Illegal affair: ఇంటి ఓనర్ తో పూజారి భార్య ?, ఆంటీ, కూతురు అందర్, పూజ చెయ్యాలని ఫినిష్ !
గౌహతి/ చెన్నై: గుడిలో పూజారిగా పని చేస్తున్న వ్యక్తి బయట కూడా పూజలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. పూజారి అతని భార్య, కూతురితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఊరి బయట నివాసం ఉంటున్న వ్యక్తి మా ఇంటిలో ప్రత్యేక పూజలు చెయ్యాలని, మంచి రోజు చూసి మా ఇంటికి వచ్చి పూజలు చెయ్యాలని చెప్పాడు. పూజారికి ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్. ఊరి బయట ఉన్న ఇంటిలో పూజలు చెయ్యడానికి వెళ్లిన పూజారి తరువాత ఇంటికి తిరిగిరాలేదు. నా భర్త కనపడటం లేదని పూజారి భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఊరి బయట పూజారి శవం కనపడ్డాడు. పోలీసులు పూజారి హత్య కేసులో అతని భార్య, ఆయన కూతుర్ని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. పూజారి హత్య కేసులో మరి కొందరి ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇంటి యజమానితో పూజారి భార్య అక్రమ సంబంధం పెట్టుందని, అందుకే హత్య చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

గుడిలో పూజారి
అసోంలోని గౌహతిలోని పల్టన్ బజారులో నారాయణ్ చక్రవర్తి అనే ఆయన నివాసం ఉంటున్నాడు. గుడిలో పూజారిగా పని చేస్తున్న నారాయణ్ చక్రవర్తి బయట కూడా పూజలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. పూజారి అతని భార్య మౌషమి, మైనర్ కూతురితో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

పూజలు చెయ్యాలని చెప్పిన స్నేహితుడు
గౌహతి సమీపంలో పూజారి నారాయణ్ చక్రవర్తి స్నేహితుడు సంజీబ్ చౌదరి నివాసం ఉంటున్నాడు. ఊరి బయట నివాసం ఉంటున్న సంజీబ్ చౌదరి మా ఇంటిలో ప్రత్యేక పూజలు చెయ్యాలని, మంచి రోజు చూసి మా ఇంటికి వచ్చి పూజలు చెయ్యాలని పూజారి నారాయణ్ చక్రవర్తికి చెప్పాడు. ఛత్ పూజలు చేస్తే మంచిదని నారాయణ చక్రవర్తి అతని స్నేహితుడు సంజీబ్ చౌదరికి చెప్పాడు.

ఇంటి యజమానితో పూజారి భార్య ?
పూజారి నారాయణ చక్రవర్తికి ఊరి బయట ఉన్న సంజీబ్ చౌదరి ఫ్యామిలీ ఫ్రెండ్. సంజీబ్ చౌదరి మరో ఇంటిలోనే పూజారి నారాయణ చక్రవర్తి అద్దెకు ఉంటున్నాడు. పూజారి నారాయణ చక్రవర్తి భార్య మౌషమికి కూడా సంజీబ్ చౌదరి చాలా క్లోజ్. పూజారి నారాయణ చక్రవర్తి భార్య మౌషమి ఇంటి యజమాని సంజీబ్ చౌదరితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పూజారి నారాయణ చక్రవర్తికి తెలీదని, ఆమె కూతురికి తెలుసని సమాచారం.

పూజ చెయ్యడానికి వెళ్లి శవమై కనిపించిన పూజారి
ఊరి బయట ఉన్న సంజీబ్ చౌదరి ఇంటిలో పూజలు చెయ్యడానికి వెళ్లిన పూజారి నారాయణ చక్రవర్తి తరువాత ఇంటికి తిరిగిరాలేదు. నా భర్త నారాయణ చక్రవర్తి ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత తిరిగిరాలేదని, ఆయన కనపడటం లేదని పూజారి భార్య మౌషమి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఊరి బయట కలిబారి రైల్వే కాలనీలోని సంజీబ్ చౌదరికి చెందిన ఖాళీ స్థలంలో పూజారి నారాయణ చక్రవర్తి శవమై కనిపించాడు.

పూజారి భార్యకు ఏమాత్రం ఫీలింగ్ లేదు
పూజారి నారాయణ చక్రవర్తి కనపడటం లేదని ఫిర్యాదు చేసిన అతని భార్య మౌషమికి భర్త కనపడటం లేదని ఏమాత్రం ఫీలింగ్ లేకుండా ఉందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఊరి బయట పూజారి నారాయణ చక్రవర్తి శవమై కనపడటంతో స్థానికులు హడలిపోయారు. పోలీసులు పూజారి నారాయణ చక్రవర్తి హత్య కేసులో అతని భార్య మౌషమిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

పూజారి హత్య కేసులో భార్య, మైనర్ కూతురు అరెస్టు
పూజారి నారాయణ చక్రవర్తిని ఆయన భార్య మౌషమి, ఆయన మైనర్ కూతురు కలిసి హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పూజారి నారాయణ చక్రవర్తి హత్య కేసులో అతని భార్య మౌషమి, ఆయన మైనర్ కూతుర్ని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. పూజారి నారాయణ చక్రవర్తి హత్య కేసులో మరి కొందరి ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. పూజారి నారాయణ చక్రవర్తి కూతుర్ని జువైనల్ హోమ్ కు తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications