Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఆంటీ మీద మోజు, అర్దరాత్రి వెళ్లిన రౌడీషీటర్, అన్నాతమ్ముడు సేమ్, సినిమా స్కెచ్ తో !

చెన్నై/ మదురై/ విరూద్ నగర్: హత్యలు, హత్యాయత్నాలు చేసిన రౌడీషీటర్ అనేక కేసుల్లో నిందితుడిగా జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. రౌడీషీటర్ గా ముద్రపడిన యువకుడు ఓ ఆంటీతో పాటు మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన రౌడీషీటర్ తనను ప్రత్యర్థులు చంపేస్తారనే భయంతో ఊరు వదిలి వేరే నగరంలో ఉంటున్నాడు. వేరే నగరానికి వెళ్లిన అ రౌడీషీటర్ అతని అనుచరులతో దందాలు, సెటిల్ మెంట్లు చేస్తున్నాడు. వేరే నగరంలో ఉంటున్న రౌడీని అక్కడ మనం హత్య చెయ్యలేమని ప్రత్యర్థులు పసిగట్టారు. ఎలాగైన రౌడీషీటర్ ను హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయిన ప్రత్యర్థులు పక్కాస్కెచ్ వేశారు. ఆంటీ నిన్ను చూడాలని అనుకుంటున్నదని, నీతో ఆమె కోరికలు తీర్చువాలని ఆశపడుతుందని రౌడీషీటర్ కు సమాచారం ఇచ్చారు. ఆంటీతో పాటు మరో ఇద్దరు మహిళలతో ఎంజాయ్ చెయ్యడానానికి ఆ రౌడీషీటర్ సీక్రేట్ గా బయలుదేరాడు. రౌడీషీటర్ ఎంత సీక్రేట్ గా ఆంటీ కోసం వెళ్లాడో అంతే సీక్రేట్ గా ప్రత్యర్థులు అతన్ని పక్కాప్లాన్ తో దారుణంగా వెంటాడి నరికి చంపేశారు. రౌడీషీటర్ ను హత్య చెయ్యడానికి రెండు వర్గాలకు చెందిన ఓ ప్రత్యర్థితో పాటు మరో ఇద్దరు సహకరించారని పోలీసులు గుర్తించారు. గతంలో అన్నా, ఇప్పుడు తమ్ముడు ఆడదాని మోజులో హత్యకు గురి కావడం కలకలం రేపింది. రౌడీషీటర్ హత్యకు గురి కావడానికి ఆంటీతో పాటు మరో ఇద్దరు మహిళలు ఎవరైనా సహకరించారా ? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

రౌడీషీటర్ హవా

రౌడీషీటర్ హవా

తమిళనాడులోని విరూద్ నగర్ కు చెందిన విక్కీ అలియాస్ విఘ్నేష్ మీద హత్యలు, హత్యాయత్నాలు చేశాడని కేసులు నమోదు అయ్యాయి. రౌడీషీటర్ విక్కీ అనేక హత్య కేసుల్లో నిందితుడిగా జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. రౌడీషీటర్ గా ముద్రపడిన విక్కీ జైలుకు వెళ్లక మందే ఓ ఆంటీతో పాటు మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

 మహిళ విషయంలో రౌడీషీటర్ అన్న హత్య

మహిళ విషయంలో రౌడీషీటర్ అన్న హత్య

రౌడీషీటర్ విక్కీకి ముత్తు కమాట్టి అలియాస్ ముత్తు అనే సోదరుడు ఉన్నాడు. పత్యర్థి వర్గం రౌడీ సునక్ రాజ్ సోదరి ఉషా అనే మహిళతో ముత్తుకు అక్రమ సంబంధం ఉంది. ఇదే విషయంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన సుకన్ రాజ్ కజిన్ సిస్టర్ అయిన ఉషాతో అక్రమ సంబంధం నిలిపివేయాలని ప్రత్యర్థులు పదేపదే ముత్తును హెచ్చరించారు. అయితే ఉషాను వదిలిపెట్టడానికి ముత్తు అంగీకరించలేదు. వివాహిత మహిళ ఉషాతో అక్రమ సంబంధం పెట్టుకున్న ముత్తును 2018లో సునక్ రాజ్, అతని అనుచరులు షణ్ముగం, శంకర్ తో పాటు మరికొందరు దారుణంగా హత్య చేశారు.

 అన్న హత్యకు ప్రతీకారంతో జంట హత్యలు

అన్న హత్యకు ప్రతీకారంతో జంట హత్యలు

తన సోదరుడు ముత్తును దారుణంగా హత్య చేసిన సునక్ రాజ్, శంకర్, విఘ్నేష్ తదితరులను చంపేయాలని రౌడీషీటర్ విక్కీ వేచి చూశాడు. పక్కాప్లాన్ ప్రకారం సునక్ రాజ్ అతని అనుచరులతో కలిసి శంకర్, విఘ్నేష్ లను ఒకే సారి హత్య చేశాడు. అదే రోజు విక్కీ తదితరులు వేటకోడవళ్లతో నరకడంతో సునక్ రాజ్ కాలు పూర్తిగా తెగిపోయి అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే సునక్ రాజ్ కాలు తెగిపోయింది.

