Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: సోషల్ మీడియా ఆంటీ, తండ్రి లవ్ స్టోరీలో కొడుకు విలన్, హోటల్ రూమ్ లో !

ఉజ్జయిని/ గ్వాలియర్: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తండ్రి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. తన తండ్రి ఉద్యోగం పూర్తి అయ్యి ఇంటికి వచ్చిన తరువాత టీవీ చూడటం ఇష్టం లేక టైమ్ పాస్ కోసం సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాడని ఆయన కొడుకు అనుకున్నాడు. అయితే అక్కడ జరుగుతున్న సీన్ వేరే అనే విషయం అతని కుటుంబ సభ్యులు అంత త్వరగా గుర్తించలేకపోయారు. భర్త చనిపోయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆంటీతో తన తండ్రి సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ కాలం గడుపుతున్నాడని చివరికి అతని కొడుకు తెలుసుకున్నాడు. ఎప్పుడంటే అప్పుడు తండ్రి బయట టూర్లు వెయ్యడం మొదలు పెట్టాడు. డాడీ బయట ఎక్కువ తిరగకూడదు, కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని కొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా తండ్రి మాత్రం ఎవ్వరి మాట వినలేదు. ఒక్కసారి బయట టూర్ వేస్తూ వారం, రెండు వారాల తరువాత తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. తన తండ్రి ఓ ఆంటీతో ఎంజాయ్ చేస్తున్నాడని కొడుకు పసిగట్టాడు. తండ్రిని ఏకంగా 800 కిటోమీటర్లు ఫాలో అయిన కొడుకు ఆయన హోటల్ లో ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కలకలం రేపింది. ఇంతకాలం తన భార్యతో విడాకులు తీసుకుని ఆంటీతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న తండ్రి కొడుకు చేసిన పనికి బిత్తరపోయి ఇప్పుడు పోలీసుల ముందు పంచాయితీలకు హాజరౌతున్నాడు.

తండ్రి ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి

తండ్రి ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో అలోక్ చౌదరి (60) అనే వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అలోక్ చౌదరి ఇంటికి వెళ్లిన తరువాత కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. తన తండ్రి అలోక్ చౌదరి ఉద్యోగం పూర్తి అయ్యి ఇంటికి వచ్చిన తరువాత టీవీ చూడటం ఇష్టం లేక టైమ్ పాస్ కోసం సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాడని ఆయన కొడుకు అంకుర్ అనుకున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆంటీ

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆంటీ

రాజస్థాన్ లోని జైపూర్ లో ఎఫ్ సీఐలో 58 సంవత్సరాల వయసు ఉన్న గీతా చౌదరి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ డెలవప్ మెంట్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నారు. గీతా చౌదరి భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. గీతా చౌదరి, అలోక్ చౌదరికి కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది.

 ఫేస్ బుక్ ఆంటీతో లవ్ లో పడిపోయాడు

ఫేస్ బుక్ ఆంటీతో లవ్ లో పడిపోయాడు

గీతా చౌదరి, అలోక్ చౌదరి సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటూ కాలం గడిపి తరువాత ప్రేమలో పడిపోయారు. భర్త చనిపోయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న గీతా చౌదరి ఆంటీతో తన తండ్రి అలోక్ చౌదరి సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ కాలం గడుపుతున్నాడని, ఆమెతో చాలా సేపు ఫోన్ లో మాట్లాడుతున్నాడని అతని కొడుకు అంకుర్ తెలుసుకున్నాడు.

వారం, రెండు వారాలు ఆంటీతో టూర్లు వేస్తున్న తండ్రి

వారం, రెండు వారాలు ఆంటీతో టూర్లు వేస్తున్న తండ్రి

ఎప్పుడంటే అప్పుడు అలోక్ చౌదరి ఇంటి నుంచి బయటకు వెళ్లి టూర్లు వెయ్యడం మొదలు పెట్టాడు. డాడీ బయట ఎక్కువ తిరగకూడదు, కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని కొడుకు అంకుర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అలోక్ చౌదరి మాత్రం ఎవ్వరి మాట వినలేదు. వారం రెండు వారాలు గీతా చౌదరితో బయటకు వెలుతున్న అలోక్ కుమార్ ఇతర ప్రాంతాల్లో హోటల్స్ లో గది అద్దెకు తీసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

ప్రేమకు వయసుతో పని లేదని !

ప్రేమకు వయసుతో పని లేదని !

నాలుగు రోజుల క్రితం గ్వాలియర్ లోని ఇంటి నుంచి బయలుదేరిన అలోక్ చౌదరి నేను వారం రోజులు ఇంటికి రానని, దేవాలయాలు తిరిగివస్తానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పాడు. నీట్ గా బ్యాగ్ సర్దుకుని బయటకు వెలుతున్న అలోక్ చౌదరిని అతని కొడుకు అంకుర్ ఫాలో అయ్యాడు. నేరుగా రైల్వేస్టేషన్ చేరుకున్న అలోక్ చౌదరి అక్కడ జైపూర్ కు టిక్కెట్ తీసుకున్నాడు.

