామి భార్య ప్రేమలతా పేరుతో ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. భర్త వేలైస్వామితో విడిపోయిన ప్రేమలతా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని మదురై సిటీలో ఉండిపోయింది. భర్త వేలైస్వామితో కాపురం చేసే సమయంలోనే ప్రేమలతా ఆమె భర్తతో కలిసి తేవారంలో ఆమె పేరుతో కెనరా బ్యాంకులో నగలు కుదువ పెట్టింది. ప్రేమలతా పేరుతో ఆమె భర్త వేలైస్వామి బ్యాంకులో కుదవ పెట్టిన నగలకు సరైన సమయంలో వడ్డీ చెల్లించకపోవడంతో అవి వేలానికి వచ్చాయి.

నగల కోసం బ్యాంకుకు వెళితే ?
బ్యాంకులో ఉన్న నగలు విడిపించుకోవడానికి ప్రేమలతా తేవారంలోని కెనరా బ్యాంకుకు వెళ్లింది. నగల విషయంలో తన మాజీ భార్య ప్రేమలతా బ్యాంకుకు వచ్చిందని ఆమె భర్త వేలైస్వామికి తెలిసింది. పట్టపగలు ఫ్రెండ్ ను వెంట పెట్టుకుని బ్యాంకులోకి వెళ్లిన వేలైస్వామి అతని మాజీ భార్య ప్రేమలతాను బ్యాంకులో అందరి ముందు కత్తితో దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.
Recommended Video


భర్త ఎస్కేప్
పట్టపగలు నిత్యం రద్దీగా ఉండే బ్యాంకులో ప్రేమలతా మీద హత్యాయత్నం జరగడంతో స్థానికులు హడలిపోయారు. తీవ్రగాయాలైన ప్రేమలతాను తేనీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. భార్య ప్రేమలతా మీద హత్యాయత్నం చేసిన ఆమె భర్త వేలైస్వామి, అతని స్నేహితుడు తప్పించుకుని పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని తేనీ జిల్లా పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications