lady teacher: మేడమ్ కు పక్కింట్లో బాయ్ ఫ్రెండ్, కొడుక్కి 18 ఏళ్లు, భర్త ఏం చేశాడంటే ?, స్పాట్ లో ?

పక్కింటి అబ్బాయితో స్కూల్ టీచర్ అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య గురించి పక్క రాష్ట్రంలో కూడా చర్చ జరగడంతో భర్త విసిగిపోయిన మాజీ మొగుడు పక్కాప్లాన్ తో వచ్చి లేడీ టీచర్ ను స్పాట్ లో లేపేశాడు.

బెంగళూరు/విజయపుర: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. వివాహం జరిగిన తరువాత భార్యకు ప్రభుత్వ స్కూల్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. భర్త వ్యాపారం చేస్తున్నాడు. దంపతులు సంతోషంగా జీవిస్తున్న సమయంలో పక్కింటి వ్యక్తి కారణంగా గొడవలు మొదలైనాయి. పక్కింటి అబ్బాయితో స్కూల్ టీచర్ అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలాకాలం పాటు లేడీ టీచర్ తీరుతో విసిగిపోయిన ఆమె భర్త అతని భార్యను వదిలేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. భార్య గురించి పక్క రాష్ట్రంలో కూడా చర్చ జరగడంతో భర్త విసిగిపోయాడు. అంతే పక్కాప్లాన్ తో వచ్చిన మాజీ మొగుడు లేడీ టీచర్ ను స్పాట్ లో లేపేశాడు.

భీమా తీరం అంటేనే హడల్

భీమా తీరం అంటేనే హడల్


కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని భీమాతీరం అంటేనే హత్యలకు పేరుమోసిన ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు ఎవరు హత్యకు గురౌతారో చెప్పడం చాలా కష్టం. ఇటీవల వివాదాలకు ముగింపు పలికేందుకు ఏడీజీపీ అలోక్ కుమార్ అనేక మందితో చర్చలు జరిపారు. పాతకక్షల కారణంగా, చిన్న చిన్న విషయాలకు హత్యలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీజీపీ అలోక్ కుమార్ మూడు రోజుల క్రితమే హెచ్చరించారు.

 ఉర్దూ టీచర్ దారుణ హత్య

ఉర్దూ టీచర్ దారుణ హత్య

విజయపురం జిల్లాలోని ఇండి పట్టణంలో మహిళను హత్య చేశారు. పగటిపూట ఉర్దూ స్కూల్ టీచర్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఇండి పట్టణంలోని అంజుమన్ కళాశాల రోడ్డులో చోటుచేసుకుంది. దిలాషద్ హవల్దార్ (36) అనే మహిళ హత్యకు గురైయ్యిందని పోలీులు తెలిపారు. లేడీ టీచర్ దిల్ షాద్ కుమారుడిపై కూడా కత్తితో దాడి చెయ్యడంతో అతనికి తీవ్రగాయాలైనాయి. లేడీ టీచర్ ను హత్య చేసి పరారయ్యారు. ఇండి పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

లేడీ టీచర్ కు అక్రమ సంబంధం

లేడీ టీచర్ కు అక్రమ సంబంధం

హత్యకు గురైన లేడీ టీచర్ దిలాషాద్ హవల్దార్‌కు ఆమె పక్క ఇంట్లో ఉండే మరొకరికి మధ్య స్నేహం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసిందని పోలీసులు అన్నారు. దిల్ షాద్ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె భర్త విసిగిపోయి భార్యను వదిలేసి మహారాష్ట్రలోని షోలాపూర్‌లో స్థిరపడి అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

 భార్యకు వార్నింగ్ ఇచ్చాడు

భార్యకు వార్నింగ్ ఇచ్చాడు

భర్త వదిలేసినా లేడీ టీచర్ మాత్రం ప్రియుడితో రొమాన్స్ చేస్తోందని ఆమె భర్త బాద్ షా షేక్‌ రగిలిపోయాడు. మరో మహిళను వివాహం చేసుకున్నా బాద్ షా షేక్ మాత్రం అతని మొదటి భార్య దిల్ షాద్ నుమరిచిపోలేకపోయాడు. దిల్ షాద్, బాద్ షా దంపతులకు 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. నువ్వు పద్దతి మార్చుకోవాలని ఇటీవల చాలాసార్లు బాద్ షా అతని మాజీ భార్య దిల్ షాద్ కు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చాడు. అయితే లేడీ టీచర్ దిల్ షాద్ మాత్రం మాజీ భర్త హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు.

లేడీ టీచర్ ను స్పాట్ లో చంపేశాడు

లేడీ టీచర్ ను స్పాట్ లో చంపేశాడు

సాయంత్రం మాజీ భార్య ఇంటికి వెళ్లిన ఆమె మాజీ భర్త బాద్ షా షేక్ లేడీ టీచర్ అక్రమ సంబంధం గురించి నిలదీశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన బాద్ షా షేక్ కత్తి తీసుకుని లేడీ టీచర్ దిల్ షాద్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచారు. అడ్డుపడిన కొడుకును కత్తితో పొడిచిన బాద్ షా అక్కడి నుంచి పరారైనాడు, కత్తిపోట్లు ఎక్కువగా పడటంతో లేడీ టీచర్ దిల్ షాద్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొడుకుకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. భార్యను హత్య చేసిన బాద్ షా పరారైనాడు. ఇండి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+