Illegal affair: పిల్లల ట్యూషన్ టీచర్ తో ఆంటీ ?, లక్షలు ఇచ్చి లేపేయాలని స్కెచ్, ప్లాన్ రివర్స్ !
నోయిడా/ లక్నో: వివాహం చేసుకున్న భర్తతో కాపురం చేస్తున్న భార్య అతనితో సంతోషంగా ఉంటున్నది. భర్త ఉండగానే అతని భార్య ఆమె పిల్లలకు ట్యూషన్ చెబుతున్న టీచర్ ను సెట్ చేసుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. ఆంటీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉండటంతో అతను కూడా ఆమెతో చాలా కాలం ఎంజాయ్ చేశాడు. ఆంటీ మీద మోజు తీరిపోవడంతో అతను సొంత ఊరికి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొంతకాలం తరువాత ప్రియుడు ఆంటీకి పూర్తిగా దూరం అయ్యాడు. ప్రియుడిని దగ్గర చేసుకోవాలని ఆమె అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది. ప్రియుడు ఎక్కడ ఉన్నాడు ? అతని ఇల్లు ఎక్కడ ఉంది అంటూ ఆంటీ ఆరా తీసినా ఫలితం లేదు. ఆంటీకి ఎక్కడో మండిపోయి తన ప్రియుడిని చంపేయాలని డిసైడ్ అయ్యింది. కాంట్రాక్టు కిల్లర్స్ తో ప్రియుడి హత్యకు రూ. కొన్ని లక్షలకు డీల్ మాట్లాడుకుంది. ప్రియుడిని చంపేయాలని కాంట్రాక్టు కిల్లర్స్ అనేక ప్రయత్నాలు చేశారు. అనుకున్న స్కెచ్ రివర్స్ కావడంతో కాంట్రాక్టు కిల్లర్స్ తో పాటు ఆంటీ కూడా పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది.

పిల్లలకు ట్యూషన్ టీచర్
నోయిడాలో రాకేష్, 40 ఏళ్ల రష్మీ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ ను వివాహం చేసుకున్న రష్మీ ఆమె భర్తతో కాపురం చేస్తూ సంతోషంగా ఉంటున్నది. భర్త రాకేష్ వ్యాపారం చేస్తున్నాడు. రాకేష్, రష్మీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రష్మీ పిల్లలకు ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ కు చెందిన వికాస్ (పేరు మార్చడం జరిగింది) ట్యూషన్ చెబుతున్నాడు.

టీచర్ తో అక్రమ సంబంధం
పిల్లలకు ట్యూషన్ చెబుతున్న టీచర్ వికాస్ తో రష్మీ చనువు పెంచుకుంది. ఇంట్లో పిల్లలు, రష్మీ మాత్రమే ఉండటంతో ఆమె టీచర్ వికాస్ మీద మోజు పడింది. ఉదయం వ్యాపారం చెయ్యడానికి బయటకు వెలుతున్న రాకేష్ రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు. రోజుకు రెండు మూడు గంటలు ఇంట్లోనే ఉంటున్న వికాస్ ను వలలో వేసుకున్న రష్మీ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది.

డబ్బు బాగా ఉందని ఆంటీని తగులుకున్నాడు
పిల్లలకు ట్యూషన్ చెబుతున్న టీచర్ వికాస్ ను సెట్ చేసుకుని రష్మీ ఆంటీ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంట్లోనే సీక్రేట్ గా ఎంజాయ్ చేసింది. రష్మీ ఆంటీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉండటంతో వికాస్ కూడా ఆమెతో చాలా కాలం ఎంజాయ్ చేశాడు. చాలాకాలంగా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వస్తున్న వికాస్ తో రష్మీ జల్సా చేసింది.

పెళ్లి చేసుకుని చెక్కేసిన టీచర్
కొన్ని నెలల క్రితం వికాస్ ఉత్తరప్రదేశ్ లోని అతని సొంత ఊరు జౌన్ పూర్ వెళ్లాడు. రష్మీ ఆంటీ మీద మోజు తీరిపోవడంతో వికాస్ సొంత ఊరికి వెళ్లిపోయి కుటుంబ సభ్యులు చూపించిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత కూడా కొన్ని సార్లు వికాస్ నోయిడా వెళ్లి రష్మీ ఆంటీతో ఎంజాయ్ చేశాడని తెలిసింది.

ఆంటీ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రియుడు
కొంతకాలం తరువాత వికాస్ రష్మీకి పూర్తిగా దూరం అయ్యాడు. రష్మీ మొబైల్ ఫోన్ నెంబర్ ను వికాస్ బ్లాక్ లిస్టులో పెట్టాడు. ప్రియుడు వికాస్ తో మాట్లాడాలని, అతన్ని కలవాలని రష్మీ అనేక ప్రయత్నాలు చేసింది. ప్రియుడు వికాస్ ను దగ్గర చేసుకోవాలని రష్మీ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది. ప్రియుడు వికాస్ఎక్కడ ఉన్నాడు ? అతని ఇల్లు ఎక్కడ ఉంది అంటూ రష్మీ ఆంటీ ఆరా తీసినా ఫలితం లేదు.

కిరాయి హంతకులు ఎంట్రీ
వికాస్ తనను మోసం చేశాడని రష్మీ ఆంటీకి ఎక్కడో మండిపోయింది. తన ప్రియుడు వికాస్ ను చంపేయాలని రష్మీ డిసైడ్ అయ్యింది. కాంట్రాక్టు కిల్లర్స్ తో ప్రియుడు వికాస్ ను హత్య చేయించాలని రష్మీ వారితో రూ. 4 లక్షలకు డీల్ మాట్లాడుకుంది. వికాస్ ఫోటో కాంట్రాక్టు కిల్లర్స్ కు ఇచ్చిన రష్మీ ప్రియుడిని చంపేయాలని కాంట్రాక్టు కిల్లర్స్ కు అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చింది.

రెండు రివాల్వర్స్ తో పోలీసులకు చిక్కిపోయారు
బ్యాగ్ లో రెండు రివాల్వర్లు, వికాస్ ఫోటో పెట్టుకున్న కాంట్రాక్టు కిల్లర్స్ అతన్ని హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. నోయిడా జాతీయ రహదారిలో గస్తీ తిరుగతున్న పోలీసులకు అనుమానం వచ్చి కాంట్రాక్టు కిల్లర్స్ ను అదుపులోకి తీసుకుని వారి బ్యాగులు పరిశీలించగా అందులో రెండు రివాల్వర్లు, వికాస్ ఫోటో, రూ. 30 వేల క్యాష్ బయటపడింది.

మేడమ్ తో డీల్ కుదిరింది..... కిలాడీ ఆంటీ అందర్
పోలీసులు కాంట్రాక్టు కిల్లర్స్ ను బెండ్ తీస్తే వికాస్ ను చంపేయడానికి రష్మీ మేడమ్ తో డీల్ మాట్లాడుకున్నామని అంగీకరించారని పోలీసు అధికారులు అన్నారు. కాంట్రాక్టు కిల్లర్స్ ఇచ్చిన సమాచారం మేరకు రష్మీ ఆంటీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ప్రియుడు వికాస్ హత్యకు స్కెచ్ వేసిన రష్మీ మేడమ్ పోలీసులకు చిక్కిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications