• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal Affair:అత్తను అలా చూసిన అల్లుడు..అదే అతనికి చివరి రోజు..కథలో ట్విస్ట్..!

|

చెన్నై/పొల్లాచ్చి: భర్త చనిపోవడంతో మహిళ కుమార్తెతో కలిసి జీవించింది. భర్త లేని ఆంటీ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కుమార్తె పెరిగి పెద్దది కావడంతో ఆమె ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. కూతురు పెళ్లి చేసుకుని ఆమె భర్తతో కాపురం చేస్తోంది. కూతురికి పెళ్లి జరిగినా ఆమె తల్లి మాత్రం అక్రమ సంబంధం వదులుకోలేదు. అత్తా అమె ప్రియుడు బెడ్ రూమ్ లో మంచి రసపట్టులో ఉన్న సమయంలో అల్లుడు ఎంట్రీ ఇచ్చాడు. నో ఎంట్రీ టైమ్ లో చూడరాని సీన్ చూసి అల్లుడు రెచ్చిపోయాడు. అంతే అత్త ప్రియుడు దెబ్బకు అల్లుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

Wife: నా మొగుడు పచ్చి కామాంధుడు, నేను తట్టుకోలేను, కోడిపులుసు టెక్నిక్‌తో చంపేసిన భార్య !

ఆంటీ అక్రమ సంబంధం

ఆంటీ అక్రమ సంబంధం

తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలోని పుదురై ప్రాంతంలో రాణి అనే మహిళ నివాసం ఉంటున్నది. 14 ఏళ్ల క్రితం రాణి భర్త మరణించాడు. భర్త మరణించడంతో రాణి, ఆమె కుమార్తె పూంగోడి సెల్వితో కలిసి జీవించింది. 10 సంవత్సరాల క్రితం రాణికి దండపాణి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తరువాత దండపాణి, రాణి అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

ఆంటీ కూతురి పెళ్లి

ఆంటీ కూతురి పెళ్లి

రాణి, దండపాణి అక్రమ సంబంధం పెట్టుకున్న సమయంలో ఆమె కుమార్తె సెల్వికి 11 ఏళ్ల. ఇప్పుడు పెరిగి పెద్దిది అయిన పూంగోడి సెల్వి దురై అనే యువకుడిని వివాహం చేసుకుంది. సెల్వి, ఆమె భర్త దురై సంతోషంగా కాపురం చేస్తున్నారు. కుమార్తెకు పెళ్లి చేసిన రాణి మాత్రం ప్రియుడు దండపాణితో అక్రమ సంబంధం మాత్రం మానుకోలేదు.

 అత్త బెడ్ రూమ్ లో మస్త్ మజా... అల్లుడు ?

అత్త బెడ్ రూమ్ లో మస్త్ మజా... అల్లుడు ?

ప్రియుడు దండపాణిని ఇంటికి పిలిపించుకుంటున్న రాణి బెడ్ రూమ్ లో అతనితో కలిసి మస్త్ మజా చేస్తోంది. ఓ సారి అల్లుడు దురై అనుకోకుండా బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బెడ్ రూమ్ లో అత్త రాణి, ఆమె ప్రియుడు దండపాణి నగ్నంగా ఉన్న విషయం గుర్తించిన దురై షాక్ అయ్యాడు.

 రోజూ ఇదే పంచాయితి

రోజూ ఇదే పంచాయితి

మీ అమ్మ అక్రమ సంబంధం పెట్టుకుని మన పరువు తీస్తోందని, నువ్వే ఆమెను మందలించాలని దురై భార్య సెల్వికి చెప్పాడు. నీ పద్దతి మార్చుకోవాలని, మన పరువు పోతుందని, మీ అల్లుడు మండిపడుతున్నాడని సెల్వి ఆమె తల్లి రాణికి బుద్దిమాటలు చెప్పింది. కూతురు, అల్లుడు చెప్పినా రాణి మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు.

నో ఎంట్రి టైమ్ లో కూతురు, అల్లుడు !

నో ఎంట్రి టైమ్ లో కూతురు, అల్లుడు !

రాణి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఆమె ప్రియుడు దండపాణి ఇంటికి వెళ్లి బెడ్ రూమ్ లో రొమాన్స్ చేశాడు. అదే సమయంలో రాణి కుమార్తె సెల్వి, అల్లుడు దురై ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. తల్లి చేస్తున్న పాడుపని చూసిన సెల్వి మండిపడింది. అదే సమయంలో గొడవ పెద్దది కావడంతో రాణి ప్రియుడు దండపాణి కత్తి తీసుకుని కూతురు సెల్వి, అల్లుడు దురైని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

అత్త దెబ్బకు అల్లుడు ఔట్

అత్త దెబ్బకు అల్లుడు ఔట్

కత్తి పోట్లతో తీవ్రగాయాలైన దురై, అతని భార్య సెల్వి గట్టిగా కేకలు వేసి కుప్పకూలిపోయారు. విషయం గుర్తించిన స్థానికులు దురై, అతని భార్య సెల్విని కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దారిలోనే దురై ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సెల్వి పరిస్థితి కూడా విషమంగా ఉందని కోయంబత్తూరు వైద్యులు చెప్పారు. దురైని హత్య చేసిన దండపాణిని వడిక్కిపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అత్త అక్రమ సంబంధానికి అల్లుడు హత్యకు గురి కావడం పొల్లాచ్చిలో కలకలం రేపింది.

English summary
Illegal relationship: Son in law murder near Pollachi due to illegal affair and family issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X