 విక్కీ హత్యకు మాస్టర్ ప్లాన్

విక్కీ హత్యకు మాస్టర్ ప్లాన్

శంకర్, విఘ్నేష్ ల జంట హత్యల కేసులో విక్కీ జైలుకు వెళ్లాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన రౌడీషీటర్ విక్కీ తనను ప్రత్యర్థులు చంపేస్తారనే భయంతో ఊరు వదిలి మదురై నగరంలో ఉంటున్నాడు. మదురైకి వెళ్లిన రౌడీషీటర్ విక్కీ అతని అనుచరులతో కలిసి విరూద్ నగర్ లో దందాలు, సెటిల్ మెంట్లు చేస్తున్నాడు. మదురైలో తలతాచుకున్న విక్కీని చంపేయాలని సనక్ రాజ్ వర్గం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

 రెండు వర్గాలకు మీడియేటర్

రెండు వర్గాలకు మీడియేటర్

మదురై నగరంలో ఉంటున్న రౌడీ విక్కీని అక్కడ మనం హత్య చెయ్యలేమని ప్రత్యర్థులు సనక్ రాజ్ వర్గం పసిగట్టింది. ఎలాగైన రౌడీషీటర్ విక్కీని హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయిన ప్రత్యర్థులు సునక్ రాజ్ వర్గం పక్కాస్కెచ్ వేశారు. విక్కీ వర్గానికి, సునక్ రాజ్ వర్గానికి మనోజ్ అలియాస్ మనోహరన్ అనే మరో రౌడీషీటర్ మీడియేటర్ గా ఉన్నాడు. విక్కీ హత్యకు మనోజ్ సహాయం చెయ్యాలని సునక్ రాజ్ వర్గం అతనికి మనవి చేసింది.

 ఆంటీ కోసం ఏగేసుకుంటూ వెళ్లిన రౌడీషీటర్

ఆంటీ కోసం ఏగేసుకుంటూ వెళ్లిన రౌడీషీటర్

విరూద్ నగర్ లో ఉన్న ఆంటీ నిన్ను చూడాలని అనుకుంటున్నదని, నీతో ఆమె కోరికలు తీర్చువాలని ఆశపడుతుందని రౌడీషీటర్ విక్కీకి మనోజ్ ద్వారా ఫోన్ చేయించి సమాచారం పంపించారు. ఆంటీతో పాటు మరో ఇద్దరు మహిళలతో ఎంజాయ్ చెయ్యడానానికి రౌడీషీటర్ విక్కీ ఆగస్టు 18వ తేదీన మదురై నుంచి సీక్రేట్ గా కారులో బయలుదేరాడు.

పక్కాప్లాన్ తో ఫినిష్

పక్కాప్లాన్ తో ఫినిష్

రౌడీషీటర్ విక్కీ ఎంత సీక్రేట్ గా ఆంటీ కోసం తారాపురం సమీపంలోని అట్టికాలమ్ ప్రాంతంలోని నిర్జనప్రదేశం దగ్గరకు వెళ్లాడు. అంతే సీక్రేట్ గా నిర్జనప్రదేశంలోకి వెళ్లిన రౌడీషీటర్ విక్కీని అతని ప్రత్యర్థులు పక్కాప్లాన్ తో దారుణంగా వెంటాడి అక్కడే నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. విక్కీ హత్యకు గురైన ప్రాంతంలోనే అతని మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 ఊహించనేలేదు

ఊహించనేలేదు

వివాహిత మహిళతో ఎంజాయ్ చెయ్యడానికి పక్కాప్లాన్ తో వెళ్లిన తనను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేస్తారని రౌడీషీటర్ విక్కీ అస్సలు ఊహించి ఉండడని పోలీసులు అంటున్నారు. పక్కా సినిమా స్కెచ్ తో రౌడీషీటర్ విక్కీని హత్య చేసి తప్పించుకుని పారిపోయిన మనోజ్, సెల్వం, తిరువల రసన్, కరుప్పుస్వామి, హత్యకు స్కెచ్ వేసిన ప్రత్యతర్థి వర్గం రౌడీషీటర్ సనక్ రాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మీద ఆడదాని విషయంలో చిన్న పొరపాటు చేసిన రౌడీషీటర్ విక్కీ దారుణ హత్యకు గురి కావడం విరూద్ నగర్ లో కలకలం రేపింది. మూడు సంవత్సరాల క్రితం విక్కీ అన్న ముత్తు కూడా ఇలాగే ఆడదాని విషయంలో హత్యకు గురైనాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+