ఆంటీ, అంకుల్ ప్లాన్ సూపర్

ఆంటీ, అంకుల్ ప్లాన్ సూపర్

జైపూర్ లో రైలు దిగిన అలోక్ చౌదరి నేరుగా అతని ప్రియురాలు గీతా చౌదరి దగ్గరకు వెళ్లాడు. అప్పటికే తండ్రి అలోక్ చౌదరిని అతని కొడుకు అంకుర్ 332 కిలోమీటర్ల దూరం ఫాలో అవుతూనే ఉన్నాడు. అలోక్ చౌదరి, అతని ప్రియురాలు గీతా ఆంటీ జైపూర్ లోని ఓదేవాలయానికి వెళ్లారు. తరువాత అలోక్ చౌదరి, గీతా ఆంటీ జైపూర్ నుంచి రైలులో ఉజ్జయిని బయలుదేరారు. తండ్రి అలోక్ చౌదరితో పాటు గీతా ఆంటీని అంకుర్ రైలులో ఫాలో అయ్యాడు.

హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కొడుకు

హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కొడుకు

ఉజ్జయినిలో రైలు దిగిన అలోక్ చౌదరి అతని ప్రియురాలు గీతాతో కలిసి నేరుగా హోటల్ దగ్గరకు బయలుదేరారు. తండ్రి అలోక్ చౌదరిని వీడియోలు తీస్తూ ఫాలో అవుతున్న అంకుర్ వారిని వెంబడించాడు. తండ్రి అలోక్ చౌదరి ఎక్కడెక్కడికి వెలుతున్నాడు అనే పూర్తి సమాచారాన్ని అతని కొడుకు అంకుర్ వీడియోలు తీస్తూ ఫాలో అవుతున్నాడు. ఉజ్జయినిలోని ఓ హోటల్ లోకి వెళ్లిన అలోక్ చౌదరి, అతని ప్రియురాలు గీతా ఆంటీ రూమ్ లోకి వెళ్లి లోపల డోర్ లాక్ చేసేశారు. అంతే బయట కొడుకు అంకుర్ గట్టిగా కేకలు వేసి రాద్దాంతం మొదలు పెట్టడంతో బయటకు వచ్చిన అతని తండ్రి అలోక్ చౌదరి బిత్తరపోయాడు.

ఆంటీ కోసం భార్యతో విడాకులు తీసుకోవాలని స్కెచ్

ఆంటీ కోసం భార్యతో విడాకులు తీసుకోవాలని స్కెచ్


హోటల్ లో అంకుర్ నానా రాద్దాంతం చెయ్యడంతో హోటల్ యాజమాన్యం అలోక్ చౌదరి, ఆయన ప్రియురాలు గీతా ఆంటీని హోటల్ ఖాళీ చెయ్యమని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రి అలోక్ చౌదరి గీతా ఆంటీ మోజులో పడిపోయి తన తల్లికి ద్రోహం చెయ్యాలని ప్రయత్నించాడని అంకుర్ ఆరోపించాడు. నాకు విడాకులు ఇస్తే నీకు రూ. 13 లక్షలు ఇస్తానని తన తండ్రి అలోక్ చౌదరి తన తల్లి ముందు బేరం పెట్టాడని అంకుర్ ఆరోపించాడు. గ్వాలియర్ నుంచి జైపూర్ కు 332 కిలో మీటర్లు, జైపూర్ నుంచి ఉజ్జయినికి 514 కిలోమీటర్లు తండ్రి అలోక్ చౌదరిని ఫాలో అయిన అంకుర్ ఆయన అక్రమ సంబంధం విషయం బయట పెట్టడం కలకలం రేపింది.

Recommended Video

    తన ఇంటిపై దాడిన అడ్డుకున్న కార్యకర్తలపై అక్రమకేసులు ఎత్తేయాలన్న రేవంత్ రెడ్డి!!
    తండ్రి లవ్ స్టోరీలో కొడుకు విలన్

    తండ్రి లవ్ స్టోరీలో కొడుకు విలన్

    తండ్రి అలోక్ చౌదరిని ఏకంగా 800 కిటోమీటర్లు ఫాలో అయిన కొడుకు అంకుర్ ఆయన హోటల్ లో గీతా ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కలకలం రేపింది. ఇంతకాలం తన భార్యతో విడాకులు తీసుకుని గీతా ఆంటీతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న అలోక్ చౌదరి కొడుకు అంకుర్ చేసిన పనికి బిత్తరపోయి ఇప్పుడు పోలీసుల ముందు పంచాయితీలకు హాజరౌతున్నాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+