Illegal affair: భర్త హ్యాండ్, శ్రీలంక వ్యక్తితో రెండో పెళ్లి, సీక్రెట్ గా ప్రియుడు, క్రికెట్ బ్యాట్ తో !
చెన్నై/కోయంబత్తూర్: భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య ఓ కొడుక్కి తల్లి అయ్యింది. భార్య పక్కదారిపట్టడంతో భర్త ఆమెకు బుద్దిమాటలు చెప్పాడు. భార్య తీరులో మార్పురాకపోవడంతో ఆమెకు హ్యాండ్ ఇచ్చిన భర్త చివరికి వదిలేశాడు. శ్రీలంకకు చెందిన మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న ఆమె అతనితో కాపురం చేస్తోంది. ఇదే సమయంలో సీక్రెట్ గా మూడో ప్రియుడితో నిత్యం టచ్ లో ఉందని, చాలా మందితో నిత్యం ఫోన్లలో మాట్లాడుతోందని ఆమె రెండో భర్తకు తెలిసింది. పదేపదే భార్యకు రెండో భర్త బుద్దిమాటలు చెబుతూ వచ్చాడు. నువ్వు ఎంత చెప్పినా నేను ఇంతే, నా తీరులో ఏమాత్రం మార్పురాదు అని భార్య తేల్చి చెప్పింది. సహనం కోల్పోయిన రెండో భర్త కొడుకు ఆడుకునే క్రికెట్ బ్యాట్ తీసుకుని అతని భార్య తల మీద చితకబాది దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

జెండా ఎత్తేసిన మొదటి మొగుడు
తమిళనాడులోని కోయంబత్తూరులోని కవిత (33) అనే మహిళ నివాసం ఉంటున్నది. 12 సంవత్సరాల క్రితం సెల్వరాజ్ అనే వ్యక్తితో కవిత వివాహం జరిగింది. కవితా, సెల్వరాజ్ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. భార్య కవిత నిత్యం వేరే వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లి వస్తున్న భార్య కవిత తీరుతో ఆమె భర్త విసిగిపోయాడు. కవిత తీరులో మార్పురాకపోవడంతో ఆమెను భర్త వదిలేసి అతని దారి అతను చూసుకున్నాడు.

శ్రీలంక ప్రియుడు
భర్త వదిలేయడంతో కొడుకుతో కలిసి కవిత అదే ప్రాంతంలో నివాసం ఉంటోంది. కోయంబత్తూరులోని శ్రీలంకకు చెందిన శరణార్థుల శిభిరంలో నివాసం ఉంటున్న లావేంద్రిన్ కుమార్ అలియాస్ లావేంద్రిన్ అనే వ్యక్తి కవితకు పరిచయం అయ్యాడు. కవితకు భర్త వదిలేశాడని తెలుసుకున్న కుమార్ నేనునిన్ను ప్రేమిస్తున్నానని ఆమె వెంట తిరిగి చివరికి ఆమెకు శారీరకంగా దగ్గర అయ్యాడు.

రెండో పెళ్లి చేసుకున్న కవిత
కుమార్ పాత కట్టడాలు, భవనాలు కూల్చివేసే కాంట్రాక్టు పనులు చేయిస్తూ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. తనకు పరిచయం అయ్యి శారీరకంగా దగ్గర అయిన కుమార్ ను కవిత రెండో పెళ్లి చేసుకునింది. కవితతో పాటు ఆమె కొడుకు కుమార్ తోనే ఉంటున్నారు. కవితతో కాపురం చేస్తున్న కుమార్ ఆమె కొడుకును కూడా బాగా చూసుకుంటున్నాడు.

కవితకు మూడో ప్రియుడు...... మొబైల్ కు అంకితం
ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెలుతున్న కుమార్ రాత్రి ఇంటికి వెలుతున్నాడు. రెండో భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తరువాత మొబైల్ ఫోన్ ఎత్తుకుంటున్న కవిత గంటలు గంటలు పరాయి మగాళ్లతో మాట్లాడుతూ వచ్చింది. అంతేకాకుండా ఇంటి నుంచి బయటకు వెలుతున్న కవిత వేరే వ్యక్తితో తిరగడం మొదలుపెట్టిందని ఆమె రెండో భర్త కుమార్ కు తెలిసింది.

చెప్పి చూశాడు...... లెక్కచెయ్యలేదు
నువ్వు ఎవ్వరితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నావు అంటూ రెండో భర్త కుమార్ అతని భార్య కవితను ప్రశ్నించాడు. మా అక్కతో మాట్లాడుతున్నా, మా వదినతో మాట్లాడుతున్నా అంటూ రోజుకు ఒక సినిమా స్టోరీ చెబుతూ వచ్చిన కవిత తరువాత రెండో భర్త కుమార్ ను లెక్కచెయ్యకుండా షరామామూలు అంటూ మళ్లీ ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది.

ప్రియుడి ఇంట్లో రెండు రోజులు
ఇటీవల కవిత, ఆమె రెండో భర్త కుమార్ మద్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కుమార్ అతని భార్య కవితను పట్టుకుని చితకబాదేశాడు. నన్నే కొడతావా అంటూ కోయంబత్తూరులోని ఆమె ప్రియుడి ఇంటికి వెళ్లిపోయి రెండు రోజులు అక్కడే ఉండిపోయింది. తరువాత కొడుకు వెళ్లి కవితకు నచ్చచెప్పి మళ్లీ ఇంటికి పిలుచుకుని వెళ్లాడు.

క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేసిన రెండో భర్త
రెండు రోజుల తరువాత ఇంటికి వెళ్లిన భార్య కవితతో మళ్లీ కుమార్ గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో కవిత ఎదురుతిరగడంతో సహనం కోల్పోయిన కుమార్ కవిత కొడుకు ఆడుకునే క్రికెట్ బ్యాట్ తీసుకుని ఆమె తల మీద చితకబాదేశాడు. గట్టిగా కేకలు వేసిన కవిత కుప్పకూలిపోయింది. కవిత తల పగిలిపోవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

భార్యను చంపేసి ఎంజాయ్ చేసిన రెండో మొగుడు
కవితను హత్య చేసిన కుమార్ అక్కడి నుంచి పరారైనాడు. చుట్టుపక్కవాళ్లు కవిత హత్యకు గురైన విషయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుమార్ కోసం గాలించారు. కవితను హత్య చేసిన ఆమె రెండో భర్త కుమార్ శ్రీలంక శరణార్థుల శిభిరంలోని షెడ్ లో కుర్చుని హ్యాపీగా మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. భర్త వదిలేసిన తరువాత రెండో భర్తతో బుద్దిగా కాపురం చేసుకోకుండా చెడుతిరుగుడు తిరిగిన కవిత దారుణ హత్యకు గురి కావడం కోయంబత్తూరులో కలకలం రేపింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications